Dead Person Alive At Funeral :రాజస్థాన్‌లోని జున్ఝను జిల్లాలో ఓ వ్యక్తి దహన సంస్కారాలకు ముందు స్పృహలోకి వచ్చారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయారు. మృతుడిని రోహితాశ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై రంగంలోకి దిగిన అధికారులు- ఆయన చనిపోయాడని ప్రకటించిన ముగ్గురు వైద్యులను సస్పెండ్ చేశారు.
సలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- బధిరుడైన రోహితాశ్ కుమార్(50)కు కుటుంబసభ్యులు ఎవరూ లేరు. దీంతో అతడు జున్ఝనులోని షెల్టర్ హోమ్‌లో కొన్నేళ్లుగా ఉంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గురువారం ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే ఆయనను స్థానిక బీడేకే ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెనీ వార్డులో చికిత్స అందించారు. వైద్యానికి స్పందించడం లేదని మొదట చెప్పిన డాక్టర్లు- ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మరణించారని ప్రకటించారు.
అనంతరం అధికారులు స్థానిక శ్మశానానికి మృతదేహాన్ని తరలించారు. చితిపై ఉంచాక, రోహితాశ్ ఒక్కసారిగా శ్వాస తీసుకోవడాన్ని అక్కడే ఉన్న కొందరు గమనించారు. వెంటనే జిల్లా ఆస్పత్రికి ఆయనను అధికారులు తరలించారు. అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం రోహితాశ్ను జైపుర్‌కు తరలిస్తుండగా, దారిలో మృతి చెందారు.
ఈ ఘటనపై జున్‌ఝును జిల్లా కలెక్టర్ రమవతార్ మీనా స్పందించారు. ఇది వైద్యుల తీవ్ర నిర్లక్ష్యమని తెలిపారు. ఇలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్యుల పని తీరును పరిశీలిస్తామని వెల్లడించారు. డాక్టర్ యోగేశ్ జాఖర్, డాక్టర్ నవనీత్ మీల్, డాక్టర్ సందీప్ పచార్‌ను గురువారం రాత్రి సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
కొన్నిరోజుల క్రితం, ఇలాంటి ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ మెడికల్ కాలేజీలో జరిగింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు మరణించాడనుకుని పోస్టుమార్టం పరీక్షలకు సిద్ధమయ్యారు వైద్యులు. తీరా స్ట్రైచర్‌పై శవ పరీక్షలు చేసే రూమ్‌లోకి తీసుకెళ్లగా యువకుడు బతికున్నట్లు తేలడం వల్ల అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. చివరకు ఏమైందో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి