తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈషా రెబ్బా బ్యూటీ ఫోజ్​లో 5 తేడాలున్నాయి - 8 సెకన్లలో కనిపెట్టేస్తే మీరు తోపు! - Eesha rebba Optical Illusion Test - EESHA REBBA OPTICAL ILLUSION TEST

Heroine Eesha Rebba Optical Illusion Test : ఇక్కడ మతిపోగొడుతున్న హీరోయిన్ ఈషా రెబ్బా పిక్స్​లో 5 తేడాలున్నాయి. వాటిని కేవలం 8 సెకన్లలో కనిపెట్టాలి. మీకు సాధ్యమవుతుందా? ఓసారి ట్రై చేస్తారా??

Find The Difference Between Two Images
Find The Difference Between Two Images (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 10:54 AM IST

Updated : May 7, 2024, 11:02 AM IST

Find The Difference Between Two Images : ఈషా రెబ్బా.. ఈ అచ్చ తెలుగు అందానికి ఇంట్రో అవసరం లేదు. అద్భుతమైన అందచందాలతోపాటు చక్కటి అభినయంతో ఆకట్టుకునే ఈ బ్యూటీకి.. అదృష్టమే తక్కువైనట్టుగా కనిపిస్తోంది. తనదైన నటనతో అలరించే ఈషాకు.. ఆఫర్లు ఆశించినంతగా రాలేదు. అయినప్పటికీ ఇంకా తనవంతుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

వరంగల్​కు చెందిన ఈ బ్యూటీ ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత సినీ రంగం వైపు అడుగులు వేసింది. లైఫ్​ ఈజ్ బ్యూటీ ఫుల్​ చిత్రంలో చిన్న రోల్ ప్లే చేసిన ఈ అమ్మడు.. "అంతకు ముందు.. ఆ తర్వాత" మూవీతో సక్సెస్ అందుకుంది. అనంతరం పలు చిత్రాలు చేసినప్పటికీ.. అవేవీ ఈషా కెరియర్​కు ఉపయోగపడలేదు. ఎన్టీఆర్ అరవింద సమేత, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించింది. "3 రోజెస్" వంటి వెబ్​ సిరీస్​లలో కూడా నటించింది. అయినప్పటికీ.. ఈషా ఫేట్ మారలేదు.

పూజా హెగ్డే చిత్రంలోని 6 తేడాలు చెప్పగలరా? - మీకిస్తున్న టైమ్​ 8 సెకన్లు మాత్రమే!

తెలుగులో పరిస్థితి ఇలా ఉండడంతో ఇతర ఇండస్ట్రీల వైపు చూస్తోందీ భామ. కోలీవుడ్​లోనూ పలు చిత్రాల్లో నటించింది. అవకాశాల కోసం ప్రయత్నాలు సాగిస్తూనే.. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్​ను నిత్యం అలరిస్తూనే ఉంటోంది బ్యూటీ. ఇన్​స్టా గ్రామ్​లో భారీగా ఫాలోవర్స్ కలిగిన ఈషా రెబ్బా.. ఎలాంటి పిక్ పోస్ట్ చేసినా వెంటనే వైరల్ అయిపోతుంది. గ్లామర్ ఒలికించేందుకు కూడా సిద్ధపడే ఈ బ్యూటీ పోస్టుల కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అందులోని ఒక చిత్రమే ఇది.

డీజే టిల్లు స్క్వేర్ ఫొటోలోని 5 తేడాలు కనిపెట్టగలరా? - మీ టైమ్ 10 సెకన్లే!

ఇవి రెండు ఫొటోలూ సేమ్ టూ సేమ్. కాకపోతే ఈ రెండిటి మధ్య చిన్న తేడాలు 5 ఉన్నాయి. వీటిని మీరు 8 సెకన్లలో కనిపెట్టేయాలి. ఆప్టికల్ ఇల్యూష్, ఫైండ్​ ద డిఫెరెన్స్ వంటి పజిల్స్ సాల్వ్ చేయడం మెదడుకు ఎంతో మంచిదని నిపుణులు చెబుతూనే ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ అందాన్ని, అందులోని తేడాలను కీన్​గా అబ్జర్వ్ చేయండి. ఇన్​ టైమ్​లో కనిపెడితే మీరు సూపర్. కనిపెట్టలేకపోయిన వాళ్లు ప్రాక్టీస్ చేయండి. త్వరగానే అలవాటైపోతుంది. ఆల్ ది బెస్ట్. సమాధానాల కోసం కింది పిక్​ చూడండి

తేడాలు ఇవే (ETV Bharat)

ఈ ఫొటోలోని 5 తేడాలను 10 సెకన్లలో మడత పెట్టేస్తే - మీకు కిర్రాక్​ బ్రెయిన్​ ఉన్నట్టే!

Last Updated : May 7, 2024, 11:02 AM IST

ABOUT THE AUTHOR

...view details