తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్యోగం వదిలి గాడిద పాలతో వ్యాపారం​ - ఈ యువకుడి సంపాదన తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! - Donkey Farm in Gujarat - DONKEY FARM IN GUJARAT

Donkey Farm: "బాగా చదువుకోకపోతే గాడిదలు కాయాల్సి వస్తుంది’" అంటూ పలు సందర్భాల్లో పెద్దవాళ్లు మందలిస్తుంటారు. అలాంటివారు ఈ వ్యక్తి స్టోరీ వింటే మాత్రం తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే గాడిదల పెంపకంతో అతడు నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నాడు. అతను ఎవరు? అతని స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Donkey Farm
Donkey Farm

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 2:53 PM IST

Updated : Apr 25, 2024, 3:00 PM IST

Gujarat Young Man Dheeren Solanki Success Story: "చదువుకోకపోతే గాడిదలు కాచుకోవడానికి కూడా పనికిరావు" అంటూ పిల్లల్నిపెద్దలు హెచ్చరించడం విన్నాం. కానీ ఆ గాడిదల్ని పెంచుతూ లక్షల్లో ఆదాయం సంపాదించుకోవచ్చని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. ఉపాధి లేక గాడిదల ఫామ్​ను ప్రారంభించిన అతను ప్రస్తుతం నెలకు 2 నుంచి 3 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఎవరతను? అతడి స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

దేశవ్యాప్తంగానూ గాడిదల పెంపకానికి డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. కారణం.. గాడిద పాలల్లో లభించే పోషకాలు. గేదె, ఆవు పాలతో పోలిస్తే ఈ పాలులో పోషకాలు అధికంగా ఉండటంతో వీటిని తాగేవారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది. అందుకే చాలా మంది గాడిదల పెంపకాన్ని ప్రారంభించి లక్షల్లో ఆర్జిస్తున్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తే గుజరాత్​కు చెందిన ధీరేణ్‌ సోలంకీ. ధీరేణ్‌ చాలా కాలం పాటు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్​ అయ్యాడు. ఆశించిన ఫలితం లేక కొన్ని ప్రైవేట్‌ కంపెనీల్లో కూడా పని చేశాడు. అయినా ఆర్థికంగా పెద్దగా సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలోనే కొత్త ఉపాధి మార్గాలు అన్వేషించాడు. దక్షిణ భారత్‌లో గాడిదల పెంపకానికి క్రమంగా ఆదరణ పెరుగుతోందని తెలుసుకున్నాడు. కొంత మందిని కలిసి సమాచారం సేకరించాడు.

20 గాడిదలతో ప్రారంభం..:అలా సేకరించిన సమాచారంతో ఎనిమిది నెలల క్రితం 20 గాడిదలతో సొంత ఊర్లోనే ఫామ్‌ను ప్రారంభించాడు. రూ.22 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. ఇప్పుడు అవి 42 గాడిదలయ్యాయి. వాటి నుంచి వచ్చే పాలను దక్షిణ భారత్‌లోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నాడు. అలా సరఫరా చేస్తూ నెలకు రూ.2-3 లక్షలు సంపాదిస్తున్నానని స్వయంగా ధీరేణ్‌ చెప్పాడు. "తొలినాళ్లలో కాస్త కష్టంగానే అనిపించింది. గుజరాత్‌లో గాడిద పాలకు పెద్దగా గిరాకీ లేదు. దీంతో తొలి ఐదు నెలలు ఆదాయమేమీ రాలేదు. క్రమంగా దక్షిణ భారత్‌లోని కస్టమర్లను సంప్రదించా. అక్కడ డిమాండ్‌ బాగా ఉంది. ఇప్పుడు కర్ణాటక, కేరళకు ఈ పాలను సరఫరా చేస్తున్నాను. బ్యూటీ ప్రొడక్ట్స్​ తయారీ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి" అని సోలంకీ వివరించాడు.

మీ పిల్లలకు గాడిద పాలు తాగిస్తున్నారా? - లేదంటే చాలా కోల్పోతున్నట్టే! - Donkey Milk Good for Health or not

లీటర్‌ రూ.5,000-7,000:ఇక గాడిద పాలు ఒక లీటర్‌ ధర రూ.5వేల నుంచి7 వేల వరకు ఉన్నట్లు సోలంకీ తెలిపారు. పాలు తాజాగా ఉండడం కోసం వాటిని ఫ్రీజర్లలో నిల్వ చేస్తున్నట్లు వివరించారు. అలాగే పాలను పొడిగానూ మార్చి విక్రయిస్తున్నట్లు, ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్లు తీసుకొని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఫామ్​ను నిర్వహించేందుకు ఇప్పటి వరకు రూ..38 లక్షల వరకు ఖర్చు అయ్యిందని.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం తీసుకోలేదన్నారు. కానీ, ఈ రంగంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సోలంకీ సూచించాడు.

ఇవీ లాభాలు:ఇక గాడిద పాల లాభాలు చూస్తే.. ఇన్ఫెక్షన్లూ, కోరింత దగ్గు, వైరల్‌ జ్వరాలు, ఆస్తమాకీ గాడిదపాలను ఔషధంగా వాడుతుంటారు. ఈ పాలల్లో ఎ, బి, బి1, బి12, సి, డి, ఇ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి, ఎసిడిటీలతోపాటు ఎగ్జిమా, సిఫిలిస్‌, స్కేబిస్‌, దురద, తామర... వంటి ఇన్ఫెక్షన్లకి గాడిద పాలు మంచి ఔషధమని చెబుతారు. ఆ పాలతో ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌, షాంపూ, లిప్‌బామ్‌, బాడీవాష్‌... వంటి కాస్మెటిక్స్‌ తయారుచేస్తుంటారు.

సో చూశారుగా.. ఏ పనీ చేయనివాళ్లను "ఏం చేస్తున్నావ్‌... గాడిదల్ని కాస్తున్నావా..." అని ఆ మూగజీవాలను చులకన చేయకండి. ఎందుకంటే అవే ఇప్పుడు రూ.లక్షలు సంపాదించి పెడుతున్నాయి.

గాడిదల ఫామ్‌తో లాభాలే లాభాలు - ఈ అమ్మాయి నెల సంపాదనెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

కంప్యూటర్​ వదిలి గాడిదను పట్టాడు.. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు

Last Updated : Apr 25, 2024, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details