తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫ్రీ బస్ ఎఫెక్ట్​?- కర్ణాటకలో 15% పెరిగిన టికెట్ ఛార్జీలు- మన సంగతేంటో? - KARNATAKA HIKES BUS FARE

బస్సు టికెట్ ఛార్జీలు పెంచిన కర్ణాటక ప్రభుత్వం - 15శాతం పెంచుతూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం - తెలుగు రాష్ట్రాల్లోనూ పెంపు తప్పదా?

Karnataka Hikes Bus Fare 15 Per Cent
Karnataka Hikes Bus Fare 15 Per Cent (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2025, 7:26 PM IST

Karnataka Hikes Bus Fare 15 Per Cent :బస్సు టికెట్ ఛార్జీలను 15శాతం పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినెట్ ఛార్జీల పెంపునకు ఆమోదం తెలిపింది. ఇంధన ధరలు, సిబ్బందిపై వ్యయం వంటి నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్​కే పాటిల్ తెలిపారు.

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NWKRTC), కళ్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KKRTC), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) రవాణా కార్పొరేషన్లలో బస్సు ఛార్జీలు 15శాతం పెంచారు. " ఈ నాలుగు ట్రాన్స్​పోర్ట్​ కార్పొరేషన్లలో పదేళ్ల క్రితం రోజువారీ డీజిల్ వినియోగం రూ.9.16కోట్లు ఉండేది. ఇప్పుడు అది రూ.13.21 కోట్లకు పెరిగింది. ఇక సిబ్బందిపై రోజువారీ ఖర్చు రూ.12.95 కోట్లు నుంచి రూ.18.36 కోట్లు. అందుకే ఈ ఛార్జీ పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని హెచ్​కే పాటిల్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

'ఫ్రీ బస్సు పథకం అలాగే ఉంటుంది'
కర్ణాటకలో అమలువుతున్న ఫ్రీ బస్సు పథకం 'శక్తి' నాన్​-లగ్జరీ బస్సుల్లో కొనసాగుతుందని పాటిల్ చెప్పారు. రూ.2000 కోట్ల మేర ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను క్లియర్ చేశామని తెలిపారు. అయితే 13శాతం, 15శాతం ఛార్జీల పెంపు గురించి చర్చించామని, కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో ఉన్న టికెట్ రేట్లను పరిశీలించి 15శాతం పెంచాలని తుది నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ పెంపు తప్పదా?
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. దాదాపు ఏడాదిన్నర పైగా కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. వీరి స్ఫూర్తితో తెలంగాణలోని కాంగ్రెస్​ ప్రభుత్వం 'మహాలక్ష్మి' పథకం తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్​లోనూ ఈ ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ పథకానికి సంబంధించి పలువురు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ఇటీవల కీలక చర్చలు జరుపారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాం ప్రసాద్‌రెడ్డి, ఆర్​టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అంశంపై తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆరా తీశారు. ఈ విధానం అమల్లో ఉన్న కర్ణాటక, దిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తామని అధికారులు తెలిపారు. దీనిపై సమగ్ర నివేదికను వీలైనంత త్వరగా అందజేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఉగాది నాటికి పథకం అమల్లోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

ABOUT THE AUTHOR

...view details