Nagaland Lottery Winner : పంజాబ్‌లోని మోగాకు చెందిన ఓ వ్యక్తి జాక్ పాట్ కొట్టేశాడు. లాటరీలో ఏకంగా రూ.కోటి దక్కించుకున్నాడు. దీంతో అతడి అనందానికి అవధుల్లేకుండా పోయాయి.
అసలేం జరిగిందంటే?
మోగా జిల్లాలోని ఖోసా కోట్లా గ్రామానికి సుఖ్‌దేవ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తి రూ.6 విలువైన 25 లాటరీ టికెట్లను కొన్నాడు. అంటే మొత్తం రూ.150 విలువైన లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. అందులో ఓ టికెట్‌కు రూ.కోటి లాటరీ తగిలింది. ఈ విషయాన్ని సుఖ్‌దేవ్ సింగ్ ధలీవాల్‌కు నవంబరు 22న ఫోన్ చేసి తెలియజేశాడు లాటరీ టికెట్ల అమ్మకందారుడు విక్కీ గులాటి. దీంతో ధలీవాల్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.
సుఖ్‌దేవ్ సింగ్ కుటుంబ సభ్యులు (ETV Bharat) వెంటనే కార్యాలయానికి చేరుకుని!
వెంటనే లూధియానాలో శివమ్ ఏజెన్సీకి చెందిన నాగాలాండ్ స్టేట్ లాటరీ కార్యాలయానికి చేరుకున్నాడు ధలీవాల్. తాను గెలుపొందిన లాటరీ టికెట్‌ను వారికి చూపించాడు. తనకు రూ.కోటి వచ్చిందని నిర్ధరించుకుని ఆనందంలో తేలిపోయాడు.
గెలుచుకున్న లాటరీ టికెట్‌తో సుఖ్‌దేవ్ సింగ్ (ETV Bharat) 'పేదల కోసం ఖర్చు చేస్తా'
"లాటరీ ద్వారా వచ్చిన మొత్తంతో నా కుటుంబ అవసరాలను తీర్చుతాను. అలాగే కొన్ని ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తాను. పిల్లల ఉన్నత చదువులకు ఖర్చుపెడతాను. అలాగే ఇంటి మరమ్మతు పనులను కూడా పూర్తి చేస్తాను. కొంత భాగాన్ని సామాజిక సేవ కోసం వినియోగిస్తాను. గ్రామంలోని నిరుపేదలను ఆదుకుంటాను. అలాగే సామాజిక, సంక్షేమ కార్యక్రమాలకు చేపడతాను." అని సుఖ్‌దేవ్ సింగ్ ధలీవాల్ తెలిపాడు.
సంతోషం వ్యక్తం చేసిన గ్రామస్థులు
లాటరీలో సుఖ్‌దేవ్ సింగ్ ధలీవాల్ రూ.కోటి దక్కించుకోవడం వల్ల ఖోసా కోట్లా గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. సుఖ్‌దేవ్ సింగ్‌ను అభినందించారు. లాటరీలో సుఖ్‌దేవ్ సింగ్ రూ.కోటి గెలవడం గ్రామస్థులకు గర్వకారణమని సర్పంచ్ తెలిపారు.
రోజూ వేలాది మంది లాటరీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారని నాగాలాండ్ స్టేట్ లాటరీ మేనేజర్ తెలిపారు. ప్రజలు కొన్నిసార్లు భారీ మొత్తంలో డబ్బును గెలుచుకోవడానికి ఇదొక సువర్ణావకాశంగా మారుతుందని పేర్కొన్నారు. లాటరీ ప్రైజ్ మనీలో కొన్ని తగ్గింపులు ఉంటాయని వెల్లడించారు. ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని లాటరీ విజేత బ్యాంకు అకౌంట్లో జమ అవుతుందని పేర్కొన్నారు.