How Do Ants Breathe :మన చుట్టూ ఉండే ప్రపంచం, మనం రోజు చూసే జీవులు, మనం నిత్య చేసే పనులు ఇలాంటి వాటిలోనే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటి గురించి కాసేపు ఆలోచిస్తే ఔరా అనిపిస్తుంది. కొన్ని విషయాలు మనకు అమితాశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంత చిన్న జీవిలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అనిపిస్తుంది. కొన్ని విషయాలు మనం నమ్మాలంటే కూడా సందేహిస్తాం. కానీ అలాంటి నిక్కచ్చి నిజాలను మనం తప్పక నమ్మాలి.
చీమలకు ఊపిరితిత్తులు ఉండవ్! మరెలా గాలి పీల్చుకుంటాయో తెలుసా? - How Do Ants Breathe - HOW DO ANTS BREATHE
How Do Ants Breathe : ఒక జీవి బతకాలి అంటే గాలి కావాలి. ఆ గాలిని వినియోగించుకొనే శ్వాస వ్యవస్థ కావాలి. అందులో ముఖ్యభాగం ఊపిరితిత్తులు కానీ చీమలకు ఊపిరితిత్తులే ఉండవు మరి అవి ఎలా బతుకుతున్నాయి? ఎలా శ్వాస తీసుకొని జీవితాన్ని సాగిస్తాయో తెలుసా?
Published : Jun 22, 2024, 5:21 PM IST
చీమలకు ఊపరితిత్తులు ఉండవ్
భూమ్మీద చీమలో ఉన్నన్నీ అద్భుతాలు ఏ జీవిలోనూ లేవంటే అతిశయోక్తి కాదేమో. చీమకు శ్రమజీవి అని పేరు కూడా ఉందడోయ్. ఎందుకంటే తనకంటే రెట్టింపు బరువున్న ఆహారాన్ని కూడా చీమలు తేలిగ్గా మోసుకెళ్తాయ్. అంతేనా, క్రమశిక్షణకు కూడా చీమలు పెట్టింది పేరంటారు. అంతేకాక ఒక్కసారి కండ చీమ కుట్టిందంటే ఆ మంట మాములుగా ఉండదు మరి. అయితే చీమలోని మరో అద్భుతం తెలిస్తే మీరు ఔరా అని నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. సాధారణంగా మనిషి శ్వాస తీసుకోవడానికి ఊపిరితిత్తులు ఉంటాయి. దీనిద్వారా మొత్తం శ్వాసక్రియ జరుగుతుంది. మరి చీమలు గాలిని ఎలా పీల్చుకుంటాయ్. ఇదే కదా మరి ఆసక్తికరం అంటే. చీమలకు ఊపిరితిత్తులు, సాధారణ శ్వాసకోశ వ్యవస్థ లేదు.
మరి చీమలు ఎలా ఊపిరి పీల్చుకుంటాయి? వాటి శరీరం చాలా చిన్నది కదా? ఎలా అంటే, చీమలకు శరీరం బయట ఓ ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. చీమలకు శరీరం బయట స్పిరాకిల్స్ (Spiracles) అని పిలిచే పది జతల రంథ్రాల వ్యవస్థ ఉంటుంది. స్పిరాకిల్ అనే పిలిచే ట్యూబ్‌ల వంటి నిర్మాణం చీమలకు ఊపిరితిత్తులలా ఉపయోగపడుతుంది. నోరు తెరిచి ఉంచినప్పుడు ఎలా అయితే కొంతగాలి తనంత తానుగా మన శరీరం లోకి ప్రవేశిస్తుందో అలా గాలి చీమల స్పిరకిల్స్‌లోకి ప్రవేశిస్తుంది, శ్వాసనాళ వ్యవస్థ ద్వారా ప్రయాణిస్తుంది, ఆక్సిజన్‌ను కార్బన్ డయాక్సైడ్‌గా మార్చే కణజాలం దగ్గరకు చేరుకుంటుంది. తరువాత అదే కరంలో కార్బన్ డయాక్సైడ్ శ్వాసనాళ వ్యవస్థ ద్వారా తిరిగి స్పిరకిల్స్ ద్వారా బయటకు వస్తుంది. ఈ స్పిరాకిల్ వల్లే చీమలు నీటి అడుగున కొన్ని నిమిషాల నుండి చాలా రోజుల వరకు కూడా జీవించగలవు.