How to Make Rice Kheer Pudding : ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులు రోజా పేరుతో రోజంతా ఆకలి దప్పికలను అదుపులో ఉంచుకుంటూ కఠోర ఉపవాసం చేస్తారు. సాయంత్రం తర్వాత ఇఫ్తార్ విందుతో దీక్షను విరమిస్తారు. అయితే ఈ సమయంలో వారు తీసుకునే ఆహార పదార్థాలు పోషకాలు అందించేలా ఉండాలి. కాబట్టి ఈ రంజాన్(Ramadan 2024)మాసంలో మంచి పోషకాలను అందించే రైస్ ఖీర్ పుడ్డింగ్ అనే బెస్ట్ స్వీట్ రెసిపీ తీసుకొచ్చాం. దీనిని ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ రెసిపీని పెద్దలే కాదు చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇంతకీ, ఈ రైస్ ఖీర్ పుడ్డింగ్‌కు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైస్ ఖీర్‌కు కావాల్సిన పదార్థాలు :
- బాస్మతి బియ్యం - 1/2 కప్పు
- పాలు - 1 లీటర్
- చక్కెర- 1/2 కప్పు (రుచికి సరిపడినంత)
- కండెన్స్డ్ మిల్ - పావుకప్పు
- బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు -పావుకప్పు
- యాలకుల పొడి - పావు టీస్పూన్
- కుంకుమపువ్వు - చిటికెడు
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
రంజాన్ మాసంలో కచ్చితంగా టేస్ట్ చేయాల్సిన ఫుడ్స్ ఇవే! - హలీమ్‌తో పాటు నోరూరించేవి ఇంకెన్నో!
తయారీ విధానం :
- ముందుగా తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో సుమారు 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మంటను మీడియంలో ఉంచి ఒక లోతైన పాన్ తీసుకొని అందులో ముందుగా నెయ్యి వేసుకొని కాస్త వేడి చేసుకోవాలి.
- ఆపై వడకట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసి అవి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులో లీటర్ పాలను యాడ్ చేసుకోవాలి. ఆపై గ్యాస్ మంటను మీడియంలోనే ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ అన్నం మెత్తగా, పాలు చిక్కగా మారే వరకు ఉడికించుకోవాలి. ఇందుకోసం 30-40 నిమిషాలు పట్టవచ్చు.
- ఆ మిశ్రమంగా చిక్కగా అయ్యాక అందులో చక్కెర, కండెన్స్‌డ్‌మిల్క్ యాడ్ చేసుకొని గరిటెతో నెమ్మదిగా అది ఖీర్లా మారే వరకు కలుపుకోవాలి. అయితే ఇక్కడ షుగర్ మీ రుచిని బట్టి యాడ్ చేసుకోండి.
- ఆ తర్వాత దానికి యాలకుల పొడి, కుంకుమపువ్వునును యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దాంతో ఖీర్ ఒక ఆహ్లాదకరమైన మంచి సువాసన, రుచిని ఇస్తుంది. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
- ఇక ఖీర్‌ను సర్వింగ్ బౌల్‌కు లేదా వ్యక్తిగత సర్వింగ్ కప్పులలో పోసే ముందు కొద్దిసేపు చల్లారనివ్వండి.
- ఆ తర్వాత రైస్ ఖీర్ పుడ్డింగ్‌ను బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు,గులాబీ రేకులతో గార్నిష్ చేసుకోండి.
- అయితే నట్స్‌ను యాడ్ చేసే ముందు కాస్త నెయ్యిలో కొద్దిసేపు వేయించుకొని ఖీర్‌లో యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది.
- అలా రైస్ ఖీర్ పుడ్డింగ్‌ను గార్నిష్ చేసుకున్నాక కనీసం ఒక గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచి వడ్డిస్తే దాని రుచి మరింత మెరుగుపడుతుందట.
నోరూరించే హైదరాబాదీ హలీమ్ - ఇంటి వద్దే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!