తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత సైన్యంలో కీలక మార్పులు- డ్రాగన్​ దూకుడుకు చెక్​ పెట్టడమే లక్ష్యం! - భారత సైన్యంలో కీలక మార్పులు

Indian Army New Corps : వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని కొనసాగించాలని భారత్‌, చైనాలు నిర్ణయించాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణే లక్ష్యంగా ఫిబ్రవరి 19న 21వ విడత కోర్‌ కమాండర్‌ స్థాయి సమావేశం జరిగిందని పేర్కొంది. మరోవైపు బీజింగ్‌తో చర్చలు కొనసాగిస్తూనే భారత్‌ సైన్యంలో కీలక మార్పులు చేస్తోంది.

Indian Army New Corps
Indian Army New Corps

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 8:07 PM IST

Indian Army New Corps : వాస్తవాధీన రేఖ వద్ద సరిహద్దు వివాదంపై చైనాతో చర్చలు కొనసాగిస్తూనే భారత్‌ తన సైన్యంలో కీలక మార్పులు చేస్తోంది. తాజాగా న్యూదిల్లీ-బీజింగ్‌ మధ్య 21వ విడత కోర్‌ కమాండర్‌ స్థాయి సమావేశం జరిగింది. దీనిని చుషూల్‌-మాల్డో సరిహద్దుల్లో భారత్‌ వైపు మీటింగ్‌ పాయింట్‌ వద్ద నిర్వహించారు. పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణే లక్ష్యంగా చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇరు పక్షాలు సైనిక, దౌత్య మార్గాల్లో కమ్యూనికేషన్లను కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఆ సమయంలో క్షేత్రస్థాయిలో ప్రశాంతత నెలకొల్పేటట్లు చూడాలని నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. గత చర్చల్లో కూడా దెప్సాంగ్‌, డెమ్‌చోక్‌ వద్ద పరిష్కారం కోసం భారత్‌ ప్రతినిధులు చైనాపై ఒత్తిడి తెచ్చారు.

మరోవైపు సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్లెం వేసేలా భారత సైన్యంలో కీలక మార్పులు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సెంట్రల్‌ కమాండ్‌ అధీనంలో సరికొత్త కోర్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటిని స్వయంసత్తాక దళాల్లా తీర్చిదిద్దేలా శతఘ్ని, వైమానిక, ఇంజినీరింగ్‌ వంటి విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లు సెంట్రల్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. వీటిని 18 కోర్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. దీనిలో ఒక డివిజన్‌ మూడు స్వతంత్ర బ్రిగేడ్లు ఉండనున్నాయి. వీటికి వాస్తవాధీన రేఖ వద్ద కొన్ని ప్రాంతాల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా సెంట్రల్‌ కమాండ్‌ LACలో కొంత భాగాన్ని, నేపాల్‌ సరిహద్దుల బాధ్యతలను చూస్తోంది.

'జవాన్లకు మార్షల్​ ఆర్ట్స్​లో శిక్షణ'
భారత సైన్యం శిక్షణలో భారీగా మార్పులు చేస్తున్నట్లుగా ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. చైనాతో సరిహద్దు కలిగిన వాస్తవాధీనరేఖ ప్రాంతంలోని గల్వాన్‌ లోయలో దాదాపు నాలుగేళ్లక్రితం జరిగిన హింసాత్మక ఘర్షణ నేపథ్యంలో ఇటీవల సైనిక శిక్షణలో మార్పులు చేసినట్లు తెలిసింది. ఆయుధాల్లేకుండా శత్రువును దెబ్బకొట్టే విధంగా తర్ఫీదునిస్తున్నారు. ఆయా సైనిక రెజిమెంట్లలో సైనికులకు రోజువారీ ఫిట్‌నెస్‌ తోపాటు వివిధ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా భాగం చేసిన విషయాన్ని సైనిక వర్గాలు వెల్లడించినట్లు ఆంగ్లపత్రిక ఓ కథనం ప్రచురించింది. పంజాబ్‌ రెజిమెంట్‌ వారికి ఘాతక్‌, గూర్ఖా రెజిమెంట్‌కు కుక్రీ డ్యాన్స్‌, మద్రాస్‌ రెజిమెంట్‌కు కలిరిపయట్టు వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌ రెజిమెంట్‌కు చెందిన సైనికులను అరుణాచల్‌ప్రదేశ్‌లోని కిబితు ప్రాంతంలో మోహరించారు. పూర్తి వార్తను చదివేందుకు ఈలింక్​ పై క్లిక్ చేయండి.

'సవాళ్లను అధిగమించాం.. భవిష్యత్ యుద్ధాలకు భారత ఆర్మీ సంసిద్ధం'

దెబ్బకు ఠా.. చైనా ముఠా.. డ్రాగన్​కు చుక్కలు చూపించిన భారత్​..

ABOUT THE AUTHOR

...view details