High Voltage Wire On Train Track :రైల్వే ట్రాక్‌పై హై వోల్టేజ్ వైర్‌ను గమనించిన లోకోపైలట్ రైలును అత్యవసరంగా నిలిపివేశాడు. లోకోపైలట్ అప్రమత్తతతో వేల మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని తుముకూరు జిల్లా కుణిగల్ పట్టణ శివారులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది
వేల మంది ప్రయాణికులతో యశ్వంత్‌పుర్ ఎక్స్‌ప్రెస్ హాసన్‌కు శుక్రవారం ఉదయం బయలుదేరింది. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో కుణిగల్ పట్టణ సమీపంలో రైల్వే ట్రాక్‌పై హై వోల్టేజ్ విద్యుత్ లైన్ పడి ఉంది. దాన్ని గమనించిన లోకోపైలట్ రైలును అత్యవసరంగా నిలిపివేశాడు. దీంతో వేల మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. లోకోపైలట్ సమయస్ఫూర్తిని ప్రయాణికులు అభినందించారు. అనంతరం రైల్వే అధికారులకు సమాచారం అందించారు లోకోపైలట్. ఆ తర్వాత బెంగళూరు నుంచి వచ్చిన రైల్వే టెక్నికల్ సిబ్బంది విద్యుత్ తీగను తీసేశారు. మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో రైలు హాసన్ వైపు బయలుదేరిందని రైల్వే వర్గాలు తెలిపాయి.
మహారాష్ట్ర నాందేడ్‌లో పుర్ణ-పర్లి ప్యాసింజర్ రైలులో గతేడాది డిసెంబర్లో మంటలు చెలరేగాయి. మెయింటెనెన్స్ యార్డ్‌లో నిలిపి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు సంభవించాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. రైలులో మంటలు చెలరేగడం వల్ల సమీపంలోని రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.