తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మఖానా ఖీర్ - టేస్ట్‌ అదుర్స్‌ అంతే!! - Makhana Kheer

How To Make Makhana Kheer Recipe : పాయసం అనగానే చాలా మంది సేమ్యా, సగ్గబియ్యంతోనే చేస్తారని అనుకుంటారు. కానీ.. మఖానాతో ఎప్పుడైనా ఖీర్ తయారు చేశారా? టేస్ట్ అద్దిరిపోద్దంటే నమ్మాల్సిందే! మరి, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

How To Make Makhana Kheer Recipe
How To Make Makhana Kheer Recipe

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 1:53 PM IST

Updated : Feb 9, 2024, 2:03 PM IST

How To Make Makhana Kheer Recipe : మనలో చాలా మంది పాయసాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. పండగల సమయంలో ఏదైనా స్వీట్‌ వంటకం తయారు చేయాలనుకుంటే చాలా మంది పాయసం చేస్తారు. అయితే.. ఇందుకోసం సేమ్యా, సగ్గుబియ్యం ఉపయోగిస్తారు. కానీ.. మరో ఐటమ్​తో కూడా పాయసం చేయొచ్చని మీకు తెలుసా? అదే.. మఖానా! దీంతో.. పాయసం చేస్తే.. ఇంట్లోని వారందరూ ఫిదా అవ్వాల్సిందే. ఎంతో రుచికరంగా ఉండటంతోపాటు, ఆరోగ్యానికి కూడా మేలు చేసే మఖానా కీర్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మఖానా పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

  • మిల్క్‌- రెండు కప్పులు
  • యాలకుల పొడి 1/2 టీస్పూన్‌
  • జీడిపప్పులు -10
  • బాదం పప్పులు -10
  • ఎండుద్రాక్షలు- చెంచాన్నర
  • పంచదార- నాలుగు చెంచాలు
  • కుంకుమపువ్వు- చిటికెడు
  • నెయ్యి- మూడు చెంచాలు
  • ఫూల్‌ మఖానా- కప్పు

మఖానా పాయసం ఎలా తయారు చేయాలి ?

  • ముందుగా పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి అందులోజీడిపప్పులు, బాదం పప్పులు, ఎండుద్రాక్షలు తక్కువమంట మీద వేయించుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అదే పాత్రలో కప్పు మఖానా వేసుకొని సన్నటి మంటపై వేయించి, మరో పాత్రలోకి తీసుకోవాలి.
  • తర్వాత ఒక పాత్రలో పాలని వేసి.. అడుగంటకుండా గరిటెతో కలుపుతూ పాలు కాస్త దగ్గరగా వచ్చేంతవరకూ కాచాలి.
  • ఆ తర్వాత పాలలోకి సరిపడినంత చక్కెర వేసుకుని మళ్లీ కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఫ్రై చేసుకున్న మఖానాను పాలలో వేసి కలుపుకోవాలి.
  • తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ను పాలలో వేసి లో ఫ్లేమ్‌లో గరిటెతో కలపాలి.
  • ఇప్పుడు పాయసంలో కుంకుమ పువ్వు, యాలకుల పొడిని కలపుకోవాలి.
  • అంతే ఎంతో సింపుల్‌గా రెడీ అయ్యే మఖానా కీర్‌ రెడీ.
  • దీనిని వేడి వేడిగా గానీ లేదా చల్లగా అయినా తర్వాత సర్వ్‌ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది.

మఖానాలో ఉండే పోషకాలు..

  • మఖానాలో ప్రొటీన్లు, ఫైబర్‌తోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి.
  • వీటిని తినడం వల్ల రక్తహీనత, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
  • వీటిలో ఉండే క్యాల్షియం, ఐరన్ వంటి గుణాలు గర్భిణులకు మేలు చేస్తాయి. వారిలో రక్తహీనత సమస్య రాకుండా కాపాడతాయి.
  • మఖానాలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్‌, డయాబెటిస్‌, ఆర్థ్రైటిస్‌.. తదితర సమస్యలు రాకుండా కాపాడతాయి.

కోడి గుడ్డుతో 10 వెరైటీ రెసిపీస్ - మీరు ఎప్పుడూ టేస్ట్ చేయని రకాలు!

కార్తికమాసం స్పెషల్​ - ఉసిరి-గోధుమరవ్వ పులిహోరతో స్వామివారికి నైవేద్యం పెట్టండి!

Egg Recipes Telugu : సండే స్పెషల్.. కాస్త వెరైటీగా ఈ 'గుడ్డు' స్నాక్స్ ట్రై చేయండి.. వెరీగుడ్ అనక మానరు

Last Updated : Feb 9, 2024, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details