తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలాండ్ అమ్మాయితో తమిళ అబ్బాయి పెళ్లి- మూడేళ్ల ప్రేమ కథకు శుభంకార్డు- వీడియో వైరల్! - Poland Girl Marry Tamil Boy - POLAND GIRL MARRY TAMIL BOY

Poland Girl Marry Tamil Boy : ఉన్నత చదువుల కోసం భారత్​ నుంచి పోలాండ్​ వెళ్లిన ఓ వ్యక్తి స్థానిక యువతితో ప్రేమలో పడ్డాడు. గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఆ జంట భారత్​కు వచ్చి భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది. ఇంతకీ ఆ పెళ్లి ఎక్కడ జరిగిదంటే?

Poland Girl Marry Tamil Boy
Poland Girl Marry Tamil Boy (ETV BHARAT)

By ETV Bharat Telugu Team

Published : May 6, 2024, 1:35 PM IST

పోలాండ్ యువతితో తమిళ అబ్బాయి పెళ్లి - మూడేళ్ల ప్రేమ కథకు శుభంకార్డ్ (ETV BHARAT)

Poland Girl Marry Tamil Boy : తమిళనాడుకు చెందిన ఓ యువకుడు పోలాండ్​ యువతిని భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఉన్నత చదువుల కోసం తమిళనాడు నుంచి పోలాండ్​కు వెళ్లిన ఆ యువకుడు స్థానిక యువతితో ప్రేమలో పడ్డాడు. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా పెద్ద అంగీకరంతో పెళ్లి చేసుకున్నారు. వీరి వాహనాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి స్థానికులు భారీగా తరలివచ్చారు.

కృష్ణగిరి జిల్లాలోని కురియానపల్లి గ్రామానికి చెందిన రమశన్(33) ఉన్నత చదువుల కోసం కొన్నేళ్ల క్రితం పోలాండ్​కు వెళ్లాడు. విద్యను పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉన్న విల్లనోవా విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ అసోసియేట్​గా చేరాడు. అయితే చదువుకునే సమయంలోనే స్థానిక యువతి ఎవాలినా మెత్రా(30)తో ప్రేమలో పడ్డాడు. గత మూడేళ్లు నుంచి వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. మొదట్లో రమశన్​ తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పగా వారు నిరాకరించారు. చివరకు ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరచాయి. దీంతో భారత్​లోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఇద్దరు ఇక్కడకు వచ్చి, వేప్పనపల్లిలోని ఓ ఫంక్షన్ హాలులో శనివారం నిశ్చితార్ధం చేసుకున్నారు. ఆదివారం(మే 5) తమిళ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. వధూవరులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఇన్​స్టాలో పరిచయం - ప్రియుడి కోసం భారత్ వచ్చిన పోలాండ్ మహిళ
ఇలాంటి ఘటన ఇంతకుముందు కూడా జరిగింది. భారత్​కు చెందిన యువకుడితో ప్రేమలో పడింది ఓ పోలాండ్ మహిళ. ప్రియుడి కోసం ఆరేళ్ల కుమార్తెతో కలిసి పోలాండ్ నుంచి గతేడాదిలో ఝార్ఖండ్ వచ్చింది. పోలాండ్​కు చెందిన పోలాక్ బార్బరా(45) అనే మహిళకు, ఝార్ఖండ్​లోని హజారీబాగ్ జిల్లాలోని ఖుత్రా గ్రామానికి చెందిన మహ్మద్ షాదాబ్ (35) 2021లో ఇన్​స్టాగ్రామ్​లో పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది.​ దీంతో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే పోలాక్​కు ఇప్పటికే వివాహమై ఆరేళ్ల కుమార్తె కూడా ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ఒకే కాన్పులో ఐదుగురు ఆడ శిశువుల జననం- సురక్షితంగా డెలివరీ- ఎక్కడో తెలుసా? - Woman Gives Birth To 5 Babies

మంత్రి పీఏ పనిమనిషి ఇంట్లో 'నోట్ల గుట్టలు'- రూ.25 కోట్లు సీజ్ చేసిన ఈడీ- ఆ కేసులోనే! - Ed Raids In Ranchi

ABOUT THE AUTHOR

...view details