తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్రిక్తంగా 'నబన్న అభియాన్'- విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్​- 'దీదీకి పాలిగ్రాఫ్ పరీక్ష చేయాల్సిందే' - Kolkata Doctor Case - KOLKATA DOCTOR CASE

Kolkata Nabanna Rally Live update
Kolkata Nabanna Rally Live update (ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2024, 12:06 PM IST

Updated : Aug 27, 2024, 3:26 PM IST

Kolkata Nabanna Rally Live update :కోల్​కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా 'నబన్న మార్చ్​' పేరుతో విద్యార్థి సంఘాలు మంగళవారం సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సచివాలయాన్ని పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. పరిసరాల ప్రాంతాల్లో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆరు వేల మంది పోలీసులను మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లను అడ్డుగా పెట్టారు. అనుమానం వచ్చినవారిని తనిఖీ చేసిన తర్వాతే వదులుతున్నారు.

LIVE FEED

3:18 PM, 27 Aug 2024 (IST)

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘం పశ్చిమ బంగా ఛాత్రో సమాజ్‌ మంగళవారం చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. నబన్నా అభియాన్ పేరుతో హావ్‌డా నుంచి ప్రారంభమైన ర్యాలీని సంతర్‌గాచి వద్ద పోలీసులు అడ్డుకోవడం వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్చ్‌లో పాల్గొన్న ఆందోళనకారులు బారికేడ్లను బద్దలుకొట్టేందుకు ప్రయత్నించారు. కొన్నింటిని లాగి పడేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వీరిపై బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీఛార్జ్‌ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. ఎంజీ రోడ్​, జీటీ రోడ్డులో ఇదే తరహా పరిస్థితి నెలకొంది.

"మమ్మల్ని పోలీసులు ఎందుకు కొట్టారు? మేం ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదు. చనిపోయిన డాక్టర్‌కు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధ్యత వహించి రాజీనామా చేయాలి" అని నిరసనలో పాల్గొన్న ఓ మహిళ డిమాండ్ చేశారు. అయితే నిరసనకారుల రాళ్ల దాడిలో పలువురు పోలీసు అధికారులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ర్యాలీ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

మమతకు పాలిగ్రాఫ్ పరీక్ష చేయాల్సిందే!
మరోవైపు, విద్యార్థులపై లాఠీఛార్జి చేయడాన్ని బీజేపీ ఖండించింది. మమత బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో ప్రమేయం ఉన్నవారిని మమత రక్షించారని ఆరోపించింది. కేసులో నిజనిజాలు తెలుసుకోవడానికి మమతతోపాటు పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్​కు సీబీఐ పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేసింది.

1:05 PM, 27 Aug 2024 (IST)

నబన్న మార్చ్ ఉద్రిక్తంగా మారింది. మార్చ్‌లో పాల్గొన్న ఆందోళనకారులు బారికేడ్లను బద్దలుకొట్టేందుకు ప్రయత్నించారు. కొన్నింటిని లాగి పడేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వీరిపై వాటర్ కెనాన్స్​, బాష్పవాయువును ప్రయోగించారు. లాఠీఛార్జ్‌ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు.

12:53 PM, 27 Aug 2024 (IST)

  • ప్రారంభమైన నబన్న మార్చ్
  • హావ్‌డాలోని సంతరాగాఛీ వద్దకు చేరుకున్న నిరనసకారులు

12:11 PM, 27 Aug 2024 (IST)

'విద్యార్థుల ర్యాలీకి ప్రభుత్వం సహకరించాలి'

విద్యార్థులు శాంతియుతంగా చేపట్టిన ర్యాలీని ప్రభుత్వం కొన్ని వ్యవస్థల ద్వారా అణచివేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌. శాంతియుత నిరసనలను అడ్డుకోవద్దని సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం వద్దని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సూచించారు.

12:10 PM, 27 Aug 2024 (IST)

'గందరగోళం సృష్టించేందుకే ర్యాలీ'

వైద్య విద్యార్థిని మృతిపట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి, ఆగ్రహాన్ని ఉపయోగించుకుని బంగాల్​లో అరాచకాన్ని సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు ఆధారాలు దొరికాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ర్యాలీకి పిలుపునిచ్చిన వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్లో రాజకీయ పార్టీ నాయకుడిని కలిసినట్లు సమాచారం ఉందని తెలిపారు. నిరసన పేరుతో పోలీసులను రెచ్చగొట్టి పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు తమకు నిర్దిష్ట సమాచారం ఉందని చెప్పారు. యూజీసీ నెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Aug 27, 2024, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details