తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోర్నోగ్రఫీ కేసులో ఈడీ జోరు- రాజ్​కుంద్రా ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు - RAJ KUNDRA PORNOGRAPHY CASE

శిల్పా శెట్టి భర్త రాజ్​ కుంద్రాపై మనీలాండరింగ్ కేసు - ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు

Raj Kundra
Raj Kundra (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2024, 3:15 PM IST

Raj Kundra Pornography Case :ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ ​కుంద్రా నివాసాలు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారాలకు సంబంధించి ఆయనపై గతంలో మనీలాండరిగ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే రాజ్‌కుంద్రా నివాసాలు, కార్యాలయాల్లో శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కుంద్రాతో పాటు కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల నివాసాల్లో కూడా ఈడీ సోదాలు చేసింది. ముంబయి, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారానికి సంబంధించిన కేసులో 2021లో రాజ్‌కుంద్రా అరెస్టై బెయిల్‌పై విడుదలయ్యారు.

పోర్నోగ్రఫీ కేసు
అశ్లీల చిత్రాలను నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారని 2021లో ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు రాజ్‌ కుంద్రాపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో రాజ్‌ కుంద్రా ప్రధాన నిందితుడని అప్పట్లో పోలీసులు వెల్లడించారు. సినిమా అవకాశాల కోసం ముంబయికి వచ్చే యువతులను వంచించి, ఆయన పెద్ద ఎత్తున డబ్బులు ఆర్జించినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఆ కేసును ఆధారంగా చేసుకొని 2022 మే నెలలో ఈడీ మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. అందులో భాగంగా రాజ్‌ కుంద్రా నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

స్కామ్ ఆరోపణలు కూడా
2017లో గెయిన్‌ బిట్‌కాయిన్‌ పోంజీ స్కీమ్‌ పేరిట అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో కూడా రాజ్‌ కుంద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బిట్‌కాయిన్లతో మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈ ఏడాది మొదట్లో రాజ్‌ కుంద్రా, ఆయన భార్య శిల్పా శెట్టికు చెందిన రూ.98 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో జుహూలోని ఓ ఫ్లాట్‌ శిల్పా శెట్టి పేరు మీద ఉన్నట్లు తెలిపింది. దీనితో పాటు పుణెలోని ఓ బంగ్లా, రాజ్‌ కుంద్రా పేరు మీదున్న ఈక్విటీ షేర్లను కూడా అటాచ్‌ చేసినట్లు వెల్లడించింది. అయితే ఆస్తుల జప్తుపై బాంబే హైకోర్టు రాజ్‌ కుంద్రా, శిల్పా శెట్టికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details