తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు హనుమాన్ జయంతి - మీ బంధువులు, స్నేహితులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శుభాకాంక్షలు ఇలా పంపండి! - Hanuman Jayanti 2024 wishes

Hanuman Jayanti 2024 : ఇవాళే హనుమాన్ జయంతి. ప్రతి ఏటా చైత్రమాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజు జరుపుకునే ఈ పండగ.. ఈ ఏడాది ఏప్రిల్ 23న వచ్చింది. ఈ శుభ సందర్భంగా.. ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు కలగాలని కోరుకుంటూ ఇలా ప్రత్యేకమైన శుభాకాంక్షలు పంపండి!

Hanuman Jayanti Wishes
Hanuman Jayanti 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 22, 2024, 5:00 PM IST

Updated : Apr 23, 2024, 6:07 AM IST

Hanuman Jayanti 2024 Wishes : హిందూ పురాణాల ప్రకారం.. ఏటా చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆ శుభదినం ఏప్రిల్ 23వ తేదీన వచ్చింది. అంటే ఈ రోజే! ఈ పవిత్రమైన రోజు హిందువులు, హనుమాన్ భక్తులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో వాయుపుత్రుడిని పూజిస్తారు. ప్రత్యేక ఉపవాసం ఉంటారు. హనుమాన్(Hanuman) చాలీసా పఠించడంతోపాటు రామనామ జపిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలని కోరుకుంటూ.. మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పండి. అందుకోసం.. 'ఈటీవీ- భారత్' స్పెషల్ విషెస్, కోట్స్ అందిస్తోంది.

Hanuman Jayanthi 2024 Wishes in Telugu :

  • "వాయుపుత్రుడిలా మీరు కూడా మీ రంగంలో వాయు వేగంతో విజయం వైపు దూసుకెళ్లాలని ఆశిస్తూ.. హ్యాపీ హనుమాన్ జయంతి!"
  • "మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా.. వాటన్నింటినీ హనుమంతుడు లంకను దహనం చేసినట్టుగా బూడిద చేయాలని, ఆ శక్తిని మీకు ఆంజనేయుడు ప్రసాదించాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు"
  • "మారుతిలా దృఢనిచ్చయంతో ముందుకు సాగుతూ మీ లక్ష్యాలను సాధించాలని కోరుకుంటూ.. హ్యాపీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!"
  • "ఈ హనుమాన్ జయంతి రోజున.. ఆంజనేయస్వామి అనుగ్రహం లభించి మీరు ప్రత్యేకమైన శక్తిని పొందాలని కోరుకుంటూ.. హ్యాపీ హనుమాన్ జయంతి!"
  • "తన శక్తి యుక్తులతో ఎక్కడుందో కూడా తెలియని సీతమ్మ జాడ కనుగొన్నాడు మారుతి. మీరు కూడా అంతటి శక్తి సామర్థ్యాలతో జీవితాన్ని గెలవాలని కోరుకుంటూ హ్యాపీ హనుమాన్ జయంతి!"
  • "ఈ పవిత్రమైన హనుమాన్ జయంతి రోజున.. మీ కల నెరవేరాలని, కుటుంబం సురక్షితంగా, సంతోషంగా ఉండాలని మనసారా ఆశిస్తూ.. బంధుమిత్రులందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి!"
  • "ఆంజనేయస్వామి అనుగ్రహంతో.. మీరు, మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలని ఆశిస్తూ.. మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!"
  • "శ్రీరాముడి మనసులో హనుమంతుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇదేవిదంగా.. ఆంజనేయుడి హృదయంలో మీకు స్థానం లభించాలని ఆకాంక్షిస్తున్నా - హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!"
  • "ఈ పవిత్రమైన రోజున పవనసుతుడు.. మీ జీవితాన్ని ఆనందంతో నింపాలని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!"

హనుమాన్‌ జయంతి ఎప్పుడు? - ఆ రోజున భక్తులు ఏం చేయాలో తెలుసా? - Hanuman Jayanti 2024

Hanuman Jayanthi 2024 Quotes in Telugu :

"ఎక్కడ రామ నామం స్మరిస్తారో..

ఎక్కడ హనుమంతుడికి చేతులు జోడించి నమస్కరిస్తారో..

అక్కడ అంతా.. రామ రాజ్యమే!

అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు."

"హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది.. రామతత్వం

కష్టంలో కలసి నడవాలన్నది.. సీత తత్వం

కుటుంబ బాధ్యత పంచుకోవాలనేది.. లక్ష్మణతత్వం

నమ్మినవారి కోసం తెగించమంటుంది.. ఆంజనేయ తత్వం

హ్యాపీ హనుమాన్ జయంతి!"

"ఎక్కడైతే రాముడిని కీర్తిస్తారో..

అక్కడ హనుమ అనుగ్రహ ప్రదాతై ఉంటాడు.

హనుమ పేరును ఉచ్చరించిన చోట..

శ్రీసీతారాములు కొలువై ఉంటారు.

అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!"

"హనుమ బలం.. అసమానమైన భక్తి

నిస్వార్థ సేవకు ప్రతీకైన ఆంజనేయుడు

మీకు బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ..

మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ హనుమాన్ జయంతి."

"హనుమాన్ జయంతి సందర్భంగా..

వాయుపుత్రుడిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిద్దాం..

జీవితంలోని ప్రతీ ప్రయత్నంలో విజయం సాధిద్ధాం..

ఆయన ఆశీర్వాదం దక్కాలని కోరుకుందాం..

మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!"

శనివారం ఈ ఒక్క పని చేస్తే చాలు- హనుమంతుడు మీ వెంటే ఉంటాడు!! - reading hanuman chalisa on saturday

Last Updated : Apr 23, 2024, 6:07 AM IST

ABOUT THE AUTHOR

...view details