తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాయ్​బరేలీ నుంచి బరిలో రాహుల్ గాంధీ- మరి అమేఠీ నుంచి ఎవరంటే? - Lok Sabha Elections 2024

Lok Sabha Polls Amethi Raebareli : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారయ్యారు. రాయ్​బరేలీలో నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నారు. అమేఠీలో గాంధీ కుటుంబ విధేయుడు కేఎల్ శర్మ పోటీ చేయనున్నారు.

Lok Sabha Polls Amethi Raebareli
RAHUL GANDHI (ANI SOURCE)

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 7:50 AM IST

Updated : May 3, 2024, 11:42 AM IST

Lok Sabha Polls Amethi Raebareli :ఓవైపు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుండగా, మరోవైపు ఆ రెండు స్థానాలపైనే అందరి దృష్టి నెలకొంది. అవే యూపీలోని అమేఠీ, రాయ్‌బరేలీ. ఒకప్పుడు కాంగ్రెస్​ కంచుకోటగా ఉన్న ఈ స్థానాలకు ఎట్టకేలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. రాయ్​బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అమేఠీ నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ లాల్ శర్మ బరిలో దిగనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడించింది.

అయితే రాయ్​బరేలీ, అమేఠీ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలుకు శుక్రవారంతో గడువు ముగియనుంది. దీంతో మరికొద్ది గంటల్లో రాహుల్ గాంధీ, కిశోరీ లాల్ శర్మ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఇక ప్రియాంకా గాంధీ ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదని స్పష్టమైంది. రాహుల్ గాంధీ నామినేషన్ ప్రక్రియకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ హాజరయ్యే అవకాశం కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాగా, సోనియాగాంధీ 2004 నుంచి 2024 వరకు రాయ్​బరేలీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు సోనియా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019 లోకసభ ఎన్నికల్లో సోనియాగాంధీ చేతిలో ఓడిపోయిన ప్రతాప్​ సింగ్​నే మరోసారి బరిలోకి దించింది భారతీయ జనత పార్టీ. మరోవైపు 2019 ఎన్నికల్లో అమేఠీ నుంచి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమిపాలయ్యారు. ఈసారి ఈ నియోజకవర్గం నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ లాల్​ను బరిలోకి దింపింది కాంగ్రెస్.

ఇక తన తల్లి సోనియాగాంధీకి కలిసి వచ్చిన నియోజకవర్గం కావడం వల్ల రాహుల్ గాంధీ రాయ్​బరేలీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వయనాడ్​ నుంచి కూడా పోటీ చేశారు రాహుల్. ఇటీవల అక్కడ పోలింగ్ జరిగింది. అయితే అమేఠీకి గాంధీ కుటుంబానికి మధ్య బంధం చాలా బలంగా ఉందని ఆ పార్టీ నాయకుడు దీపక్ సింగ్ తెలిపారు. ఆ బంధం ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పారు.

Last Updated : May 3, 2024, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details