Road Accident In Rajasthan : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఓ ట్రాలీ అదుపు తప్పి వ్యాన్‌ను ఢీ కొట్టిన ఘటనలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున ఝలావర్ జిల్లాలోని అకలేరాలో జరిగింది. మధ్యప్రదేశ్‌లో ఓ వివాహ వేడకకు హాజరయ్యే తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా అకలేరా సమీపంలోని దుంగార్ గ్రామాని చెందిన వారని పోలీసులు తెలిపారు. ఆ గ్రామానికి చెందిన కొంతమంది తమ బంధువు వివాహ వేడుక కోసం శనివారం మధ్యప్రదేశ్‌కు వెళ్లారని, తిరిగి వస్తుండగా ట్రాలీ ఢీ కొట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రమాదం గురించి కుటుంబ సభ్యలకు సమాచారం అందించామని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం మృతదేహాలను అకలేరా ఆస్పత్రిలో ఉంచినట్లు తెలిపారు.
ముగ్గురు వ్యక్తులపై దూసుకెళ్లిన లారీ
Uttar Pradesh Road Accident: ఉత్తర్‌పద్రేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
మైన్‌పురి జిల్లాలోని ఎటా ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు ఆదివారం జరిగే వివాహా వేడకకు హజరయ్యేందుకు వెళ్లారు. అయితే శనివారం రాత్రి 8గంటల సమయంలో వాకింగ్‌కు బయటకు వెళ్లారు. చరకా టోలా సమీపంలో ముందు నుంచి వేగంగా వస్తున్న ఓ లారీ ఈ ముగ్గురిని ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరంతా చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ కోసం గాలిస్తున్నామని అన్నారు.