IRCTC Shirdi With Aurangabad Package: దేశంలోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాలను చూడాలనుకునే వారి కోసం.. ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తోంది. టూరిస్టులకు ఈ ప్యాకేజీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే బడ్జెట్లో ఈ స్పెషల్ టూర్లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే.. తాజాగా హైదరాబాద్ నుంచి షిరిడీకి వెళ్లేందుకు ప్యాకేజీని ప్రకటించింది. మరి ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
ఐఆర్‌సీటీసీ షిరిడీ విత్ ఔరంగాబాద్(Shirdi With Aurangabad) పేరుతో ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ 3రాత్రులు, 4 పగళ్లు కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఈ టూర్లో సాయి నాథుని దర్శనంతో పాటు ఔరంగాబాద్, ఎల్లోరా గుహలు, శని శిగ్నాపూర్ చూడొచ్చు. ప్రతీ శుక్రవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
ప్రయాణ వివరాలు ఇవే:
- మొదటి రోజు సాయంత్రం 6:40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్(అజంతా ఎక్సెప్రెస్ - 17064) స్టార్ అవుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 7 గంటలకు నాగర్సోల్ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి షిరిడీ తీసుకెళ్తారు. షిరిడీ హోటల్లో చెకిన్ అవ్వాలి. బ్రేక్ఫాస్ట్ అనంతరం సాయి నాథుని దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం శని శిగ్నాపూర్ స్టార్ట్ అవుతారు. అక్కడి శని దేవాలయం దర్శించుకుని ఔరంగాబాద్ బయలుదేరుతారు. అక్కడ హోట్లో చెకిన్ అయ్యి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.