తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంట్లో కూరగాయలు లేవా? - కేవలం ఉల్లిపాయతో అద్దిరిపోయే చట్నీ- ఇలా చేసుకోండి! - How to Make onion chutney in Telugu - HOW TO MAKE ONION CHUTNEY IN TELUGU

How to Make Onion Chutney in Telugu : పంచభక్ష పరమాన్నాలు పెట్టినా సరే, చివరగా ఆవకాయ పచ్చడి కోసం వెతికేవాళ్లు తెలుగువాళ్లు అనే సామెత వినే ఉంటారు. ఊరగాయ పచ్చడి నుంచి రోటి పచ్చడి దాకా మనోళ్లు ఇచ్చే ఇంపార్టెన్స్ అలాంటింది మరి! అందుకే.. ఇంట్లో ఈజీగా దొరికే ఉల్లిపాయతో ఒక సూపర్ చట్నీ ఎలా తయరు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Onion Chutney Making Process
How to Make Onion Chutney in Telugu (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 8:34 AM IST

Onion Chutney Making Process :ఒక్కోసారి ఇంట్లో కూరగాయలు ఏమీ ఉండవు. మార్కెట్​కు వెళ్లే తెచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఇలాంటప్పుడు వంట ఎలా చేయాలబ్బా అని మదనపడుతుంటారు. అయితే.. టైమ్​లో కూడా.. ఎలాంటి టెన్షనూ పడకుండా.. అద్దిరిపోయే రోటి పచ్చడి తయారు చేసుకోవచ్చు. దీనికి ఉల్లిపాయ ఉంటే సరిపోతుంది! మరి.. ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తమిళనాడులోని ప్రతి టిఫిన్ బండ్లపై ఈ ఉల్లిపాయ చట్నీ ఎక్కువగా తయారు చేస్తుంటారు. మన దగ్గర కూడా ఉల్లిపాయ పచ్చడి చేసినప్పటికీ.. ఈ రెసిపీ పూర్తిగా డిఫరెంట్ స్టైల్ లో ఉంటుంది. ఈ పచ్చడి నాలుగు రోజుల వరకూ నిల్వ ఉంటుంది. అన్నంతోపాటు ఇడ్లీ, వడ, గారె, పూరీ ఇలా ఏ టిఫిన్ లోకైనా సూపర్ గా ఉంటుంది. మరీ సూపర్ టేస్ట్ తో అదిరిపోయే ఈ ఉల్లిపాయ చట్నీని ఎలా చేసుకోవాలంటే...

కావాల్సిన పదార్థాలు..

8 -10 నానబెట్టిన ఎండు మిర్చి

పెద్ద ఉల్లిపాయ

చిన్న ఉసిరికాయంత చింతపండు

నిమ్మకాయ సైజు బెల్లం

రాళ్ల ఉప్పు

తాళింపు కోసం..

3 స్పూన్ల నూనె

అర స్పూన్ ఆవాలు

ఒక స్పూన్ మినపప్పు

రెండు ఎండు మిర్చి

చిటికెడు ఇంగువ

ఒక రెబ్బ కరివేపాకు

తయారీ విధానం..

  • ముందుగా నానబెట్టిన ఎండు మిరపకాయలు రోటిలో వేసుకోవాలి.
  • ఉల్లిపాయను ముక్కలుగా చేసుకుని ఇందులోనే వేయాలి.
  • చింతపండు, బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల ఘాటు, కారం, పులుపు అన్నింటినీ సమంగా చేస్తుంది. అయితే.. నచ్చనివాళ్లు బెల్లం వేసుకోకపోయినా ఫర్వాలేదు.
  • రుచికి సరిపడా రాళ్ల ఉప్పు వేసి నూరుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుతూ మెత్తగా నూరుకోవాలి.
  • తర్వాత స్టౌపైన కడాయి పెట్టి, 3 స్పూన్ల అయిల్ వేసి వేడి చేసుకోండి.
  • ఇందులో అర టీ స్పూన్ ఆవాలు వేసుకోండి.
  • ఆవాలు వేగాక ఒక టీ స్పూన్ మినపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి. తాళింపు ఎర్రగా వేపితే తినే సమయంలో కరకరలాడుతూ మంచి టేస్ట్ వస్తుంది.
  • ఇందులోనే రెండు ఎండు మిర్చి, ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి.
  • మీ ఇష్టాన్ని బట్టి చిటికెడు ఇంగువ వేసుకోండి.
  • ఇప్పుడు.. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్టు ఇందులో వేసుకొని, మీడియం ఫ్లేమ్​లో రెండు నిమిషాలపాటు కుక్ చేయడం. మధ్య మధ్యలో మెల్లగా కలపండి.
  • నూనె పైకి తేలిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేయండి. అదిరిపోయే ఉల్లిపాయ చట్నీ మీ కళ్ల ముందు ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

నూనె లేదు, పొయ్యితో పనేలేదు! - ఆహా అనిపించే "పొలం పచ్చడి" ఐదు నిమిషాల్లో - జిందగీలో తిని ఉండరు!

పది నిమిషాల్లో పసందైన సొరకాయ పచ్చడి - పచ్చి మిర్చితో నెవ్వర్​ బిఫోర్ టేస్ట్!

ABOUT THE AUTHOR

...view details