Loksabha Election 2024 Congress First List : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్, AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ సహా 39 మంది పేర్లతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసింది. 39స్థానాలకు ఖరారైన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. గురువారం సమావేశమైన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ పేర్లను ఖరారు చేసినట్లు చెప్పారు. తాము ఎన్నికల మూడ్‌లో ఉన్నామని, ప్రచారంలో దూకుడు పెంచుతామని చెప్పారు.
రాహుల్ మరోసారి కేరళలోని వయనాడ్ నుంచి, కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ తిరువనంతపురం నుంచి పోటీ చేయనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేరళలోని అళప్పుజ నుంచి, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ రాజ్‌నంద్‌గావ్ నుంచి లోక్‌సభ బరిలో నిలవనున్నారు. ఈ తొలి జాబితాలో ప్రకటించిన 39 మందిలో 15 మంది జనరల్, 24 మంది ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనార్టీ కేటగిరీకి చెందినవారు ఉన్నట్లు వేణుగోపాల్ తెలిపారు. తొలి జాబితాలో 12 మంది అభ్యర్థులు 50 ఏళ్లు లోపువారే ఉన్నారు. అయితే, ఉత్తర్‌ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అభ్యర్థుల పేర్లను ఇంకా వెల్లడించలేదు. కాగా, గతవారం భారతీయ జనతా పార్టీ 195మంది పేర్లతో తొలిజాబితా విడుదల చేసింది.
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా తొలి ఇదే..
ఛత్తీస్‌గఢ్
- జంజ్‌గిర్-చంపా (ఎస్సీ) -డా.శివకుమార్ దహారియా
- కోర్బా - జ్యోత్స్న మహంత్
- రాజ్‌నందగావ్ - భూపేశ్‌బఘేల్
- దుర్గ్ - రాజేంద్ర సాహూ
- రాయ్‌పూర్ - వికాస్ ఉపాధ్యాయ్
- మహాసముంద్ - తమ్రధ్వజ్ సాహూ
కర్ణాటక - బిజాపూర్ (ఎస్సీ) - హెచ్.ఆర్.అల్గుర్ (రాజు)
- హవేరి - ఆనందస్వామి
- శివమొగ్గ - గీతా శివరాజ్‌కుమార్
- హసన్ - శ్రేయస్ పటేల్
- తుమకూరు - ఎస్.పి.ముద్ద హనుమెగౌడ
- మండ్య - వెంకటరామెగౌడ (స్టార్ చంద్రు)
- బెంగళూరు (రూరల్) - డీకే సురేష్
కేరళ - కాసర్‌గోడ్ - రాజ్‌మోహన్ ఉన్నితన్
- కన్నూరు - కె. సుధాకరన్
- వడకర - షఫీ పరంబిల్
- వయనాడ్ - రాహుల్ గాంధీ
- కోలికోడ్ - ఎం.కె. రాఘవన్
- పాలక్కడ్ - వీకే శ్రీకందన్
- అలతూర్ (ఎస్సీ) - రమ్య హరిదాస్
- త్రిశ్శూరు - కె.మురళీధరన్
- చలకుడి - బెన్నీ బెహనన్
- ఎర్నాకుళం - హిబి ఇడెన్
- ఇడుక్కి - డీన్ కురియాకోసె
- అళప్పుజ - కేసీ వేణుగోపాల్
- మావెలిక్కర (ఎస్సీ) - కోడికున్నిల్ సురేష్
- పతనంథిట్ట - ఆంటోనీ
- అట్టింగల్ - అదూర్ ప్రకాశ్
- తిరువనంతపురం - డా. శశిథరూర్
లక్షద్వీప్ - లక్షద్వీప్ (ఎస్టీ) - మహ్మద్ హమ్‌దుల్లా సయీద్
మేఘాలయా - షిల్లాంగ్ (ఎస్టీ) - విన్సెంట్ హెచ్. పాల
- తురా (ఎస్టీ) - సాలెంగ్ ఎ.సంగ్మ
నాగాలాండ్ - నాగాలాండ్ - ఎస్.సుపోంగమెరెన్ జమీర్
సిక్కిం - సిక్కిం- గోపాల్ ఛెత్రి
తెలంగాణ - జహీరాబాద్ - సురేష్ కుమార్ షెట్కర్
- నల్గొండ - రఘువీర్ కుందూరు
- మహబూబ్‌నగర్ - చల్లా వంశీచంద్ రెడ్డి
- మహబూబాబాద్ (ఎస్టీ) - బలరాం నాయక్
త్రిపుర - త్రిపుర వెస్ట్ - ఆశిష్ కుమార్ సాహా