తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జొన్న రొట్టెలు చేయడం రావట్లేదా? - ఈ సీక్రెట్‌ టిప్స్‌ పాటిస్తూ చేస్తే చపాతీ కంటే సూపర్​ సాఫ్ట్​! - How to Make Soft Jowar Roti - HOW TO MAKE SOFT JOWAR ROTI

Tips to Make Soft Jowar Roti : చాలా మందికి చపాతీలు చేసినంత పర్ఫెక్ట్​గా జొన్న రొట్టెలు చేయడం రాదు. ఒకవేళ చేసినా కొద్దిసేపటికే గట్టిగా మారి.. విరిగిపోతుంటాయి. అయితే, జొన్న రొట్టెలు మృదువుగా, పొంగుతూ రావాలంటే కొన్ని టిప్స్‌ తప్పకుండా పాటించాలి. అవేంటో చూద్దాం పదండి..

Soft Jowar Roti
Tips to Make Soft Jowar Roti (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 5:00 PM IST

Updated : Jul 8, 2024, 5:21 PM IST

How to Make Soft Jowar Roti : ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యానికి మంచిదని జొన్న రొట్టెలు తింటున్నారు. అయితే, ఎక్కువ మందికి గోధుమ పిండితో చపాతీలు చేయడం వచ్చు కానీ.. జొన్న పిండితో చేయడం రాదు. ఒకవేళ చేసినా అవి చపాతీలంత పర్ఫెక్ట్​గా రావు. చేసిన కొద్దిసేపటికే గట్టి పడి విరిగిపోతున్నాయి బాధపడుతుంటారు. అలాంటి సమయంలో ఈ టిప్స్​ పాటిస్తూ జొన్న రొట్టెలనుచేయడం వల్ల గంటల తరబడి అవి ఎంతో సాఫ్ట్‌గా ఉంటాయి. మరి ఆ టిప్స్​ ఏంటో చూసి.. మీరూ ట్రై చేయండి మరి..

జొన్న రొట్టె రెడీ చేయడానికి కావాల్సిన పదార్థాలు :

  • జొన్నపిండి- 1 కప్పు
  • వేడినీరు- కప్పు
  • ఉప్పు- రుచికి సరిపడా

జొన్న రొట్టెలు తయారు చేయు విధానం:

  • ముందుగా స్టవ్​ ఆన్​ చేసి గిన్నె పెట్టి అందులో ఓ కప్పు నీళ్లను పోసి మరిగించుకోండి. ఇందులో మీకు నచ్చితే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు.
  • నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు కప్పు జొన్న పిండి వేసుకోని కలుపుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పిండిని ఏ కప్పు కొలతతో తీసుకున్నామో.. అదే కొలతతో నీళ్లను తీసుకోవాలి. ఒక చెంచా పిండి ఎక్కువ వేసుకున్నా ఏం కాదు..
  • ఇప్పుడు పిండిని బాగా కలుపుకుని.. మూత పెట్టుకుని వదిలేయండి. ఇలా చేయడం వల్ల పిండి ఆ వేడికి మగ్గుతుంది.
  • తర్వాత పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే.. చేతులు తడి చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా వేడి మీద పిండిని కలుపుకోవడం వల్ల రొట్టెలు సాఫ్ట్‌గా వస్తాయి.
  • జొన్న పిండిలో జిగురు ఉండదు. మీరు ఎంత సేపు పిండి కలుపుకుంటే అంత జిగురు ఏర్పడుతుంది. కాబట్టి, కనీసం 5 నిమిషాలు పిండిని వత్తుకోండి. ఇలా చేయడం వల్ల రొట్టెలు విరగకుండా.. మెత్తగా వస్తాయి.
  • ఇప్పుడు జొన్న పిండిని ముద్దలుగా చేసుకుని, కొద్దిగా జొన్న పిండి చల్లుకుంటూ.. ఎక్కువ ఒత్తిడి చేయకుండా రొట్టెలను ఒత్తుకోవాలి. ఈ పిండిని చపాతీల లాగా గట్టిగా వత్తితే విరిగిపోతాయి.
  • తర్వాత వేడివేడి పెనం మీద జొన్న రొట్టెను వేసి అర నిమిషం పాటు వదిలేయండి. ఆ తర్వాత కొన్ని నీళ్లను చల్లి రొట్టెపై తడి చేయండి. మళ్లీ ఒక అర నిమిషం అయిన తర్వాత రొట్టెను ఫ్లిప్‌ చేసి నిదానంగా రెండు వైపులా కాల్చుకోవాలి.
  • జొన్న రొట్టెలు కాలడానికి కొంత టైమ్‌ పడుతుంది. త్వరగా కాల్చితే.. రంగు వస్తాయి కానీ, లోపల పిండి ఉడకదు. కాబట్టి, నెమ్మదిగా కాల్చుకోవాలి. ఈ రొట్టెలు సరిగ్గా కాలితే పొంగు వస్తాయి. అంతే వీటిని వేడివేడిగా హాట్‌ బాక్స్‌లో పెట్టుకుంటే సరిపోతుంది.
  • ఇలా చేస్తే ఎంత సేపైనా కూడా రొట్టెలు ఎంతో సాఫ్ట్‌గా ఉంటాయి.
  • ఈ రొట్టెలు వేడివేడిగా ఏ కర్రీలో తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

5 నిమిషాల్లో అద్దిరిపోయే మిరియాల చారు - సీజనల్​ జ్వరాలకు సూపర్ రెమిడీ!

జొన్న రొట్టెలు తినడం వల్ల కలిగే లాభాలు :

  • బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినడం వల్ల వెయిట్‌లాస్‌ అయ్యే అవకాశం ఉంటుంది.
  • ఎనీమియాతో బాధపడేవారు జొన్న ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  • జొన్నల్లో ఉండే విటమిన్‌ బి, బి3లు మనకు బలాన్నిస్తాయి.
  • మధుమేహంతో బాధపడేవారికి జొన్న రొట్టెలు ఎంతో మేలు చేస్తాయి.
  • రోజూ జొన్న రొట్టెలు తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
  • అలాగే జొన్నలు జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, మలబద్ధకం సమస్య తగ్గేలా సహాయం చేస్తాయని నిపుణులంటున్నారు.

సాయంత్రం వేళ - కరకరలాడే "చైనీస్ భేల్ పూరి" - నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు! పైగా టేస్ట్​ సూపర్​! -

రెస్టారెంట్ స్టైల్​లో క్రిస్పీ కార్న్ - నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!

Last Updated : Jul 8, 2024, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details