తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూలీకి దొరికిన భారీ 'డైమండ్​'- ఓవర్​నైట్​లో​ లక్షాధికారిగా మారిన స్వామి! - Diamond Found In Panna - DIAMOND FOUND IN PANNA

Diamond Found In Panna : మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో ఓ కూలీని అదృష్టం వరించింది. మరో ముగ్గురితో కలిసి లీజుకు తీసుకున్న గనిలో అతడికి రూ.1.5 కోట్లు విలువైన వజ్రం దొరికింది.

Diamond Found In Panna
Diamond Found In Panna (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2024, 10:38 AM IST

Diamond Found In Panna :భారత్​లోనే కాదు ఖండాల్లోనూ విలువైన వజ్రాలకు ప్రఖ్యాతి గాంచిన మధ్యప్రదేశ్​లోని పన్నాలో మరో విలువైన వజ్రం బయటపడింది. స్వామిదిన్ పాల్ అనే కూలీ మరో ముగ్గురితో కలిసి 2024 మేలో సర్కోహా గ్రామంలో ఓ గనిని లీజుకు తీసుకున్నాడు. అక్కడ స్వామిదిన్​కు గురువారం 32.80 క్యారెట్ల వజ్రం దొరికింది. ఈ భారీ వజ్రం విలువ రూ.1.5 కోట్లు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీంతో స్వామిదిన్ పాల్ రాత్రికిరాత్రే లక్షాధికారిగా మారిపోయాడు.

'పిల్లలకు ఇళ్లు కట్టిస్తాం'
పన్నా జిల్లాలోని నారంగి బాగ్​కు చెందిన స్వామిదిన్ పాల్ ఈ వజ్రాన్ని డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశాడు. భారీ వజ్రం లభించడం పట్ల కూలీ స్వామిదిన్ పాల్ సంతోషం వ్యక్తం చేశాడు. నలుగురు భాగస్వాములం డైమండ్ వేలంలో వచ్చిన డబ్బుల్ని సమానంగా పంచుకుంటామని చెప్పారు. ఈ వజ్రం ద్వారా వచ్చిన డబ్బుతో పిల్లలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పుకొచ్చారు.

'వేలంలో వజ్రాన్ని ఉంచుతాం'
మరోవైపు, పన్నాలో ఒక్కరోజులోనే చాలా మంది అదృష్టం మారిపోతుందని కలెక్టర్ సురేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు పన్నాలో 16 వజ్రాలు దొరికాయని వెల్లడించారు. స్వామిదిన్​ తన దొరికిన వజ్రం పన్నాలోని డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశారని తెలిపారు. త్వరలో జరగనున్న వేలంలో దానిని విక్రయానికి ఉంచనున్నట్లు వెల్లడించారు. ఈ వజ్రం ధర రూ.కోటిపైగా ఉంటుందని అంచనా వేశారు.

కూలీకి దొరికిన భారీ 'డైమండ్​' (ETV Bharat)

వజ్రాలకు పన్నా ప్రసిద్ధి
పన్నా ప్రాంతం వజ్రాల గనులకు ప్రసిద్ధి. అనేక మంది ఆ ప్రాంతంలో భూమిని లీజుకు తీసుకుని, ప్రభుత్వ అనుమతితో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతుంటారు. గనుల్లో దొరికిన వజ్రాల్ని డైమండ్ ఆఫీస్​లో డిపాజిట్ చేసి, అధికారుల సమక్షంలో వేలం వేయిస్తారు. అయితే ఆ ప్రాంతంలో ఎవరికైనా తమ పొలాల్లో ఏదైనా విలువైన వజ్రం లేదా రాయి దొరికితే ప్రభుత్వం వాటి విలువలో 12.5 శాతం వాటా ఇస్తుంది. కానీ కొంత మంది తమకు గనుల్లో దొరికిందని, ఆ వస్తువు తమదే అని వాదిస్తారు. ఒక వేళ ఈ విషయం కోర్టుకు వెళ్తే తీర్పు గని యజమానికి అనుకూలంగానే తీర్పు వస్తుంది. ఒక వేళ డైమండ్​ దొరికిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయకుండా దాచితే వారిపై చర్యలు​ తీసుకోవచ్చని పోలీసులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details