IRCTC Marvels of Maharashtra Package:చూపు తిప్పుకోనివ్వని అందాలు.. అజంతా, ఎల్లోరా గుహల సొంతం. అంతేనా అనేక శిల్ప కళారీతులు ఒకే చోట కనువిందు చేసే ప్రాంతం అది. ఈ అందాలను ఆస్వాదించాలే గానీ వర్ణించడానికి మాటలు సరిపోవు. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఆ శిల్ప సౌందర్యాన్ని వీక్షించాలని చాలా మంది భావిస్తుంటారు. మరి మీరు కూడా ఆ లిస్ట్‌లో ఉన్నారా? అయితే మీకోసం.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐఆర్సీటీసీ టూరిజం మార్వెల్స్ ఆఫ్ మహారాష్ట్ర పేరుతో ఈ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ మొత్తం మూడు రాత్రులు, నాలుగు పగళ్లుగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఈ టూర్ ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఔరంగాబాద్, ఎల్లోరా, అజంతా ప్రదేశాలు కవర్ అవుతాయి. ప్రతి శుక్రవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
ప్రయాణం ఇలా..
- మొదటి రోజు సాయంత్రం 6:40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్(అజంతా ఎక్సెప్రెస్ - 17064) బయలుదేరుతుంది. రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
- రెండో రోజు తెల్లవారుజామున ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్ చేసుకుని ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. బ్రేక్‌ఫాస్ట్ అనంతరం ఎల్లోరా గుహలు సందర్శిస్తారు. అలాగే ఘృష్ణేశ్వర్ టెంపుల్ని కూడా దర్శించుకుంటారు. సాయంత్రం మినీ తాజ్‌మహల్ విజిట్ చేస్తారు. రాత్రికి హోటల్‌కు చేరుకుని భోజనం చేసి అక్కడే బస చేస్తారు.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి అజంతా బయలుదేరుతారు. అక్కడ అజంతా గుహలు విజిట్ చేస్తారు. సాయంత్రం తిరిగి ఔరంగాబాద్ కు వచ్చి అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 10:45 గంటలకు హైదరాబాద్‌కు రిటర్న్ జర్నీ(ట్రైన్ నెంబర్ 17063) స్టార్ట్ అవుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
- నాలుగో రోజు ఉదయం 10 గంటలకు కాచీగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.
ప్రకృతి అందాలకు నిలయమైన 'ఊటీ' చూసొస్తారా? - బడ్జెట్ ధరకే IRCTC సూపర్ ప్యాకేజీ!