ETV Bharat / state

గాంధీభవన్​ ముట్టడికి బయలుదేరిన బీజేపీ కార్యకర్తలు, అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత - TENSION AT NAMPALLY GANDHI BHAVAN

నాంపల్లిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం - బారికేడ్లు తొలగించి గాంధీభవన్‌ వైపు బీజేపీ నేతల పరుగులు - బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన పోలీసులు

TENSION AT NAMPALLY
BJP PROTEST AGAINST CONGRESS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2025, 3:40 PM IST

Updated : Jan 7, 2025, 4:23 PM IST

BJP Leaders Protest Against Congress : నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం కాంగ్రెస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో తాజాగా గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ యువమోర్చా బయలుదేరింది. ఈ ముట్టడిపై ముందుగానే సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. బీజేపీ కార్యకర్తలు బయటకు రాకుండా ఆ మార్గంలోని దారులను మూసివేశారు. వేరేమార్గాల నుంచి దాడికి వెళ్తారనే అనుమానంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. మరోవైపు కొందరు కార్యకర్తలు గాంధీభవన్‌ వద్దకు చేరుకొని కాంగ్రెస్‌ నాయకుల ఫ్లెక్సీలను చించేశారు.

ఎక్కడికక్కడే అరెస్టులు : రెండు బృందాలుగా గాంధీ భవన్​ను ముట్టడించేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. పోలీసులు తమను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ యువమోర్చా కార్యకర్తలు ముందుకు కదిలారు. పోలీసులు వీరిని ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. ఈ ఘర్షణ నేపథ్యంలో నాంపల్లి మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

గాంధీభవన్​ ముట్టడికి బయలుదేరిన బీజేపీ కార్యకర్తలు (ETV Bharat)

ప్రియాంక గాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు : కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీపై దిల్లీకి చెందిన భాజపా నేత రమేశ్‌ బిదూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్‌ నేతలు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి వచ్చారు. దీనికి నిరసనగా బీజేపీ యువమోర్చా గాంధీభవన్ ముట్టడి చేపట్టింది.

బండి సంజయ్ ఆగ్రహం : బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేయడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పది మంది కార్యకర్తలు వచ్చి దాడులు చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే గాంధీభవన్​తో పాటు కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా మిగలవన్నారు.

చట్టపరంగానే వెళ్లాలి : చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా భావించొద్దని ఓ ప్రకటనలో బండి సంజయ్ తెలిపారు. తప్పుడు వ్యాఖ్యలు ఎవరూ చేసిన ఖండించాల్సిందేనని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలే కాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.

కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ - నాంపల్లిలో తీవ్ర ఉద్రిక్తత

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం చేయాలి : ప్రధాని మోదీ

Last Updated : Jan 7, 2025, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.