తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాషింగ్ మెషిన్ ఇలా క్లీన్ చేస్తే - ఎక్కువ కాలం పనిచేస్తుంది! - Washing Machine

How to Clean Washing Machine : వాషింగ్ మెషిన్​తో దుస్తులు క్లీన్ చేసుకుంటారు కానీ.. ఆ మెషిన్​ను మాత్రం సరిగా క్లీన్ చేయరు. ఫలితంగా.. కొద్ది రోజులకే మరమ్మతులకు గురవుతుంది! అయితే.. మేము చెప్పే ఈ టిప్స్ పాటిస్తూ వాషింగ్ మెషిన్ క్లీన్ చేసుకున్నారంటే.. ఎక్కువ కాలం పనిచేస్తుంది! ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Washing Machine
Washing Machine

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 12:23 PM IST

How to Clean Washing Machine with Vinegar :ఈ రోజుల్లో ఇంట్లో వాషింగ్ మెషిన్ కామన్. అయితే.. చాలా మంది దాంట్లో బట్టలు వేసి వాష్ చేసుకోవడం తప్ప, అది క్లీన్​గా ఉందో లేదో పెద్దగా పట్టించుకోరు. ఫలితంగా.. అది త్వరగా పాడైపోతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. మీరు వాషింగ్ మెషిన్(Washing Machine) యూజ్ చేస్తున్నట్లయితే ఈ టిప్స్ పాటిస్తూ శుభ్రం చేసుకోండి. మీ మెషిన్ కొత్తదానిలా మెరవడమే కాదు ఎక్కువకాలం మన్నికగా ఉంటుందని చెబుతున్నారు. ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • మీరు ముందుగా వాషింగ్ మెషిన్​లో హాచ్ టెంపరేచర్​ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాషర్​లో 945 ml(అంటే సుమారు 4 కప్పులు) వెనిగర్‌ వేసుకోవాలి.
  • వాషింగ్ మెషిన్​ను డీప్ క్లీన్ చేయాలనుకుంటే దానికి 1 కప్పు బేకింగ్ సోడాను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో బట్టలేవీ వేయకుండా మెషీన్ డోర్ క్లోజ్ చేసి 5 నిమిషాల పాటు రన్ చేయాలి.
  • ఇలా ఐదు నిమిషాలు రన్ చేసిన తర్వాత మెషీన్ ఆఫ్ చేసి గంట పాటు అలా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల లోపల పేరుకున్న మురికి మొత్తం వదులుతుంది.
  • వాటర్ డ్రైన్ అయిన తర్వాత వాషింగ్ మెషిన్ డోర్ ఓపెన్ చేసి శుభ్రమైన గుడ్డతో లోపల డ్రమ్ శుభ్రం చేసుకోవాలి.
  • అదే ఫ్రంట్ డోర్ వాషింగ్ మెషిన్ అయితే.. డోర్ వద్ద ఆగిన వాటర్​ని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత డోర్ ఓపెన్ చేసి కాసేపు అలా వదిలేయాలి. దాంతో లోపల తడిపోయి పొడిగా మారుతుంది.
  • ఇక మెషిన్ బయట భాగాన్ని క్లీన్ చేయడానికి ఒక శుభ్రమైన క్లాత్, సిట్రస్ క్లీనర్ యూజ్ చేయండి. ముందుగా క్లీనర్​తో స్ప్రే చేసి తర్వాత క్లాత్​తో జాగ్రత్తగా తుడవండి. దాంతో మెషీన్ బయట ఉన్న మురికి పోతుంది.

ఫిల్టర్ క్లీనింగ్ : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఫిల్టర్ శుభ్రం చేయడం మర్చిపోతారు. దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. మెషిన్ దిగువ ముందుభాగంలో ఉండే చిన్న తలుపే ఈ పంపు ఫిల్టర్. ఇది వెచ్చని, తేమతో కూడి ఉంటుంది. కనుక, దీనిలో పురుగులు ఎక్కువ జమ అవుతాయి. దీనిని ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంచుతూ లోపలి చెత్త తీసేయాలి. లేదంటే వాటర్ సరిగ్గా పోక లీక్​లకు దారి తీస్తుంది.

డిటర్జెంట్ బాక్స్ : మెషిన్​లో ఉండే డిటర్జెంట్ బాక్స్ కూడా వాషింగ్ పౌడర్, పురుగులతో పేరుకుపోయి మురికిగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. సాధ్యమైతే, మొత్తం బాక్స్​ను బయటకు తీసి, ఒక పాత టూత్ బ్రష్​తో శుభ్రం చేసుకోవాలి.

80 సెకన్లలో దుస్తులుతికే మిషిన్‌.. సర్ఫ్, నీరు అవసరం లేకుండానే..!

మరికొన్ని వాషింగ్ మెషిన్ జాగ్రత్తలు :

  • గోడకు దగ్గరగా వాషింగ్ మెషిన్‌ను పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల మెషిన్ వెనక ఉండే పైపులు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
  • తరచుగా మెషిన్ పైపులు చెక్ చేస్తుండాలి. ఫలితంగా లీకేజీ ఉంటే త్వరగా గుర్తించవచ్చు.
  • వాషింగ్ మెషిన్లకు పౌడర్లు కాకుండా.. లిక్విడ్ డిటర్జెంట్లు వాడటం మంచిది. ఎందుకంటే పౌడర్లు వాడటం వల్ల అవి మెషిన్​లో పేరుకుపోయే అవకాశాలు ఉంటాయి. లిక్విడ్ సాఫ్ట్​గా ఉంటుంది కాబట్టి డ్రమ్​లో ఇరుక్కుపోయి బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉండదు.
  • మెషిన్​లో బట్టలు ఉతికిన తర్వాత కాసేపు డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. దాంతో లోపల తేమ పోయి డ్రైగా అవుతుంది.
  • ఫలితంగా బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుంది. అలాగే బట్టలు ఉతకడం పూర్తి అయిన తర్వాత వాషింగ్ మిషన్‌ను పొడి క్లాత్‌తో శుభ్రం చేయండి.
  • వాషింగ్ మెషిన్ లోపల డ్రమ్‌‌ శుభ్రంగా మెరుస్తూ కనపడినా.. దీనిలో ఉన్న రంధ్రాలలో పురుగులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి నెలలో రెండుసార్లు దీనిని ఖాళీగా ఉంచి వాష్ రన్ చేయటం మంచిది అంటున్నారు నిపుణులు.

నీరు, సర్ఫ్​ అక్కర్లేని వాషింగ్ మెషీన్.. ఎలా పని చేస్తుందంటే?

ABOUT THE AUTHOR

...view details