Prawns Special Dishes: నాన్ వెజ్‌లో చాలా మంది చికెన్ ఎక్కువగా తింటారు. ఆ తర్వాత ప్లేస్‌లో మటన్ ఉంటుంది. అయితే.. ఈ సండే మీ ఇంట్లో సీఫుడ్ ట్రై చేయండి. ఇందులోనూ చేపలు తరచూ తింటూనే ఉంటారు. కాబట్టి.. ఈసారి రొయ్యలతో సూపర్ వెరైటీస్ టేస్ట్ చేయండి. మీకోసమే ప్రాన్స్‌తో చేసుకునే వెరైటీ రెసిపీస్ లిస్ట్ పట్టుకొచ్చాం. ఇక లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం.
ప్రాన్స్ ఘీ పెప్పర్ ఫ్రై(Prawns Ghee Pepper Fry)
కావలసినవి:
- రొయ్యలు- పెద్ద కప్పు
- నెయ్యి- మూడు టేబుల్‌స్పూన్లు
- కరివేపాకు రెబ్బలు- రెండు
- వెల్లుల్లి తరుగు- టేబుల్‌స్పూను
- మిరియాలపొడి- స్పూన్
- ఉల్లిపాయ- ఒకటి
- చింతపండు గుజ్జు- స్పూన్
- బెల్లం తరుగు- స్పూన్
- ఉప్పు- తగినంత
How to Prepare Palak Prawns Curry : 'పాలక్ ప్రాన్స్ కర్రీ..' నోరూరిపోవాల్సిందే!
మసాలా కోసం:
- ఎండుమిర్చి- రెండు
- మిరియాలు- స్పూన్
- జీలకర్ర- స్పూన్
- సోంపు-స్పూన్
- అనాసపువ్వు- ఒకటి
- కరివేపాకు రెబ్బలు-రెండు
తయారీ విధానం:
- ముందుగా మసాలా సిద్ధం చేసుకోవాలి.
- అందుకోసం మసాలా కోసం పెట్టుకున్న పదార్థాల(ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, సోంపు, అనాసపువ్వు, కరివేపాకు రెబ్బలు)ను కడాయిలో వేసి వేయించుకుని తీసుకోవాలి. వాటి వేడి చల్లారాక మెత్తగా పొడి చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఓ గిన్నెలో బెల్లం తరుగు, చింతపండు గుజ్జు తీసుకుని కలుపుకోవాలి.
- తర్వాత స్టౌ మీద కడాయిని పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక కరివేపాకును వేయించుకుని వెల్లుల్లి తరుగు వేయాలి.
- ఇందులో ఉల్లిపాయముక్కల్ని వేసి వేయించి... మిరియాలపొడి, చేసిపెట్టుకున్న మసాలా, చింతపండు, బెల్లం కలిపిన గుజ్జు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
- ఇది వేగుతున్నప్పుడు శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసి వాటికి మసాలా పట్టేవరకూ కలిపి దింపేయాలి. అంతే ఘుమఘుమలాడే ప్రాన్స్ ఘీ పెప్పర్ ఫ్రై రెడీ..
ప్రాన్స్ సాంబార్ మసాలా ఎప్పుడైనా ట్రై చేశారా?
ప్రాన్స్ 65(Prawns 65)
కావాల్సినవి:
- రొయ్యలు- 250గ్రా
- పసుపు- పావు స్పూన్
- మిరియాలపొడి- పావు స్పూన్
- జీలకర్రపొడి- అరస్పూన్
- ఉప్పు- తగినంత
- ధనియాల పొడి- స్పూన్
- కారం- స్పూన్
- మొక్కజొన్న పిండి- స్పూన్
- సెనగపిండి- స్పూన్
- బియ్యప్పిండి- స్పూన్
- నిమ్మరసం- స్పూన్
- నూనె- తగినంత
తయారీ:
- ముందుగా రొయ్యల్ని పసుపు వేసి శుభ్రం చేసుకోవాలి.
- ఇప్పుడు ఓ గిన్నెలో రొయ్యలు, మిరియాలపొడి, జీలకర్రపొడి, ధనియాల పొడి, కారం వేసి కలపాలి.
- ఆ తర్వాత బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, శనగపిండి వేసి.. మసాలా మొత్తం రొయ్యలకు పట్టించాలి.
- చివరిగా నిమ్మరసం, ఉప్పువేసి మరోసారి కలపాలి.
- ఈ మసాలా పట్టించిన రొయ్యలని ఒక్కోటిగా నూనెలో వేయించుకుంటే ప్రాన్ 65 సిద్ధం.
నాన్‌వెజ్ స్పెషల్.. మిక్స్డ్ ఫ్రైడ్ బిర్యానీ చేసేద్దామా?
రొయ్యల ఆమ్లెట్(Prawns Omelette)
- రొయ్యలు-20
- బఠాణీ గింజలు- 100 గ్రాములు
- గుడ్లు – 3
- కారం-ఒక టీ స్పూన్
- మిరియాల పొడి-ఒక టీ స్పూన్
- సోయాసాస్ ఒక టీ స్పూన్
- పసుపు-చిటికెడు
- నువ్వుల నూనె, కొత్తిమీర తురుము, పుదీనా తురుము, ఉల్లికాడలు, ఉప్పు- రుచికి తగినంత
తయారీ విధానం:
- రొయ్యలను శుభ్రం చేసుకుని లైట్‌గా ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసి వాటిని ఉడికించుకోవాలి. అలాగే పచ్చి బఠానీలను కూడా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత ఒక గిన్నె తీసుకుని గుడ్లు, చిటికెడు ఉప్పు, కారం, మిరియాల పొడి, అర టీ స్పూన్ సోయాసాస్ వేసుకుని బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం స్టౌ వెలిగించి బాణలి పెట్టుకుని వేడెక్కిన తర్వాత.. కొంచెం నువ్వుల నూనె వేసుకుని ఉల్లికాడ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
- అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న బఠాణీలు వేసుకుని కొంచెం సేపు వేయించాలి.
- తర్వాత ఉడికించుకున్న రొయ్యలను వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అనంతరం ఈ రొయ్యల మిశ్రమాన్ని వేరే బౌల్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- అదే బాణలిలో కొంచెం నూనె వేసుకుని ముందుగా కలిసి ఉంచుకున్న గుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసుకుని.. దానిపైన రొయ్యల–బఠాణీ మిశ్రమాన్ని పరచుకోవాలి. ఇప్పుడు దానిని రెండువైపులా కాలనివ్వాలి.
- అంతే.. రొయ్యలు ఆమ్లెట్ రెడీ.
- ఇప్పుడు ఆమ్లెట్‌ను జాగ్రత్తగా ప్లేట్‌లోకి తీసుకుని.. గార్నిష్ కోసం కొద్దిగా నూనె, మిగిలిన సోయాసాస్ వేసుకుని కొత్తిమీర, పుదీనా తురుముని వేసుకుంటే.. టేస్టీ టేస్టీ రొయ్యల ఆమ్లెట్ రెడీ.. దీనిని బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు.
కార్తిక మాసం ముగిసిపోయింది - ఈ సండే మీ ఇంట్లో ఏం కూర - ఈ నాన్‌వెజ్ ట్రై చేస్తారా!
రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!