తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పది నిమిషాల్లో పసందైన సొరకాయ పచ్చడి - పచ్చి మిర్చితో నెవ్వర్​ బిఫోర్ టేస్ట్! - how to prepare sorakaya pachadi - HOW TO PREPARE SORAKAYA PACHADI

Sorakaya Pachadi Making Process : రోటి పచ్చళ్లు అంటే ఇష్టపడి అంటే.. నాక్కూడా అంటూ ప్లేట్​ పట్టుకొస్తారు చాలా మంది. అలాంటి వారికి అద్దిరిపోయే సొరకాయ-పచ్చి మిర్చి చట్నీ పట్టుకొచ్చాం. మరి.. దాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా..

Sorakaya Pachadi Making Process
Sorakaya Pachadi Making Process (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 3:19 PM IST

Bottle Gourd Chutney Making Process :సొరకాయ - పచ్చిమిర్చితో తయారు చేసే ఈ సూపర్ టేస్టీ పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? వేడి వేడి అన్నంలో ఈ రోటి పచ్చడి కలుపుకొని తిన్నారంటే.. వావ్ అనాల్సిందే! ఇది కేవలం అన్నంలోనే కాకుండా.. ఇడ్లీ, చపాతీల్లోనూ అద్భుతంగా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం? దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం.

తెలుగువారు.. ప్లస్ పచ్చడి. ఇది డెడ్లీ కాంబినేషన్! భోజనంలో ఎన్ని రకాల కూరలు ఉన్నాసరే.. మనవాళ్ల కళ్లన్నీ సైడ్​ డిష్​గా ఏమేం పచ్చళ్లు ఉన్నాయనే వెతుకుతుంటాయి. అందుకేనేమో తెలుగువారిని పచ్చళ్ల ప్రియులు అంటారు. ఇలాంటి వారికోసమే అద్దిరిపోయే సొరకాయ-పచ్చి మిర్చి రెసిపీ తీసుకొచ్చాం. ఈ రోటి పచ్చడిని తిన్నారంటే మైమరిచిపోతారు! మరి అలాంటి టేస్టీ సొరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు...

  • సొరకాయ ముక్కలు - 3 కప్పులు
  • టమాటలు - 2
  • పచ్చిమిర్చీ - 15
  • కొత్తిమీర - ఒక కట్ట
  • చింతపండు - ఉసిరికాయంత
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - 1/4 టేబుల్ స్పూన్

తాలింపు కోసం..

  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • ఆవాలు - 1/2 టేబుల్ స్పూన్లు
  • జీలకర్ర - 1/2 టేబుల్ స్పూన్లు
  • మినపప్పు - 1/2 టేబుల్ స్పూన్లు
  • పచ్చిశెనగపప్పు - 1/2 టేబుల్ స్పూన్లు
  • ఇంగువ - 2 చిటికెళ్లంత
  • కరివేపాకు - 1 రెమ్మ
  • ఎండుమిరపకాయ - 1 (ముక్కలు చేసుకోవాలి)

తయారీ విధానం..

  • ముందుగా సొరకాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. చెక్కు తీయాలా? గింజలు ఉంచాలా.. పడేయాలా? అన్నది మీ ఇష్టం.
  • ఇప్పుడు పాన్ లో నూనె పోసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత సొరకాయ ముక్కలు వేయాలి.
  • తర్వాత పచ్చిమిర్చి వేసి మూతపెట్టుకోవాలి.
  • నాలుగైదు నిమిషాలు వేయించాలి. ఈ లోగా.. సొరకాయ ముక్కలు మెత్తగా మగ్గుతాయి.
  • ఇప్పుడు.. టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి.
  • టమాటా మగ్గిన తర్వాత అందులోనే కొత్తిమీర, చింతపడు వేసి మరో నిమిషంపాటు వేగనివ్వాలి.
  • ఆ తర్వాత స్టౌవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
  • అనంతరం ఈ మిశ్రమాన్ని రోటిలో వేసుకొని పచ్చడిలా నూరుకోవాలి. ఇంట్లో రోలు లేనివారు మిక్సీలో వేసుకోండి.

తాళింపు..

  • పచ్చడి నూరుకున్న తర్వాత తాళింపు చేయాలి.
  • దీనికోసం కడాయిలో ఆయిల్ వేసి వేడి చేయాలి.
  • ఆ తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశెనగపప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసి కాసేపు వేగనియ్యాలి.
  • ఈ తాలింపు ఎర్రగా వేగాక పచ్చడిని ఇందులో కలిపేస్తే సరిపోతుంది.
  • అద్దిరిపోయే కొరకాయ పచ్చడి సిద్ధమైపోతుంది.
  • ఈ సొరకాయ పచ్చడిని తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో పెడితే సుమారు 5రోజుల పాటు నిల్వ ఉంటుంది.
  • మామూలుగా గదిలో ఉంచితే.. ఎండాకాలంలో ఒకరోజు, చలికాలంలో రెండు రోజులు నిల్వ ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

మీరు ఎప్పుడూ తినని "కోడిగుడ్డు చట్నీ" - మీ నోటికి ఎన్నడూ తగలని టేస్ట్! - ఈజీగా ఇలా ప్రిపేర్ చేయండి

అదుర్స్ అనిపించే "హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ" - రుచికే కాదు ఆరోగ్యానికీ ఈ పచ్చడి మంచిదే!

ABOUT THE AUTHOR

...view details