తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీపై ప్రేమతో 190అడుగుల భారీ కాంస్య విగ్రహం- రూ.200 కోట్లతో నిర్మాణం - 190 Fts PM Modi Bronze Statue

PM Modi Bronze Statue In Assam : ప్రధాని మోదీపై ఉన్న ప్రేమను వినూత్న రీతిలో చాటేందుకు సిద్ధమయ్యారు అసోంకు చెందిన ఓ వ్యాపారవేత్త. తన సొంత ఖర్చులతో రూ.200 కోట్లు వెచ్చించి ఏకంగా 190 అడుగుల మోదీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా భారీ ఏర్పాట్లతో భూమి పూజను నిర్వహించారు.

PM Modi Bronze Statue In Assam Guwahati
రూ.200 కోట్ల సొంత ఖర్చుతో 190 అడుగుల మోదీ కాంస్య విగ్రహం- ప్రధానిపై ప్రేమతోనే ఇదంతా!

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 10:14 PM IST

PM Modi Bronze Statue In Assam :ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న ప్రేమను విభిన్నంగా చాటిచెప్పేందుకు పూనుకున్నారు అసోంకు చెందిన ఓ వ్యాపారవేత్త. ఆయనకోసం ఏకంగా 190 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని తయారు చేయించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు అయ్యే రూ.200 కోట్ల ఖర్చును తన సొంత సంపాదన నుంచి వెచ్చించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గువాహాటి నగరం జలుక్‌బారిలోని ప్రధాన బస్టాండ్ సమీపంలో ఉన్న తన సొంత స్థలంలో విగ్రహా ఏర్పాటు కోసం భూమి పూజను జరిపించారు వ్యాపారవేత్త నవీన్​​ చంద్ర బోరా. సోమవారం ప్రారంభమైన ఈ పూజా కార్యక్రమం మూడు రోజులపాటు కొనసాగనుందని చెప్పారు. ఇందుకోసం భారీగానే ఏర్పాట్లు చేశారు.

ప్రధాని మోదీ 190 అడుగుల భారీ విగ్రహం కోసం ఏర్పాటు చేసిన మండపం.

'అలా వచ్చిందీ ఆలోచన'
గువాహాటి చెందిన నవీన్​​​ చంద్ర బోరా అనే వ్యాపారవేత్తకు ప్రధాని నరేంద్ర మోదీ అంటే ఎంతో అభిమానం. 2016లో ఆయన చేతుల మీదుగా ఓ విషయంలో ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు బోరా. దీంతో అప్పుడే ప్రధాని కోసం ఓ భారీ విగ్రహాన్ని నెలకొల్పాలని అనుకున్నారట. అందులో నుంచి వచ్చిన ఆలోచనే ఈ భారీ కాంస్య విగ్రహ ఏర్పాటు అని చెప్పారు.

మోదీ కాంస్య విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ.

మోదీ మెడపై అస్సామీ డిజైన్​!
'నా సొంత డబ్బులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాను. దీనిని నా సొంత స్థలంలోనే నెలకొల్పనున్నాను. ఇందుకోసం దాదాపు రూ.200 కోట్లను జమ చేశాను. 190 అడుగుల మోదీ కాంస్య విగ్రహ తయారీ కోసం 60 అడుగుల పునాదినీ తీయించాను. మొత్తంగా పునాదితో కలుపుకొని విగ్రహం ఎత్తు 250 అడుగులు' ఉంటుంది అని వ్యాపారవేత్త నవీన్​ చంద్ర బోరా ఈటీవీ భారత్​తో తెలిపారు. ఇక విగ్రహానికి సంబంధించి ఇప్పటికే తుది డిజైన్​ ప్లాన్​ను కూడా రూపొందించినట్లు ఆయన చెప్పారు. అయితే ఇంత భారీ విగ్రహం మెడపై అసోం సంస్కృతికి చిహ్నంగా నిలిచే గమోసా డిజైన్​ను చూపించబోతున్నట్లు బోరా వివరించారు.

విగ్రహం ఏర్పాటుపై పీఎంఓకు లేఖ
మోదీ కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతూ గతేడాది ప్రధాని కార్యాలయానికి లేఖ కూడా పంపినట్లు తెలిపారు నవీన్​ చంద్ర బోరా. ఇందులో విగ్రహం కోసం ఖర్చు చేయనున్న రూ.200 కోట్ల రూపాయలు ఏ ఆదాయ మార్గాల ద్వారా సంపాదించానో కూడా తెలిపానని చెప్పారు.

"ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని ఆశిస్తున్నా. ఆయనపై నాకున్న ప్రేమతోనే ఇది చేస్తున్నాను. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రధానులలో నరేంద్ర మోదీ ఒకరు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేను ఎంతో అదృష్టవంతుడ్ని"
- నవీన్​​ చంద్ర బోరా, వ్యాపారవేత్త

నవీన్​​​ చంద్ర బోరా- మోదీ కాంస్య విగ్రహాన్నితయారు చేయిస్తుంది ఇతనే.

అవినీతిలో భారత్​ 93వ స్థానం- ఆ దేశమే టాప్​

అయోధ్య రామయ్య ఒంటిపై ఉన్న బంగారం ఎంతో తెలుసా? వీటిని ఎవరు చేశారు?

ABOUT THE AUTHOR

...view details