తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హోటల్ స్టైల్ 'మైసూర్ బోండా' - ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే అద్దిరిపోతుంది! - Mysore Bonda Recipe - MYSORE BONDA RECIPE

Mysore Bonda Recipe : మైసూర్ బోండాలు అంటే చాలా మందికి ఇష్టం. కానీ.. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హోటల్​లో తిన్నంత టేస్ట్​గా ఉండవు. అంతేకాదు.. గట్టిగా, లోపల పిండి సరిగా ఉడకకుండా ఉంటుంది. అందుకే.. ఈసారి మేం చెప్పే పద్ధతిలో తయారు చేసుకొని చూడండి.

Hotel Style Mysore Bonda
Mysore Bonda Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 4, 2024, 4:09 PM IST

How To Make Hotel Style Mysore Bonda : మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లో ఎక్కువ మంది ఇష్టపడే టిఫెన్స్​లో మైసూర్​ బోండా ఒకటి. బయట టిఫెన్ సెంటర్స్, హోటల్స్​కి వెళ్లినప్పుడు వీటిని ఆస్వాదిస్తుంటారు. అయితే.. అక్కడ తిన్నప్పుడు అవి ఎంతో టేస్టీగా, సాఫ్ట్​గా ఉంటాయి. కానీ, ఇంటి వద్ద ప్రిపేర్ చేసుకుంటే తేడా కొట్టేస్తుంది. మీక్కూడా ఇది అనుభవమేనా? అయితే.. మీకోసమే పక్కా కొలతలతో ఈజీగా తయారు చేసుకునేలా "మైసూర్ బోండా" రెసిపీ తీసుకొచ్చాం. రుచి హోటల్​కు ఏమాత్రం తీసిపోవు! మరి.. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా?

కావాల్సిన పదార్థాలు :

  • పెరుగు - ముప్పావు కప్పు(180 గ్రాములు)
  • బేకింగ్ సోడా - ఒకటిన్నర టీస్పూన్
  • మైదా - 3 కప్పులు(360 గ్రాములు)
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • ఉప్పు - రుచికి తగినంత
  • పచ్చిమిర్చి - కొద్దిగా
  • అల్లం - 1 టేబుల్​స్పూన్
  • కొబ్బరి తురుము - 3 టీస్పూన్లు
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • నూనె - వేయించడానికి తగినంత

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక బౌల్​లో పెరుగు(Curd), బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులో జీలకర్ర, మైదా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ముందుగా ఓసారి లైట్​గా కలుపుకోవాలి. ఆపై తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ గడ్డలు లేకుండా మిశ్రమం మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
  • ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. పెరుగును ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో మైదాను తీసుకోవాలి.
  • ఆ విధంగా మిక్స్ చేసుకున్నాక అరచేతి వేళ్లను స్ప్రెడ్ చేసి మిశ్రమాన్ని 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల పిండి లోపల గాలి ఏర్పడి బొండాలు సాఫ్ట్​గా వస్తాయి.
  • అనంతరం ఆ బౌల్​పై మూతపెట్టి మిశ్రమాన్ని కనీసం నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.
  • తర్వాత రెసిపీలోకి కావాల్సిన పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే అల్లం, కొబ్బరి, కరివేపాకును సన్నగా తురుముకోవాలి.
  • నాలుగంటలయ్యాక పిండిని తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి, కరివేపాకు తురుము వేసుకోవాలి. ఆపై మిశ్రమాన్ని మరోసారి 2 నుంచి 3 నిమిషాలపాటు బాగా బీట్ చేసుకోవాలి.
  • అనంతరం స్టౌపైన కాస్త లోతుగా ఉన్న మూకుడు పెట్టుకొని వేయించడానికి తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. నూనె బాగా కాగిందనుకున్నాక.. మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి చేతితో కొద్దిగా పిండిని తీసుకొని బోండాల మాదిరిగా వేసుకోవాలి.
  • తర్వాత మంటను అడ్జస్ట్ చేసుకుంటూ బోండాలను ఎర్రగా వేయించుకోవాలి. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే 'హోటల్ స్టైల్ మైసూర్ బోండాలు' రెడీ!
  • ఆపై వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పల్లీ చట్నీ లేదా ఇంకేదైనా పచ్చడితో తింటే రుచి అద్దిరిపోతుంది!
  • అయితే, మీరు ప్రిపేర్ చేసుకున్న బోండాలు ఒకవేళ గట్టిగా వస్తున్నాయనుకుంటే తగినంత వంటసోడా వేసుకోలేదని గమనించాలి. అప్పుడు మళ్లీ కాస్త సోడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని బోండాలు వేసుకుంటే సరిపోతుంది.

ABOUT THE AUTHOR

...view details