తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులకు కేంద్రం 'దసరా' కానుక - 'పీఎం కిసాన్‌ నిధులు' రిలీజ్​ డేట్‌ ఫిక్స్‌ - ఆ రోజునే అకౌంట్లోకి రూ.2 వేలు! - PM Kisan 18th Installment Date

PM Kisan 18th Installment Funds Update : దసరా ముందు కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధుల విడుదలకు సంబంధించిన తేదీని ప్రకటించింది. మరి.. 18వ విడత డబ్బులు రైతుల అకౌంట్‌లలో ఏ రోజు జమ కానున్నాయో ఇప్పుడు చూద్దాం.

PM Kisan 18th Installment Release Date
PM Kisan 18th Installment (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2024, 6:05 PM IST

PM Kisan 18th Installment Release Date :అన్నదాతలకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం 18వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధుల విడుదలకు సంబంధించిన తేదీని ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 9 కోట్ల మంది పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇంతకీ.. ఈ డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి? ఒకవేళ ఇంకా ఎవరైనా ఇ-కేవైసీ చేసుకోకపోతే ఎలా పూర్తి చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు "ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి" స్కీమ్​ని ప్రవేశపెట్టింది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి ఏడాదికి 6 వేల రూపాయలు అందిస్తోంది. ఈ 6 వేల రూపాయలను ఏటా మూడు దఫాలుగా నేరుగా రైతుల అకౌంట్స్ లో జమ చేస్తూ వస్తోంది. ఏప్రిల్ - జులై తొలి విడతగా, ఆగస్టు- నవంబర్ రెండో విడతగా, డిసెంబర్-మార్చి మూడో విడతగా.. 2 వేల చొప్పున కేంద్ర సర్కార్ ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.

ఇప్పుటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర సర్కార్ 17 సార్లు రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేసింది. ఇప్పుడు 18వ విడత నిధులు విడుదల కోసం ఎదురుచూస్తున్న రైతులకు దసరా ముందు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. తాజాగా.. 18వ దఫా పీఎం కిసాన్ డబ్బులను "2024, అక్టోబర్ 5న" ప్రధాని నరేంద్ర మోదీ రిలీజ్ చేస్తారని పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ పేర్కొంది.

అదేవిధంగా.. పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులు రూ. 2 వేలు పొందాలంటే ఇ- కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారిక వెబ్​సైట్​లో సూచించారు. అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వం కూడా పలుమార్లు దీనిని స్పష్టం చేస్తూనే ఉంది. కాబట్టి.. ఒకవేళ ఇంకా ఎవరైనా ఇ- కేవైసీ చేయించుకోకపోతే వెంటనే పూర్తి చేయాలని సూచిస్తున్నారు అధికారులు.

e-KYC ఎలా చేయాలంటే? :

  • ముందుగా పీఎం కిసాన్​ అధికారిక వెబ్​సైట్​ https://pmkisan.gov.in/ లోకి లాగిన్​ అవ్వాలి.
  • ఆ తర్వాత హోమ్​ పేజీలో కుడివైపున e-KYC ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • తర్వాత ఆధార్​ నెంబర్​ ఎంటర్​ చేసి 'Search'​ ఆప్షన్​పై ప్రెస్ చేయాలి.
  • తర్వాత వివరాలు స్క్రీన్​ మీద డిస్​ప్లే అవుతాయి. ఓటీపీ సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.
  • లేదంటే.. పీఎం కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు.
  • ఇంకా.. దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కూడా బయోమెట్రిక్ సాయంతో ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
  • అదేవిధంగా పీఎం కిసాన్ డబ్బులు అందుకోవాలంటే.. సదరు లబ్ధిదారుడు.. కచ్చితంగా తమ ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఇవీ చదవండి :

పీఎం కిసాన్ పైసలు రావాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి - మరి మీరు చేయించారా?

భవిష్యత్ కోసం ఇన్వెస్ట్ చేయాలా? రిస్క్​ లేని టాప్​-10 స్కీమ్స్​ ఇవే!

ABOUT THE AUTHOR

...view details