తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మానవ అక్రమ రవాణా కేసులో ముగ్గురు మయన్మార్ దేశస్థులపై ఎన్​ఐఏ ఛార్జిషీట్ - మయన్మార్ దేశస్తులపై ఎన్​ఐఏ కేసు

NIA Charge Sheet on Myanmar Citizens in Human Trafficking Case : అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో ముగ్గురు మయన్మార్ దేశస్థుల పైనా ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. భారతదేశం, బంగ్లాదేశ్ సరిహద్దుల మీదుగా మయన్మార్ దేశస్థులు అక్రమంగా చొరబడ్డారని చార్జిషీట్​లో పేర్కొంది.

Myanmar Citizens in Human Trafficking Case
NIA Charge Sheet on Myanmar Citizens in Human Trafficking Case

By ETV Bharat Telangana Team

Published : Feb 4, 2024, 7:02 PM IST

NIA Charge Sheet on Myanmar Citizens in Human Trafficking Case :అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో ముగ్గురు మయన్మార్ దేశస్థుల పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. భారతదేశం, బంగ్లాదేశ్ సరిహద్దుల(Bangladesh Border) నుంచి మయన్మార్ దేశస్థులు అక్రమంగా చొరబడ్డారని ఛార్జిషీట్​లో పేర్కొంది. మయన్మార్​కు చెందిన రబి ఇస్లామ్, షఫీ అలం, మహమ్మద్ ఉస్మాన్ నిందితులుగా ఉన్నారని అధికారులు తెలిపారు.

బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మయన్మార్ దేశస్థుల ఆందోళన

వీరంతా మయన్మార్‌లోని మౌంగ్‌డా జిల్లాలో శాశ్వత నివాసితులని ఏజెన్సీ తెలిపింది. పలువురు ట్రాఫికర్లు, రోహింగ్యాలతో కలిసి అక్రమంగా భారత్​లోకి చొరబడ్డారని విచారణలో తేలిందని వివరించారు. బంగ్లాదేశ్ రెఫ్యూజీ క్యాంపులో(Refugee Camp) ఉన్న మహిళా రోహింగ్యాలను భారత్​లోకి పంపుతున్నారని దర్యాప్తులో వెల్లడైందని అధికారులు ఛార్జిషీట్​లో పేర్కొన్నారు.

గత ఏడాదిలోనే కేసు నమోదు :తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హరియాణా, జమ్మూ కశ్మీర్​లలో ఉన్న రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్ యువతులకు వల వేస్తున్నారని తేల్చారు. నకిలీ పత్రాలతో(Fake Document) ఇక్కడ ఆధార్ కార్డులు సైతం నిందితులు పొందినట్లు తేలిందని కోర్టుకు తెలిపారు. దీంతోపాటు ఆధార్ కార్డులతో తన పేరుతో సిమ్ కార్డులు విక్రయాలు జరిపినట్లు తేలిందని పేర్కొన్నారు. ఇండియాకు చెందిన బ్యాంకు ఖాతాలను నిందితులు వినియోగిస్తారని దర్యాప్తులో తేలినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు గత ఏడాది నవంబర్ 7న కేసు నమోదు చేశారు.

భారత్​లోకి 600 మంది మయన్మార్ సైనికులు- కేంద్రాన్ని అలర్ట్ చేసిన మిజోరం

Manipur Internet Restore : మణిపుర్​లో ఇంటర్నెట్​ బ్యాక్​.. మయన్మార్​ సరిహద్దు వెంబడి కంచె!

ABOUT THE AUTHOR

...view details