Fathers Day 2024 Wishes :అమ్మ నవ మోసాలు మోసి జన్మనిస్తే.. బతుకంతా ధారపోసి జీవితాన్నిస్తాడు నాన్న. స్వార్థంలేని ప్రేమతో గుండెలపై ఆడించి.. బతుకు మార్గం చూపే మార్గదర్శి నాన్న. వేలు పట్టి నడిపించిన దగ్గరి నుంచి.. విద్యాబుద్ధులు నేర్పించి, తన బిడ్డల ఎదుగుదలకు అహర్నిశలూ శ్రమించే వ్యక్తి నాన్న. ఆయన త్యాగం, ఓర్పు వెలకట్టలేనివి. రుణం తీర్చలేనిది. అందుకే, మన ఎదుగుదలలో, మన జీవితంలో ఇంతటి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న తండ్రిని గౌరవించండం కోసం ఫాదర్స్ డేను(Fathers Day 2024) జరుపుకుంటున్నాం. ఏటా జూన్ మూడో వారంలో సెలబ్రేట్ చేసుకునే పితృ దినోత్సవం.. ఈ ఏడాది(2024) జూన్ 16 వస్తోంది. మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ ఫాదర్స్ డే రోజున మీ ప్రియమైన తండ్రికి ప్రతిసారిలా కాకుండా ఈసారి సరికొత్తగా విషెస్ తెలియజేయండి. అందుకోసం 'ఈటీవీ-భారత్' ఫాదర్స్ డే స్పెషల్ విషెస్, కోట్స్ అందిస్తోంది.
Fathers Day Wishes in Telugu :
- 'మన జీవితాన్ని గెలిపించేందుకు, తను అలుపెరగకుండా నిరంతరం శ్రమించే నిస్వార్థ జీవి నాన్న'- హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!
- 'ఉరుములా బయటకు గంభీరంగా ఉన్నా.. ఆ వెనక చల్లని వర్షమై కురిపించే ప్రేమనే తండ్రి' - ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్న!
- 'బయటి ప్రపంచాన్ని పరిచయం చేసేది.. నలుగురితో ఎలా మెలగాలో నేర్పేది.. కేవలం ఒక్క నాన్న మాత్రమే' - హ్యాపీ ఫాదర్స్ డే!!
- 'అమ్మ ప్రేమను కళ్లతో చూడగలం.. కానీ, నాన్న ప్రేమను మాత్రం కన్నీళ్లతోనే తెలుసుకోగలం'- నా ప్రియమైన నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు!
- 'భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి నాన్న.. మీరెప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండాలి' - హ్యాపీ ఫాదర్స్ డే నాన్న!!
- 'నీ సంతోషాన్ని త్యజిస్తూ, నిత్యం శ్రమిస్తూ మా కోసం ఎంతో చేస్తున్న నువ్వే.. నా రియల్ హీరో నాన్న' - హ్యాపీ ఫాదర్స్ డే!
- 'స్క్రీన్ మీద ఎందరు హీరోలను చూసి చప్పట్లు కొట్టినా.. మా నిజజీవితంలో రియల్ హీరో మాత్రం నువ్వే నాన్న' - ఐ లవ్యూ డాడీ హ్యాపీ ఫాదర్స్ డే!
- 'సముద్రానికి ఎదురీదుతూ మిమ్మల్ని జీవితంలో విజయ తీరాలకు చేర్చే అసలైన నావికుడు నాన్న' - ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్న!!
- 'నా తండ్రి ప్రేమ కంటే.. గొప్ప ప్రేమ ఎప్పుడు కూడా నాకు దొరకలేదు. అన్ని వేళల్లో నాన్నలో నాపై ప్రేమను చూశాను'- లవ్యూ నాన్న హ్యాపీ ఫాదర్స్ డే!
- 'నాన్న చూపిన బాటలో గెలుపు ఉంటుందో లేదో తెలియదు. కానీ, ఓటమి మాత్రం ఉండదు'- హ్యాపీ ఫాదర్స్ డే!
ఫాదర్స్ డే రోజు.. మీ తండ్రికి ఇవ్వాల్సిన '5' స్పెషల్ 'ఆర్థిక' బహుమతులు ఇవే!
Fathers Day 2024 Special Quotes in Telugu :
"నాన్న మాటల్లో ప్రేమ ఉంటుంది..
కోపంలో బాధ్యత కనిపిస్తుంది..
అణుక్షణం బిడ్డ గురించే అతని ఆలోచనలు." - ప్రియమైన నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు!
"అమ్మది నమ్మకం.. నాన్నది కోపం..
అమ్మ నమ్మకం.. నీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తే..
నాన్న కోపం.. నీలో కసిని పెంచి నిన్ను గెలిపిస్తుంది." - హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్న!!
"విజయం సాధించినప్పుడు పదిమందికి చెప్పుకునే వ్యక్తి..
పరాజయం పొందినప్పుడు భుజాలపై తట్టి..