Recipes With Sattu Pindi :ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. అయితే, సమ్మర్‌లో మనం ఎన్ని వాటర్ తాగినా కూడా బాడీ డీహైడ్రేట్ అవుతూనే ఉంటుంది. అలాగే కొన్నిసార్లు వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఆహారం ఏమి తినాలని అనిపించదు. ఇలాంటి వారు ఈ ఎండాకాలంలో సత్తుపిండితో కొన్ని రెసిపీలుప్రిపేర్ చేసుకుని తింటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులంటున్నారు. సత్తుపిండితో చేసిన వంటకాలను తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని తెలియజేస్తున్నారు. మరి ఇంతకీ సత్తుపిండితో ఎటువంటి వంటకాలు ట్రై చేయాలో ఇప్పుడు చూద్దాం.
సత్తు పరోటా :
కావాల్సిన పదార్థాలు :
- సత్తు పిండి - 100 గ్రాములు
- ఆయిల్- 2 టేబుల్ స్పూన్
- ఉల్లిపాయ - 1
- వెల్లుల్లి రెబ్బలు - 5
- జీలకర్ర- అర టీస్పూను
- ఉప్పు- సరిపడినంత
- మిరియాల పొడి - 1 టీ స్పూన్
- గోధుమ పిండి - రెండు గ్లాసులు
సత్తు పరోటా తయారు చేయు విధానం :
- ముందుగా పరోటాలలోకి స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం సత్తుపిండిలో కట్ చేసిన వెల్లుల్లి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్, వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా కలుపుకోవాలి.
- తర్వాత గోధుమ పిండిని తీసుకుని చపాతీల పిండిలా మెత్తగా కలుపుకోవాలి.
- పిండిని ఉండలుగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఒక ఉండ తీసుకుని కొద్దిగా పల్చగా ఒత్తుకుని అందులోకి ముందే రెడీ చేసుకున్న స్టఫ్ పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. తర్వాత వాటిని పరోటాలుగా చేసుకోవాలి. మిగిలిన ఉండలను కూడా ఇలానే చేసుకోవాలి.
- ఈ పరోటాలను వేడివేడి పెనం మీద ఆయిల్ లేదా నెయ్యి వేసుకుని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి.
- అంతే ఇలా సింపుల్‌గా సత్తు పరోటాను ప్రిపేర్ చేసుకోవచ్చు.