తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వందోసారి వరించిన అదృష్టం- లాటరీలో రూ.59 కోట్ల జాక్​పాట్ - KERALA MAN WON LOTTERY

రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిన ఉద్యోగి- లాటరీలో రూ.59కోట్ల జాక్​పాట్

Kerala Man Won Lottery
Kerala Man Won Lottery (ANI)

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2025, 1:12 PM IST

Kerala Man Won Lottery : కేరళకు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అబుదాబిలో అతడు కొన్న లాటరీ టికెట్​కు రూ.59.29 కోట్ల(25 మిలియన్ల దిర్హమ్) జాక్ పాట్ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడైపోయాడు.

అసలేం జరిగిందంటే?
కోజికోడ్​లోని నారిపట్టాకు చెందిన ఆషిక్ పదింజరత్ (39) షార్జాలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం అబుదాబిలో తీసిన లాటరీ 271వ డ్రాలో అతడు విజేతగా నిలిచాడు. దీంతో అతడి రూ.59.29కోట్ల జాక్ పాట్ దక్కింది. ఈ క్రమంలో ఆషిక్, అతడి కుటుంబ సభ్యులు ఆనందంలో తేలిపోయారు. ఈ లాటరీ మొత్తానికి ట్యాక్స్ కూడా ఉండకపోవడం గమనార్హం. అయితే ఆషిక్ కొన్న వందో లాటరీ టికెట్​కు అదృష్టం వరించింది.

"గత 19ఏళ్లుగా ఆషిక్ యూఏఈలో నివసిస్తున్నాడు. గత పదేళ్లుగా లాటరీ టికెట్​లను కొని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. లాటరీ గెలిచే వరకు టికెట్లు కొనాలని నిర్ణయించుకున్నాడు. చివరకు ఆషిక్ జాక్​పాట్ కొట్టాడు." అని ఆషిక్ తండ్రి అహ్మద్ తెలిపారు.

ఆషిక్ తన కుటుంబ సభ్యులకు తనకు లాటరీ తగలిందని బుధవారం రాత్రి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం వల్ల వారందరూ సంతోషపడ్డారు. కాగా, ఈ ఏడాది డ్రాలో ఆషిక్ ఆరు టిక్కెట్లు కొన్నాడు. అందులో ఓ టికెట్​ను 1,000 దిర్హామ్స్​కు కొనుగోలు చేశాడు. జనవరి 29న ఆన్​లైన్‌లో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 456808. ఇదే ఆషిక్​కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ టికెట్​కే లాటరీ తగిలింది.

క్రిస్మస్- న్యూ ఇయర్ బంపర్ లాటరీ
మరోవైపుకేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే క్రిస్మస్- న్యూ ఇయర్ బంపర్ లాటరీ లక్కీ డ్రా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ లాటరీ మొదటి బహుమతి విజేతకు రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. అంతేకాదు మరిన్ని ప్రైజ్​లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే రెండో బహుమతి కోటి రూపాయలు, మూడో బహుమతి రూ.10 లక్షలు, నాలుగో బహుమతి రూ. 3 లక్షలు, ఐదో బహుమతి రూ. 2 లక్షల చొప్పున లాటరీ టికెట్ కొన్న విజేతలకు లభించనుంది. ఆరో బహుమతి రూ.5000 అందుతుంది.

ABOUT THE AUTHOR

...view details