తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైలు నుంచి TTEని తోసేసిన 'టికెట్‌' లేని వ్యక్తి- మరో ట్రైన్​ ఢీకొట్టి అక్కడికక్కడే మృతి - Passenger Pushed TTE From Train - PASSENGER PUSHED TTE FROM TRAIN

Passenger Pushed TTE From Train : టీటీఈని కదులుతున్న రైలు నుంచి తోసి ఆయన మరణానికి కారణయ్యాడు టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి. టీటీఈ అవతలి పట్టాలపై పడగా, అదే సమయంలో వచ్చిన మరో రైలు ఢీకొనడం వల్ల మృతి చెందారు. కేరళలో జరిగిందీ ఘటన.

Passenger Pushed TTE From Train
Passenger Pushed TTE From Train

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 7:23 AM IST

Passenger Pushed TTE From Train :కేరళలో కదులుతున్న రైలు నుంచి టీటీఈని ఓ టికెట్​ లేని ప్రయాణికుడు తోసేయడం వల్ల ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. టీటీఈ అవతలి పట్టాలపై పడగా, అదే సమయంలో వచ్చిన మరో రైలు ఢీకొనడం వల్ల టీటీఈ చనిపోయారు. ఎర్నాకుళం నుంచి పట్నా వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం రాత్రం ఈ ఘటన జరిగింది. బాధితుడిని ఎర్నాకులం నివాసి అయిన కె. వినోద్‌గా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వినోద్ తన విధుల్లో భాగంగా నిందితుడిని టికెట్ అడగడం వల్ల అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. త్రిసూర్ మెడికల్ కాలేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలప్పయ్య ప్రాంతంలో రైలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. పాలక్కాడ్ వద్ద ఒడిశాకు చెందిన నిందితుడు రజనీకాంత్​ను పట్టుకున్నారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు.

ఎర్నాకులం-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్ 11 కోచ్‌లో ఉన్న నిందితుడిని టీటీఐ వినోద్​ టికెట్ అడిగారు. టికెట్ లేదని అతడు చెప్పగా, అలా ప్రయాణించడం కుదరదని టీటీఐ చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఒక్కసారిగా టీటీఈ వినోద్‌ను రజనీకాంత్ రైలు నుంచి తోసేశాడు. పట్టాలపై పడిన వినోద్​కు తీవ్రగాయాలు కాగా, ఇంతలో అటు నుంచి వస్తున్న మరో రైలు ఢీకొనడం వల్ల టీటీఈ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు.

మంచి నటుడిగా కూడా!
ఎర్నాకుళానికి చెందిన వినోద్ తొలుత రైల్వేలో సాంకేతిక సిబ్బందిగా చేరారు. దాదాపు ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న ఆయన రెండేళ్ల క్రితం టీటీఈగా బాధ్యతలు చేపట్టారు. వృత్తిపరమైన కట్టుబాట్లతో పాటు వినోద్ ఒక కళాకారుడిగా మంచి గుర్తింపు పొందారు. రైల్వే ఉద్యోగుల సంఘంలో కొన్ని పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించారు. వివిధ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల ద్వారా కూడా తన నటనా ప్రతిభను చాటుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details