జమ్మూకశ్మీర్ రెండో దశ పోలింగ్- 56 శాతం ఓట్లు నమోదు
- 26 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ముగిసిన పోలింగ్
- 56.05 శాతం ఓట్లు నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడి
- అక్టోబరు 1న మూడో దశ పోలింగ్- 8న ఓట్ల లెక్కింపు
Published : Sep 25, 2024, 7:12 AM IST
|Updated : Sep 25, 2024, 4:04 PM IST
JK Assembly Elections Phase 2 :జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 56.05 శాతం ఓట్లు నమోదైనట్లు ఎన్నికల ముఖ్య కమిషనర్ పీకే పోలె వెల్లడించారు.
LIVE FEED
జమ్మూకశ్మీర్ రెండో దశ పోలింగ్- 56 శాతం ఓట్లు నమోదు
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 46.12శాతం పోలింగ్ నమోదైంది.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 36.93% ఓటింగ్ నమోదు అయ్యింది.
జమ్ముకశ్మీర్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 24.10% ఓటింగ్ నమోదైంది.
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గందర్‌బల్, బుద్గాం స్థానాల్లో ఒమర్ అబ్దుల్లా పోటీలో ఉన్నారు.
అమెరికా, ఈయూ సహ వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తల బృందం పలు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు.
జమ్ముకశ్మీర్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 10.22% ఓటింగ్ నమోదైంది.
జమ్ముకశ్మీర్‌లో రెండో విడత పోలింగ్ జరుగుతున్నందున ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ముఖ్యంగా మొదటి సారి ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద రహిత, అభివృద్ధి చెందిన జమ్ముకశ్మీర్‌ను సృష్టించడం కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. యువతకు బంగారు భవిష్యత్, మహిళా సాధికారత, విద్య, ఉగ్రవాదాన్ని అంతం చేసే ప్రభుత్వానికి ఉత్సాహంగా ఓటు వేయాలని ప్రజలకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు. మరోవైపు దశాబ్ద కాలంగా తమ రాష్ట్రం ఏ విధంగా దిగజారిపోయిందో గుర్తుంచుకుని ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. జమ్ముకశ్మీర్‌ను సురక్షితంగా, మంచి భవిష్యత్ కోసం ఓటర్లు ప్రజాస్వామ్య శక్తిని ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు.