తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సండే​ స్పెషల్​: ట్రెండింగ్​ 'నెల్లూరు చేపల పులుసు' - ఎలా చేయాలో మీకు తెలుసా? - How to Make Nellore Chepala Pulusu - HOW TO MAKE NELLORE CHEPALA PULUSU

Nellore Chepala Pulusu: సండే వచ్చిదంటే మాంస ప్రియులకు పండగ అన్నట్టే. అయితే ఈసారి నాన్​వెజ్​ లవర్స్​ కోసం నెల్లూరు చేపల పులుసు రెసిపీ తీసుకొచ్చాం. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే హాయిగా చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

Nellore Chepala Pulusu
How to Make Nellore Chepala Pulusu (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 2:37 PM IST

Nellore Chepala Pulusu Recipe in Telugu:ఫిష్ కర్రీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చేపల పులుసు పేరు చెప్పగానే మౌత్ వాటరింగ్ అయిపోతుందంటే నమ్మాల్సిందే. అయితే చేపల పులుసులో చాలా రకాలు ఉన్నప్పటికీ.. ఎక్కువ మందికి నెల్లూరు చేపల పులుసు తినాలని ఉంటుంది. కానీ దానిని చేయడం రాదని వర్రీ అవుతుంటారు. మరి మీరు కూడా ఈ లిస్టులో ఉంటే.. అయితే ఇప్పుడా ఆ విషయంలో చింత అవసరం లేదు. అద్దిరిపోయేలా.. నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేయాలో క్లారిటీగా మేం చెప్తాం. దీని తయారీకి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. కరెక్టుగా చేస్తే.. ప్లేట్లు నాకేస్తారంతే! మరి, ఈ నెల్లూరు ఫిష్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్.. ఇంకా కుకింగ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

నెల్లూరు చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు:

  • చేపలు - కేజీ
  • చింతపండు - నిమ్మకాయంత
  • ఉల్లిపాయలు - 2
  • పచ్చిమిర్చి - 3
  • పచ్చి మామిడికాయ ముక్కలు - ఓ కప్పు
  • టమాటలు - 2
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - 4 టీ స్పూన్లు
  • పసుపు - అర టీ స్పూన్​
  • అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూన్​
  • కొత్తిమీర - గుప్పెడు
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • నూనె - సరిపడా
  • మెంతులు - రెండు చెంచాలు
  • జీలకర్ర -ఒక చెంచా
  • ధనియాలు -ఒక చెంచా
  • ఆవాలు -1 టీ స్పూన్​
  • ఇంగువ - చిటికెడు

సండే స్పెషల్‌ - చికెన్ ఫ్రై విత్‌ మామిడికాయ పచ్చిపులుసు - కాంబినేషన్ అద్దిరిపోద్ది - మీరూ ఓ సారి ట్రై చేయండి!

తయారీ విధానం:

  • ముందుగా స్టౌ మీద పాన్​ పెట్టి మెంతులు, జీలకర్ర, ధనియాలు, అర టీ స్పూన్​ ఆవాలు వేసి దోరగా వేయించుకుని పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే టమాటలు ముక్కలుగా కట్​ చేసుకుని మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్​ పట్టుకోవాలి.
  • ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని.. అందులో చేప ముక్కలు వేసి పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం దట్టించి ఓ అరగంటపాటు పక్కకు పెట్టుకోవాలి.
  • నిమ్మకాయ సైజు (50 గ్రాములు)లో చింతపండు తీసుకొని... శుభ్రంగా కడిగి... కొద్దిసేపు నానబెట్టి.. గుజ్జు తీసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ ఆన్​ చేసి ఓ మందపాటి వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి.గిన్నె వెడల్పు ఉంటే చేప ముక్కలు మంచిగా ఉడుకుతాయి.
  • ఇప్పుడు గిన్నె వేడెక్కాక సరిపడా నూనె వేసి ముందుగా మిగిలిన ఆవాలు వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత నిలువుగా చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోని వేయించాలి.
  • ఉల్లిపాయలు కాస్తా వేగాక.. అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయేంతవరకు దోరగా వేయించాలి.
  • తర్వాత పచ్చి మామిడికాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి.
  • అవి కాస్తా మెత్తగా అయ్యాక.. పసుపు పావు టీస్పూన్, సరిపడా కారం, ఉప్పు వెయ్యాలి.(ఆల్రెడీ మొదట్లో చేప ముక్కలకు ఉప్పు, కారం వేశాం. కాబట్టి... దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పడు సరిపడా వేసుకోవాలి.)

వీకెండ్ స్పెషల్ : పుల్ల పుల్లని స్పైసీ మామిడికాయ చికెన్ ఫ్రై - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!

  • అవి వేగాక.. మిక్సీ పట్టిన టమాటా పేస్టుని వేసి వేగనివ్వాలి. టమాట పచ్చి వాసన పోయేంతవరకు మీడియం ఫ్లేమ్​లో వేగనివ్వాలి.
  • తర్వాత ముందుగానే సిద్ధం చేసిన మసాల పొడిని ఇప్పుడు వేసి.. నిమిషం పాటూ ఫ్రై చెయ్యాలి.
  • ఆ తర్వాత చింతపండు పులుసుని వేయండి.. పులుసు ఎంత కావాలో అందుకు తగ్గట్లుగా నీళ్లు పోసుకోవాలి.
  • పులుసు కొంచెం మరిగిన తర్వాత చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేయండి. పులుసులో ముక్కలు పూర్తిగా మునిగేలా గిన్నెను కదపండి. గరిటెతో తిప్పితే ముక్కలు చెదిరిపోతాయి.
  • ఆ తర్వాత చిటికెడు ఇంగువను కూడా వేసి.. 10 నిమిషాలు ఉడికించాలి.
  • చేప ముక్కల రంగు మారుతూ ఉంటే... ఉడికినట్లే అని అర్థం. సరిగ్గా అప్పుడే కొత్తిమీర వేసి... స్టప్ ఆపేయండి.
  • అంతే అదిరే రుచికరమైన నెల్లూరు చేపల పులుసు రెడీ.
  • ఇలా చేసుకున్న పులుసుని వెంటనే తినడం కంటే ఒక పూట ఆగి తింటే రుచి ఇంకా పెరుగుతుంది.
  • మరి ఇంకెందుకు ఆలస్యం వందలు పోసి బయట ఒకటి, రెండు ముక్కలు తినే బదులు ఇలా ఇంట్లోనే నెల్లూరు చేపల పులుసు చేసుకుంటే ఇంటిల్లిపాది తినొచ్చు.

సండే స్పెషల్ : జింజర్ పెప్పర్ చికెన్ రెసిపీ - ఆహా ఏమి రుచి అంటారంతే!

సండే స్పెషల్‌ స్పైసీ ఎగ్‌ కీమా కర్రీ - ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ కావాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details