తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 7:59 AM IST

Updated : Jan 25, 2024, 9:09 AM IST

ETV Bharat / bharat

జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కీలక భేటీ - పారిశ్రామికవేత్తలు, విశ్రాంత జడ్జీలతో కోవింద్ చర్చలు

One Nation One Election panel : ఏకకాల ఎన్నిక నిర్వహణపై అధ్యయనానికి ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ అధ్యక్షుడు, భారత మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులు, పారిశ్రామికరంగ ప్రముఖలతో తాజాగా చర్చలు జరిపారు.

One Nation One Election panel
One Nation One Election panel

One Nation One Election panel : 'ఒకే దేశం - ఒకే ఎన్నిక' నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ, రిటైర్డ్‌ న్యాయమూర్తులతో పాటు పారిశ్రామిక ప్రముఖులతో బుధవారం భేటీ అయ్యింది. ఇవి నాలుగో విడత సంప్రదింపులని కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

కమిటీ అధ్యక్షుడు రామ్​నాథ్​ కోవింద్​తో సమావేశమైవారిలో అలహాబాద్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోసలే, దిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేంద్ర మీనన్‌ జమిలి ఎన్నికలపై తమ అభిప్రాయాలను తెలిపారని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏకకాల ఎన్నికల వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలపై అసోచామ్‌ అధ్యక్షుడు, స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ ఛైర్మన్‌ అజయ్‌ సింగ్‌తో కమిటీ సభ్యులు చర్చించినట్లు పేర్కొంది. ఈ ఎన్నికల నిర్వహణతో ఉన్న ఆర్థిక ప్రయోజనాలను అజయ్​ సింగ్ వివరించారు. ఈ ఉన్నత స్థాయి కమిటీ 46 రాజకీయ పార్టీలను సూచనలు కోరింది. ఇప్పటివరకు 17 పార్టీలు మాత్రమే స్పందిచాయని తెలిపింది. 'ఒకే దేశం-ఒకే ఎన్నిక'కు సంబంధించి ప్రజల నుంచి దాదాపు 21వేల సూచనలు అందగా, 81 శాతం మంది ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలిపారని రెండు రోజులు క్రితం కమిటీ పేర్కొంది.

జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ వ్యతిరేకం
'ఒకే దేశం-ఒకే ఎన్నిక' అమలుకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సారథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేయాలని ఇటీవలే కాంగ్రెస్​ కోరింది. ఈ మేరకు కమిటీ సెక్రేటరీ నితేన్​ చంద్రకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఇందులో జమిలి ఎన్నికలను కాంగ్రెస్ మరోసారి తీవ్రంగా వ్యతిరేకించింది. 'రాజ్యాంగాన్ని తారుమారు చేసేందుకు కేంద్రం తన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా మాజీ రాష్ట్రపతి సేవలను ఇందుకోసం వాడుకుంటుంది. ఈ చర్యను ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్యానెల్​ కమిటీ ఛైర్మన్​గా వ్యవహరిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దు' అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖలో పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

15ఏళ్లకు రూ.10వేల కోట్లు ఖర్చు- జమిలి ఎన్నికలపై ఈసీ అంచనా

జమిలి ఎన్నికలు - దేశంపై దీని ప్రభావం ఎలా ఉండనుంది?

Last Updated : Jan 25, 2024, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details