తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మలేసియా టు మక్కా యాత్ర- సైకిల్​పై యువకుడి 5,500 కిలోమీటర్లు జర్నీ! - makkah cycle yatra

Malaysia To Makkah Cycle Yatra : మలేసియాకు చెందిన ఓ యువకుడు మక్కాకు సైకిల్​పై బయలుదేరాడు. మార్గమధ్యలో పంజాబ్​లోని మక్కా మసీదును సందర్శించాడు. మరి ఆ యువకుడి కథేంటో ఓ సారి తెలుసుకుందాం.

Malaysia To Makkah Cycle Yatra
Malaysia To Makkah Cycle Yatra

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 8:27 PM IST

మలేసియా టు మక్కా సైకిల్ యాత్ర

Malaysia To Makkah Cycle Yatra : మలేసియా నుంచి మక్కాకు సైకిల్​పై బయలుదేరాడు అఫ్దరుద్దీన్ అనే యువకుడు. ఈ క్రమంలో పంజాబ్​ లుధియానాలోని జామా మసీదును శుక్రవారం సందర్శించాడు. మలేసియాకు చెందిన అఫ్దరుద్దీన్​కు జామా మసీదు ఇమామ్ సాదర స్వాగతం పలికారు. మక్కాలో భారత్​, పంజాబ్ భద్రత కోసం ప్రార్థించాలని అఫ్దరుద్దీన్​ను కోరారు. అఫ్దరుద్దీన్ లూధియానాలో చేపట్టిన​ సైకిల్ యాత్రలో సైతం పాల్గొన్నారు జామా మసీదు ఇమామ్.

సైకిల్ యాత్ర చేస్తున్న యువకుడు అఫ్దరుద్దీన్​

సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్ గానీ, సైకిల్​కు ఎటువంటి పోస్టర్లు అంటించకుండానే యాత్రను ప్రారంభించాడు అఫ్దరుద్దీన్. యువకుడు సైకిల్ యాత్ర చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువకుడి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. అఫ్దరుద్దీన్ సైకిల్ యాత్ర చేయడంపై అతడి కుటుంబం కూడా సంతోషంగా ఉందట.

'సైకిల్​పై 5500 కిలోమీటర్లు ప్రయాణించి మక్కాకు మే నెలకల్లా చేరుకుంటాను. లూధియానాలో నాకు ఘనస్వాగతం లభించింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబం నాకు మద్దతుగా నిలిచింది. ధైర్యం ఉంటే ఏ పనైనా చేయవచ్చనే సందేశాన్ని యువతకు ఇవ్వాలనుకుంటున్నా. నేను మక్కా యాత్రకు వెళ్లడం పట్ల నా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు.' అని అఫ్దరుద్దీన్ చెప్పారు.

సైకిల్ యాత్ర చేస్తున్న యువకుడు అఫ్దరుద్దీన్​

అఫ్దరుద్దీన్ అన్ని మతాల యువకులకూ ఆదర్శంగా నిలిచాడని అన్నారు జామా మసీద్ ఇమామ్​. సైకిల్​పై మక్కా మసీదు యాత్ర గొప్ప విషయమని అభిప్రాయపడ్డారు. రేయింబవళ్లు అనే తేడా లేకుండా అఫ్దరుద్దీన్ సైకిల్ తొక్కడాన్ని ప్రశంసించారు.

cyclist Jaspreet Paul Record Latest :హిమాచల్​ప్రదేశ్​లో తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉన్న పరాశర్ రుషి ఆలయానికి సైక్లింగ్ చేసుకుంటూ ఇటీవలే వెళ్లారు ఓ వ్యక్తి. అది కూడా రెండున్నర అడుగుల మందంతో పేరుకుపోయి ఉన్న మంచుపై సైకిల్​ తొక్కుకుంటూ వెళ్లి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. ఒంటరిగా ఈ సరికొత్త ఫీట్ సాధించి రికార్డు సృష్టించారు మండి నగరానికి చెందిన జస్ప్రీత్ పాల్.

ఎవరూ సాహంచని మార్గంలో!
ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం ఐదు గంటలకు మండి నుంచి బయలు దేరారు జస్ప్రీత్ పాల్. అయితే ఆయన పరాశర్ చేరుకోవడానికి ఎవరూ సాహంచని మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గాన్ని చాలా తక్కువ మంది మాత్రమే వినియోగిస్తారు. కానీ జస్ప్రీత్ అదే రూట్ ద్వారా​ ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు పరాశర్ రిషి ఆలయానికి చేరుకున్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

అయోధ్యకు సైకిల్ యాత్ర- 4రోజుల్లో 1100కి.మీ జర్నీ- రామయ్య దర్శనమే పెద్ద అవార్డ్!

28 రాష్ట్రాలు.. 25వేల కి.మీ సైకిల్ యాత్ర.. యువతి సోలో సాహసం వెనక కారణమిదే

ABOUT THE AUTHOR

...view details