తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హైదరాబాద్ టూ కాశీ - ఐఆర్​సీటీసీ స్పెషల్​ టూర్ - ధర కూడా అందుబాటులోనే! - IRCTC Ganga Ramayan Yatra - IRCTC GANGA RAMAYAN YATRA

Ganga Ramayan Yatra: ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించుకోవాలనే వారికి IRCTC గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి గంగా రామాయణ్ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. మరి ఈ టూర్​ ఎన్ని రోజులు సాగనుంది? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

IRCTC Ganga Ramayan Yatra
IRCTC Ganga Ramayan Yatra (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 22, 2024, 4:50 PM IST

IRCTC Ganga Ramayan Yatra: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC).. విహారయాత్రలకు వెళ్లేవారి కోసం పలు టూర్‌ ప్యాకేజీలను అందిస్తోంది. ఇప్పటికే పర్యాటక ప్రాంతాలు, దర్శనీయ స్థలాలను కవర్‌ చేస్తూ అనేక ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఆధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోవాలనే వారి కోసం ఐఆర్‌సీటీసీ మరో ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి గంగా రామాయణ్ యాత్ర పేరుతో ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. మరి, ఈ టూర్​ ఎన్ని రోజులు సాగనుంది? ఏయే ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఈ "గంగా రామాయణ్​" ప్యాకేజీలో భాగంగా నైమిశారణ్య, ప్రయాగ్‌రాజ్‌, సారనాథ్‌, వారణాసి పుణ్యక్షేత్రాలను దర్శించవచ్చు. ఈ యాత్ర 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది. హైదరాబాద్‌ నుంచి విమానంలో వారణాసికి చేరుకోవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. చివరి రోజు లఖ్‌నవూ నుంచి హైదరాబాద్‌ రావడంతో టూర్​ కంప్లీట్​ అవుతుంది. ఈ ప్యాకేజీ జులై 20 నుంచి అందుబాటులోకి రానుంది.

ప్రయాణం ఎలా అంటే:

  • మొదటి రోజు హైదరాబాద్‌ ఎయిర్​పోర్ట్​ నుంచి వారణాసికి చేరుకుంటారు. అక్కడ హోటల్‌కు చేరుకొని కాసేపు రెస్ట్​ తీసుకుని మధ్యాహ్న భోజనం తర్వాత కాశీ ఆలయ సందర్శనకు తీసుకెళ్తారు. తర్వాత గంగా ఘాట్‌ విజిట్​ ఉంటుంది. రాత్రి వారణాసిలోనే బస ఏర్పాటు చేస్తారు.
  • రెండో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ పూర్తి చేసుకొని సారనాథ్‌కు బయలుదేరుతారు. అక్కడ దర్శనం అయ్యాక మధ్యాహ్నం మళ్లీ వారణాసికి చేరుకుంటారు. అక్కడి నుంచి బిర్లా ఆలయానికి వెళతారు. రెండో రోజు రాత్రి బస కూడా వారణాసిలోనే ఉంటుంది.
  • మూడో రోజు వారణాసి నుంచి బయలుదేరి ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటారు. అక్కడి అలోపీ దేవీ ఆలయం, త్రివేణి సంగమాన్ని సందర్శిస్తారు. సాయంత్రం అయోధ్యకు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.

హైదరాబాద్​ To షిరిడీ- IRCTC స్పెషల్ టూర్‌​ ప్యాకేజీ- అతి తక్కువ ధరలో సాయి దర్శనం! - irctc shirdi tour package

  • నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ కంప్లీట్​ చేసి అయోధ్యలోని ఆలయాన్ని దర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుంచి బయలు చేరి లఖ్‌నవు చేరుకుంటారు. రాత్రి అక్కడే హోటల్‌లో బస ఏర్పాటు చేస్తారు.
  • ఐదో రోజు లఖ్‌నవూలోని హోటల్‌లో అల్పాహారం పూర్తి చేసి నైమిశారణ్యానికి బయలుదేరుతారు. రోజంతా అక్కడే గడపాల్సి ఉంటుంది. సాయంత్రం తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. రాత్రి బస అక్కడే ఉంటుంది.
  • ఆరో రోజు బ్రేక్​ఫాస్ట్​ పూర్తి చేసుకుని లఖ్‌నవూలోని చారిత్రక కాంప్లెక్స్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నానికి హోటల్‌ చేరుకుంటారు.
  • సాయంత్రం నాలుగు గంటల కల్లా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని విమానంలో హైదరాబాద్‌కి వచ్చేస్తారు. దీంతో యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజీలో భాగంగా అందేవి ఏంటంటే..

  • హైదరాబాద్‌ నుంచి వారణాసి, లఖ్‌నవూ నుంచి హైదరాబాద్‌కు విమాన టికెట్లు
  • రెండు రాత్రులు వారణాసిలో, ఒక రాత్రి అయోధ్యలో, రెండు రాత్రులు లఖ్‌నవూలో బస
  • ఐదు రోజులు బ్రేక్​ఫాస్ట్​, రాత్రి భోజనం ఉంటుంది. మధ్యాహ్న భోజనం మాత్రం ఒక రోజే ఉంటుంది. అలాగే ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.

ప్యాకేజీ ఛార్జీలు.. (ఒకరికి)

  • సింగిల్‌ ఆక్యుపెన్సీ- రూ.39,400
  • డబుల్‌ ఆక్యుపెన్సీ- రూ.31,000
  • ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ- రూ.29,850
  • చైల్డ్‌ విత్‌ బెడ్‌ (5- 11ఏళ్లు)- రూ.27,650
  • చైల్డ్‌ వితౌట్‌ బెడ్‌ (5- 11ఏళ్లు)- రూ.23,050
  • చైల్డ్‌ వితౌట్‌ బెడ్‌ (2- 4ఏళ్లు)- రూ.17,400

యాత్ర ప్రారంభం కావడానికి 7 రోజుల ముందు వరకు మాత్రమే టికెట్‌ రద్దు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ టూర్​కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, అలాగే ప్యాకేజీ బుక్​ చేసుకోవడానికి ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

IRCTC తిరుమల స్పెషల్ టూర్ ప్యాకేజీ - తక్కువ ధరలోనే 3 రోజుల ట్రిప్ - స్పెషల్ దర్శనం కూడా! - IRCTC Tirumala Tour Package

IRCTC కార్తీక మాసం స్పెషల్ టూర్ - 7 జ్యోతిర్లింగాల దర్శనం - స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా!

ABOUT THE AUTHOR

...view details