IRCTC Heritage of Madhya Pradesh Package: దేశంలోని గొప్ప పర్యాటక రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. ఆధ్యాత్మికత, చారిత్రక, ప్రపంచ వారసత్వ సంపద, ప్రకృతి రమణీయ, వన్యప్రాణి సంరక్ష కేంద్రాలు బోలెడున్నాయి ఉన్నాయి ఇక్కడ చూడటానికి. అయితే ఇవన్నీ ఒకేసారి చూడటం కష్టం కాబట్టి.. వారం రోజుల్లో మూడు ముఖ్యమైన నగరాలు చూసే విధంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఓ ప్యాకేజీని ప్రకటించింది. మరి ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐఆర్సీటీసీ "హెరిటేజ్ ఆఫ్ మధ్యప్రదేశ్(Heritage of Madhya Pradesh)" పేరుతో ఈ టూర్ నిర్వహిస్తున్నారు. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 పగళు కొనసాగనుంది. ఈ టూర్లో గ్వాలియర్, ఖజురహో, ఓర్ఛా ప్రాంతాలను చూడొచ్చు. హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. ప్రతి శుక్రవారం ఈ టూర్ ఉంటుంది.
ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు సాయంత్రం 4.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్(12707) బయలుదేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
- రెండో రోజు మధ్యాహ్నం 01.30 గంటలకు గ్వాలియర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. ఫ్రెషప్ తర్వాత మోరెనా బయలుదేరుతారు. అక్కడ చౌసత్ యోగిని ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి తిరిగి గ్వాలియర్‌కు చేరుకుంటారు. రాత్రికి గ్వాలియర్లోనే స్టే చేయాల్సి ఉంటుంది.
కాశీ టూ నైమిశారణ్య వయా అయోధ్య - IRCTC అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ!
- మూడో రోజు ఉదయం గ్వాలియర్ ఫోర్ట్‌ను సందర్శిస్తారు. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి.. జై విలాస్ ప్యాలెస్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచి ఓర్చాకు వెళ్తారు. అక్కడ హోటల్లో చెకిన్ అయిన తర్వాత.. ఓర్చా ఫోర్ట్‌ను సందర్శిస్తారు. ఆ రాత్రికి ఓర్చాలోనే బస ఉంటుంది.
- నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి.. ఖజురహోకి స్టార్ట్ అవుతారు. అక్కడ చెకిన్ అయిన తర్వాత.. స్థానికంగా ఉన్న ఆలయాలను దర్శించుకుంటారు. సాయంత్రం లైటింగ్ అండ్ సౌండ్ షోను చూస్తారు. రాత్రికి ఖజురహోలోనే బస చేస్తారు.
- ఐదో రోజు హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత.. వెస్ట్రన్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ దర్శించుకుంటారు. ఆ తర్వాత చెక్ అవుట్ అయ్యి.. సాట్నాకు స్టార్ట్ అవుతారు. అక్కడి రైల్వే స్టేషన్ నుంచి 11.25 హైదరాబాద్‌కు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి అంతా జర్నీలోనే ఉంటారు.
- ఆరో రోజు రాత్రి 09.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.
ధర వివరాలు చూస్తే..
- కంఫర్ట్(3AC)లో ట్విన్ షేరింగ్‌కు రూ. 22,070 ధర ఉండగా.. ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 16,950 ధరగా ప్రకటించారు.
- 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ. 12,770, విత్ అవుట్ బెడ్ అయితే రూ.11,650 గా ధరలు నిర్ణయించారు.
- ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్ట్ వంటివి కవర్ అవుతాయి.
- ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 20, 27వ తేదీలో అందుబాటులో ఉంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, ప్యాకేజీ బుకింగ్ కోసంఈ లింక్‌పై క్లిక్ చేయండి.
అటు శ్రీశైల మల్లన్న - ఇటు యాదాద్రి నరసింహ - తక్కువ ధరకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ! పైగా ఈ ప్లేస్‌లు కూడా!
బ్యాంకాక్ చూసొద్దామా బాసూ..? - IRCTC సూపర్ ప్యాకేజీ! - సఫారీ వరల్డ్ టూర్ కూడా!