తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అటు భగవత్​ దర్శనాలు - ఇటు బీచ్​లో సరదాలు - సముద్ర తీరానికి IRCTC అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ! - IRCTC Hyderabad Karnataka Tour

IRCTC Packages : ప్రముఖ దేవాలయాలను, అందమైన ప్రదేశాలను, పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకునేవారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) గుడ్ న్యూస్ చెప్పింది. కర్ణాటకలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకునేందుకు వీలుగా ఓ ప్యాకేజీ ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

IRCTC Packages
IRCTC Packages (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 2:08 PM IST

IRCTC Hyderabad Karnataka Tour: కర్ణాటకలోని ప్రముఖ ప్రదేశాలను చూడాలని అనుకుంటున్న వారి కోసం ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైద‌రాబాద్ నుంచి కర్ణాటకలోని ఉడుపి, శృంగేరి, మురుదేశ్వర్ త‌దిత‌ర ప్రాంతాలను చూసేందుకు సూపర్ ప్యాకేజీని ప్ర‌క‌టించింది. మరి ఈ ప్యాకేజీ ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్ నుంచి కర్ణాటకకు వెళ్లే ప్రయాణికుల కోసం "కోస్టల్ కర్ణాటక(Coastal Karnataka)"’ పేరుతో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలను సందర్శించడానికి IRCTC ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. రైలు ప్రయాణం ద్వారా సాగే ఈ టూర్​ ప్రతీ మంగళవారం ఉంటుంది. ప్రస్తుతం జూన్​ 25న టూర్​ అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు సాగనుంది. ఈ ప్యాకేజీలో ఉడిపి, శృంగేరి, మురుడేశ్వర్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.

ప్రయాణం వివరాలు ఇవే:

  • మొదటి రోజు కాచిగూడ స్టేషన్ నుంచి కాచిగూడ - మంగుళూరు సెంట్రల్​ ఎక్స్​ప్రెస్​(ట్రైన్​ నెం 12789) ఉదయం 06.05 రైలు బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 09.30 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్​కు చేరుకుంటుంది. అక్కడ్నుంచి పికప్​ చేసుకుని ఉడిపికి తీసుకెళ్తారు. హోటల్​లో చెకిన్ అయిన తర్వాత శ్రీకృష్ణ ఆలయం, సెయింట్ మేరీ ఐల్యాండ్, మల్పే బీచ్ విజిట్​ చేస్తారు. రాత్రి ఉడిపిలోనే స్టే చేస్తారు.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత కొల్లూరు స్టార్ట్​ అవుతారు. అక్కడ మూకాంబికా ఆలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత కొల్లూరు నుంచి మురుడేశ్వర్​కు చేరుకుంటారు. అక్కడ శివుడి ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం గోకర్ణకు బయలుదేరుతారు.
  • అక్కడ టెంపుల్​ను విజిట్​ చేసిన తర్వాత బీచ్​లో ఎంజాయ్​ చేయొచ్చు. ఆ తర్వాత మళ్లీ ఉడిపికి రిటర్న్​ అవుతారు. నైట్​ ఉడిపిలోనే స్టే ఉంటుంది.

"లేహ్​" అందాల వీక్షణ కోసం IRCTC సూపర్​ ప్యాకేజీ - ధర అందుబాటులోనే - వివరాలివే! - IRCTC Leh With Turtuk Package

  • నాలుగో రోజు ఉడిపి నుంచి చెక్​ అవుట్​ అయ్యి హోరనాడు బయలుదేరుతారు. అక్కడ అన్నపూర్ణ దేవి ఆలయాన్ని దర్శించుకోవాలి. అక్కడి నుంచి శృంగేరికి స్టార్ట్​ అవుతారు. అక్కడ శారదాంబ టెంపుల్​ దర్శించుకుని సాయంత్రానికి మంగుళూరుకు బయలుదేరుతారు. రాత్రి మంగుళూరులోనే బస ఉంటుంది.
  • ఐదో రోజు హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి మంగుళూరులోని మంగళదేవి టెంపుల్​, కద్రి శ్రీ మంజునాథ ఆలయం దర్శించుకోవాలి. సాయంత్రం తన్నిర్భావి బీచ్​, కుద్రోలి శ్రీ గోకర్ణనాథ క్షేత్రం దర్శనం ఉంటుంది. రాత్రి 7 గంటల వరకు మంగళూరు సెంట్రల్​కు చేరుకుని హైదరాబాద్ కు తిరుగు పయనం అవుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • ఆరో రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడకు చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

టికెట్ ధరలు:

  • కంఫర్ట్ క్లాస్​లో సింగిల్ షేరింగ్ రూ. 37,790, డబుల్ షేరింగ్ కు రూ.21,820, ట్రిపుల్ షేరింగ్​కు రూ.17,420గా ఉంది.
  • ఇక స్టాండర్డ్ క్లాస్​లో చూస్తే సింగిల్ షేరింగ్​కు రూ.34,980, డబుల్ షేరింగ్​కు రూ.18,830, ట్రిపుల్ షేరింగ్​కు రూ.14,420 ధరగా నిర్ణయించారు.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

"ఈ మంచుల్లో.. ప్రేమంచుల్లో.." - కశ్మీర్​ అందాల వీక్షణకు IRCTC స్పెషల్​ ప్యాకేజీ! - IRCTC Mystical Kashmir Tour

కృష్ణుడు ఏలిన ద్వారక చూసొస్తారా? తక్కువ ధరకే IRCTC ప్రత్యేక ప్యాకేజీ! మరెన్నో ప్రదేశాలు కూడా! - IRCTC Sundar Saurashtra Package

ABOUT THE AUTHOR

...view details