RRB Assistant Loco Pilot Jobs : ఆర్ఆర్బీ 5696 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆర్ఆర్బీ రీజియన్స్
అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పుర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్ము, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పుర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పుర్
ట్రేడ్ విభాగాలు
ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్రైట్/ మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ (రేడియో/టీవీ), ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ (మోటార్ వెహికల్), వైర్‌మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, మెకానిక్ (డీజిల్), హీట్ ఇంజిన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్
విద్యార్హతలు
RRB Assistant Loco Pilot Qualifications :అభ్యర్థులు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాస్ అయ్యుండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీంగ్ల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి.
వయోపరిమితి
RRB Assistant Loco Pilot Age Limit :
- అభ్యర్థుల వయస్సు 2024 జులై 1 నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనలు అనుసరించి, ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
RRB Assistant Loco Pilot Fee :జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.