Chennai Air Show 2024 :92వ వాయుసేన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చెన్నైలో నిర్వహించిన వైమానిక విన్యాసాలు సందర్శకుల మనసుదోచాయి. సామర్థ్యం, శక్తి, స్వావలంబన థీమ్‌తో ఈ విన్యాసాలు నిర్వహించారు. భారత వైమానిక దళం గరుడ్ కమాండోలు విన్యాసాలు నిర్వహించారు. వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్‌దీప్‌సింగ్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మంత్రులు, చెన్నై మేయర్ ప్రియ తదితరులు ఈ విన్యాసాలను తిలకించారు. వైమానిక ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన సందర్శకులతో మెరినా బీచ్ కిక్కిరిసిపోయింది. భానుడి భగభగలను కూడా లెక్కచేయకుండా గొడుగులు పట్టుకొని వాయుసేన పరాక్రమాన్ని కనురెప్ప వాల్చకుండా చూశారు. 21 ఏళ్ల తర్వాత చెన్నైలో వైమానిక విన్యాసాలు జరిగడం విశేషం.
సాహసోపేత నైపుణ్యంతో ప్రదర్శన!
వాయుసేనకు చెందిన స్పెషల్ గరుడ్ ఫోర్స్ కమెండోల పరాక్రమంతో వైమానిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. బందీలను విడిపించటంలో వారు తమ సాహసోపేత నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పారాజంప్ ఇన్‌స్ట్రక్టర్లు నిర్దేశిత ప్రదేశంలో ల్యాండయ్యారు. లక్షిత ప్రాంతాన్ని చేరుకోవడానికి కమాండోలు దూసుకెళ్లిన తీరు. సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.