తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్యసభ నిరవధిక వాయిదా - parliament session june 2024 - PARLIAMENT SESSION JUNE 2024

Narendra Modi Rajyasabha Speech
Narendra Modi Rajyasabha Speech (Sansad Tv, ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 12:15 PM IST

Updated : Jul 3, 2024, 2:43 PM IST

Narendra Modi Rajyasabha Speech : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరగనున్న చర్చలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

LIVE FEED

2:42 PM, 3 Jul 2024 (IST)

  • రాజ్యసభ నిరవధిక వాయిదా

1:19 PM, 3 Jul 2024 (IST)

  • ఒక కుటుంబాన్ని రక్షించేందుకు రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేశారు: ప్రధాని
  • జాతిని పక్కదారి పట్టించేందుకు కొందరు యత్నిస్తున్నారు: ప్రధాని
  • కాంగ్రెస్‌ మనుగడ కోసం మిత్రపక్షాలను ఊతకర్రగా వాడుతోంది: ప్రధాని

1:17 PM, 3 Jul 2024 (IST)

  • రాజ్యాంగం ఆత్మను విచ్ఛిన్నం చేసిన పాపం విపక్షాలది: ప్రధాని
  • రాజ్యాంగం కల్పించిన హక్కులను కాంగ్రెస్‌ హరించింది: ప్రధాని
  • రాజ్యాంగ రక్షణ అనే పదాలు విపక్ష నేతలకు నచ్చవు: ప్రధాని

1:10 PM, 3 Jul 2024 (IST)

  • మూడోసారి పరాజయం పట్ల కాంగ్రెస్‌ ఉత్సవాలు చేసుకుంటోంది: ప్రధాని
  • రాజ్యాంగాన్ని రక్షించేందుకే దేశ ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు: ప్రధాని
  • బంగాల్‌ హింసా ఘటనల పట్ల విపక్షాలు మౌనం దాల్చాయి: ప్రధాని
  • బంగాల్‌లో మహిళలపై నేరాలను పట్టించుకోవట్లేదు: ప్రధాని
  • మహిళల రక్షణను విపక్షాలు విస్మరించాయి: ప్రధాని మోదీ

1:08 PM, 3 Jul 2024 (IST)

  • ప్రజలు మూడోసారి స్థిర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు: ప్రధాని
  • స్థిర ప్రభుత్వాన్ని అందించి భారత శక్తి ప్రపంచానికి చాటారు: ప్రధాని
  • ఎన్నికల ఫలితాలు ప్రపంచానికి విశ్వాసం కలిగించాయి: ప్రధాని
  • భారత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది: ప్రధాని మోదీ
  • విపక్షాలు ఓటమిని జీర్ణించుకులేకపోతున్నాయి: ప్రధాని మోదీ

1:02 PM, 3 Jul 2024 (IST)

  • మహిళా స్వయం సహాయక సంఘాలు రాణిస్తున్నాయి: ప్రధాని
  • సంఘాల్లోని 10 కోట్ల మహిళల ఆత్మవిశ్వాసం పెరిగింది: ప్రధాని
  • ఇప్పటికే కోటి మంది మహిళలు లక్షాధికారులుగా మారారు: ప్రధాని
  • 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా చేస్తాం: ప్రధాని

12:58 PM, 3 Jul 2024 (IST)

  • ప్రగతిశీల దేశాలు మహిళ నేతృత్వంలో దూసుకెళ్తున్నాయి: ప్రధాని
  • మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం: ప్రధాని
  • మహిళలు ఆత్మనిర్భర్‌గా మారేందుకు కృషిచేస్తున్నాం: ప్రధాని
  • ఆర్థిక వ్యవహారాల్లో మహిళల పాత్ర కీలకం: ప్రధాని మోదీ

12:56 PM, 3 Jul 2024 (IST)

  • దళితులు, ఆదివాసీలు, అణగారిన వర్గాలు ఎన్డీయేను ఆదరించాయి: ప్రధాని
  • భారత వికాసయాత్రలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు: ప్రధాని
  • గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పేరిట ఇళ్లు అందజేస్తున్నాం: ప్రధాని
  • ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరిగింది: ప్రధాని

12:48 PM, 3 Jul 2024 (IST)

  • ప్రతిపక్షాలు వాస్తవాలు వినిపించుకునే పరిస్థితిలో లేవు: ప్రధాని
  • బంజారాల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేశాం: ప్రధాని మోదీ
  • దివ్యాంగులను మిషన్ మోడ్‌లో ఆదుకున్నాం: ప్రధాని మోదీ
  • ట్రాన్స్‌జెండర్ల కోసం కొత్త చట్టం తీసుకువచ్చాం: ప్రధాని మోదీ
  • పద్మ అవార్డుల్లోనూ ట్రాన్స్‌జెండర్లకు ప్రాధాన్యం ఇచ్చాం: ప్రధాని


12:44 PM, 3 Jul 2024 (IST)

  • రాజ్యాంగం పట్ల హేళనగా ప్రవర్తించడం సమంజసం కాదు: రాజ్యసభ ఛైర్మన్‌
  • రాజ్యాంగం అనేది చేతిలో పుస్తకం కాదు జీవితానికి మార్గదర్శకం: రాజ్యసభ ఛైర్మన్‌

12:42 PM, 3 Jul 2024 (IST)

  • సభలో విపక్ష నేతలు అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారు: రాజ్యసభ ఛైర్మన్
  • విపక్ష నేతలు సభను కాదు మర్యాద విడిచి వెళ్లారు: రాజ్యసభ ఛైర్మన్‌
  • విపక్ష నేతలు ప్రజాస్వామ్యాన్ని అవమానించారు: రాజ్యసభ ఛైర్మన్‌
  • సభలో ప్రతి సభ్యుడికి అవకాశం ఇస్తున్నాం: రాజ్యసభ ఛైర్మన్‌
  • రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారు: రాజ్యసభ ఛైర్మన్‌

12:39 PM, 3 Jul 2024 (IST)

రాజ్యసభలో మోదీ ప్రసంగం జరుగుతున్న సమయంలో విపక్ష నేతల వాకౌట్‌ చేశారు.

12:37 PM, 3 Jul 2024 (IST)

  • రైతుల పంటల కనీస మద్దతు ధరలు భారీగా పెంచాం: ప్రధాని
  • రైతుల ప్రయోజనాల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చాం: ప్రధాని
  • రైతుల కోసం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన తీసుకువచ్చాం: ప్రధాని
  • ఆరేళ్లలో రైతులకు రూ.3 లక్షల కోట్లు అందజేశాం: ప్రధాని మోదీ

12:30 PM, 3 Jul 2024 (IST)

  • దేశ అభివృద్ధికి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్తాం: ప్రధాని
  • అన్ని రంగాల్లో సాంకేతిక ద్వారా అభివృద్ధికి బాటలు పరుస్తాం: ప్రధాని
  • రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం: ప్రధాని మోదీ


12:29 PM, 3 Jul 2024 (IST)

  • అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాం: ప్రధాని
  • వచ్చే ఐదేళ్లలో ప్రజా రవాణాలో వేగవంతమైన మార్పులు వస్తాయి: ప్రధాని

12:24 PM, 3 Jul 2024 (IST)

  • ప్రతిపక్షం హయాంలో రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వాన్ని నడిపింది: ప్రధాని
  • వచ్చే ఐదేళ్లు పేదరికానికి వ్యతిరేకంగా పోరాడుతాం: ప్రధాని మోదీ
  • వచ్చే ఐదేళ్లలో పేదలకు అనుకూల నిర్ణయాలు ఉంటాయి: ప్రధాని
  • అభివృద్ధి విస్తరణతో ప్రజలకు ప్రయోజనాలు చేకూరుతాయి: ప్రధాని
  • టైర్‌-2, టైర్‌-3 పట్టణాలు అభివృద్ధిలో భాగస్వాములవుతాయి: ప్రధాని

12:23 PM, 3 Jul 2024 (IST)

  • దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుస్తాం: ప్రధాని
  • ఆర్థిక వృద్ధిలో భారత్‌ను పది నుంచి ఐదో స్థానానికి తీసుకువచ్చాం: ప్రధాని
  • ఆర్థిక వృద్ధిలో భారత్‌ను మూడో స్థానానికి తీసుకువస్తాం: ప్రధాని
  • పదేళ్లలో చేసిన అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాం: ప్రధాని

12:21 PM, 3 Jul 2024 (IST)

  • రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోంది: ప్రధాని మోదీ
  • రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్త ఉత్సవాలు నిర్వహించాలి: ప్రధాని
  • ఈ ఎన్నికలు భవిష్య సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తాయి: ప్రధాని

12:18 PM, 3 Jul 2024 (IST)

రాజ్యాంగ భావనను విద్యా సంస్థల్లో విద్యార్థులకు చేరవేస్తున్నాం: ప్రధాని

12:16 PM, 3 Jul 2024 (IST)

  • ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు చూపిన విశ్వాసం పట్ల గర్వంగా ఉంది: ప్రధాని
  • దేశానికి సేవ చేసేవారినే ప్రజలు ఆశీర్వదించారు: ప్రధాని మోదీ
  • ఎన్డీయే పాలనను దేశ ప్రజలు మరోసారి సమర్థించారు: ప్రధాని
  • రాజ్యాంగం ఆర్టికల్స్‌ అనుసరించేందుకే పరిమితం కాదు: ప్రధాని
  • రాజ్యాంగం లైట్‌ హౌస్‌లా మార్గనిర్దేశనం చేస్తుంది: ప్రధాని మోదీ

12:12 PM, 3 Jul 2024 (IST)

  • పరాజయానికి సంబంధించి కాంగ్రెస్‌ నేతలు అన్య మనస్కంగా ఉన్నారు: ప్రధాని
  • దేశ ప్రజల నిర్ణయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు: ప్రధాని
  • పదేళ్లుగా అఖండ సేవాభావంతో ఎన్డీయే ముందుకెళ్తోంది: ప్రధాని
Last Updated : Jul 3, 2024, 2:43 PM IST

ABOUT THE AUTHOR

...view details