తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వడలు చేయాలంటే పప్పు నానబెట్టాల్సిన పనే లేదు! ఈ పొడి ఉంటే చాలు నిమిషాల్లో రెడీ! పైగా హోటల్​ రుచి​ పక్కా! - how to make instant vada recipe

How To Prepare Vada in Telugu: గుండ్రంగా ఉండి.. అద్దిరిపోయే టేస్ట్​తో లభించే​ వడలు తినాలని చాలా మందికి ఉంటుంది. కానీ వాటిని ఇంట్లో చేయాలంటే అమ్మో అంటారు. అలాగని రోజూ హోటల్​కి వెళ్లలేరు. దీంతో తినాలనే కోరికను పక్కకు పెట్టేస్తారు. అయితే ఇకపై అలా చేయాల్సిన అవసరం లేదు. వడలు చేయాలంటే పిండి నానబెట్టి రుబ్బాల్సిన అవసరమే లేదు. ఈ పొడి మీ ఇంట్లో ఉంటే నిమిషాల్లో వడలు రెడీ..

How To Prepare Vada In Telugu
How To Prepare Instant Vada at Home (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 6, 2024, 5:02 PM IST

How To Prepare Instant Vada in Telugu:వడ.. చాలా మంది తినే బ్రేక్​ఫాస్ట్​. ఇవి ఎంత టేస్టీగా ఉంటాయో మనందరకీ తెలిసిందే.కానీ,వడలను అప్పటికప్పుడు రెడీ చేయడం అస్సలు వీలుకాదు. ముందుగా పప్పును నానబెట్టాలి.. ఆ తర్వాత రుబ్బాలి. ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇదేమి లేకుండా కేవలం ఈ పొడి మీ ఇంట్లో ఉంటే.. ఎప్పుడు కావాలంటే అప్పుడే వడలు చేసుకోవచ్చు. ఏంటి నమ్మడం లేదా? మీరు విన్నది నిజమే. ఈ పొడితో వడలు నిమిషాల్లో రెడీ అవుతాయి. అంతేకాదు.. ఇవి పప్పు నానబెట్టి చేసినట్లుగానే చాలా సాఫ్ట్​గా, ఫ్లఫ్పీగా వస్తాయి. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. బయట నుంచి క్రిస్పీగా.. లోపల సాఫ్ట్​గా భలే టేస్టీగా వస్తాయి. తొందరగానే ప్రిపేర్​ అవుతాయి కాబట్టి.. బ్రేక్​ఫాస్ట్​ ఏం చేయాలి అనే టెన్షన్​ అక్కర్లేదు. మరి ఈ పొడి ఎలా రెడీ చేసుకోవాలి? ఈ పొడితో వడలు ఎలా వేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం..

ఇన్​స్టాంట్​ వడలు తయారు చేయడానికి పొడి ప్రిపేర్​ చేసే విధానం:

కావాల్సిన పదార్థాలు

  • మినపప్పు - కొద్దిగా

పొడి తయారీ విధానం:

  • ముందుగా మినపప్పు తీసుకోవాలి. ఎంతైనా తీసుకోవచ్చు. మీరు ముందుగా ట్రై చేయాలనుకుంటే కొద్దిమొత్తంలో తీసుకోవడం మంచిది.
  • ఇప్పుడు ఆ మినపప్పును శుభ్రంగా కడిగి ఓ కాటన్​ క్లాత్​ మీద పరిచి మూడు గంటలు ఆరబెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి ఆరిన మినపప్పు వేసి ఓ 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోని పక్కకు పెట్టుకోవాలి.
  • మినపప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్​ లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుంటే మూడు నెలల పాటు తాజాగా ఉంటుంది.

ఇన్​స్టంట్​ పొడితో వడలు:

కావాల్సిన పదార్థాలు:

  • మినపప్పు పొడి - తగినంత
  • పచ్చిమిర్చి - 4
  • ఉల్లిపాయలు - 1
  • కరివేపాకు - ఒక రెబ్బ
  • ఉప్పు - సరిపడా
  • వంట సోడా - కొద్దిగా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • నూనె - వేయించడానికి సరిపడా

వడలు ప్రిపేర్​ చేసుకునే విధానం:

  • ముందుగా కావాల్సిన పరిమాణంలో మినపప్పు పొడిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా వడలు వేసుకునేందుకు సరిపడే విధంగా పిండి కలుపుకోవాలి.
  • అలా కలుపుకున్న తర్వాత ఓ అరగంట సేపు పక్కకు పెట్టాలి.
  • ఆ తర్వాత మళ్లీ ఒకసారి కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉంటే కొన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి.
  • ఆ తర్వాత ఈ పిండిలో సోడా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ ఫ్రై కి సరిపడా నూనె పోయాలి.
  • నూనె బాగా వేడెక్కిన తర్వాత.. చేతిని కాస్త తడి చేసుకుంటూ పిండిని చేతిలోకి తీసుకుని మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేయండి.
  • మీడియం ఫ్లేమ్​లో గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేవరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్​స్టంట్​ వడలు రెడీ! నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.

నిమిషాల్లో ప్రిపేర్​ అయ్యే 'పెసరపప్పు చారు'- ఇలా చేస్తే టేస్ట్​ నెక్ట్స్​ లెవల్​ అంతే! - Pesarapappu Charu Recipe

"అమృత్​ సరి" చికెన్ రెసిపీ - ఈ పంజాబీ స్టైల్​ ​కర్రీ తిన్నారంటే "భల్లే భల్లే" అనాల్సిందే! - Amritsar Chicken Masala

ABOUT THE AUTHOR

...view details