తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్యాటింగ్, బౌలింగ్​లో కాంగ్రెస్ ఎంపీలు బెస్ట్- ఫీల్డింగ్​లో బీజేపీ- 73రన్స్​తో లోక్​సభ స్పీకర్ టీమ్ విన్! - FRIENDLY MATCH OF MPS

రాజ్యసభ ఛైర్మన్ ఎలెవన్ వర్సెస్ లోక్ సభ స్పీకర్ ఎలెవన్ మధ్య ఫ్రైండ్లీ మ్యాచ్- ఈ మ్యాచ్ లో 73 పరుగుల తేడాతో లోక్ సభ టీమ్ విజయం

Friendly Match Of Lok Sabha And Rajya Sabha MPs
Friendly Match Of Lok Sabha And Rajya Sabha MPs (ANI)

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2024, 4:53 PM IST

Friendly Cricket Match Of MPs :టీబీపై అవగాహన కల్పించేందుకు పార్లమెంటేరియన్ల మధ్య జరిగిన ఫ్రైండ్లీ మ్యాచ్ లో రాజ్యసభ ఛైర్మన్ ఎలెవన్ టీమ్​పై లోక్​సభ స్పీకర్ ఎలెవన్ జట్టు 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, లోక్​సభ టీమ్​కు కేంద్ర మంత్రి అనుఠాగ్ ఠాకూర్ కెప్టెన్​గా ఉండగా, రాజ్యసభ జట్టుకు కిరణ్ రిజిజు కెప్టెన్​గా వ్యవహరించారు. దిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఫ్రైండ్లీ మ్యాచ్​లో రాజ్యసభ టీమ్​పై లోక్​సభ జట్టు విజయం సాధించింది.

స్పీకర్ బ్యాటింగ్
ఈ మ్యాచ్​లో 'సూపర్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ దక్కించుకున్నారు. 'సూపర్ సిక్స్' అవార్డు బీజేపీ ఎంపీ సుధాకర్​కు లభించింది. ఈ మ్యాచ్​లో లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా సైతం బ్యాటింగ్ చేశారు. చక్కనైన షాట్లతో ఆకట్టుకున్నారు. ఈ ఫ్రైండ్లీ మ్యాచ్​లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ సహా పలువురు విపక్ష ఎంపీలు సైతం ఆడారు.

'ప్రధాని మోదీ కలను నెరవేరుస్తాం'
భవిష్యత్తులో ఎంపీల బృందం, ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల మధ్య మ్యాచ్​లు నిర్వహిస్తామని లోక్​సభ ఎలెవన్ జట్టు కెప్టెన్, ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. టీబీ రహిత దేశాన్ని తయారు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నామని పేర్కొన్నారు. భారత్​ను టీబీ రహిత దేశంగా మార్చాలనే ప్రధాని మోదీ కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ ఫ్రైండ్లీ మ్యాచ్​లో ఆడిన ఆడగాళ్లందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

"2025 నాటికి భారతదేశాన్ని క్షయ రహితంగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రధాని మోదీ ఇచ్చారు. 2015 నుంచి నేటి వరకు దేశంలో క్షయ సంబంధిత మరణాలలో 38 శాతం తగ్గుదల కనిపించింది. కొత్త కేసులలో 18 శాతం తగ్గుదల కనిపించింది. ఈ తగ్గుదల ప్రపంచవ్యాప్తంగా 8 శాతమే ఉంది. భారత్ అత్యధిక జనాభా గల దేశం. టీబీకి చికిత్స ఉంది. ప్రభుత్వం ఉచితంగా మందులను అందిస్తుంది. అలాగే రూ.1000 ఆర్థిక సాయం చేస్తుంది. "
-- అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ

'టీబీ ఫ్రీ ఇండియా, ఫిట్ ఇండియానే మా లక్ష్యం'
పార్లమెంట్ ఎంపీలు ఫ్రైండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వచ్చారని రాజ్యసభ ఎంపీ, ఆ జట్టు కెప్టెన్ కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. ఫిట్‌ నెస్ మంత్ర, క్రీడల ద్వారా ప్రజలను ఉత్సాహపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. టీబీ ఫ్రీ ఇండియా, ఫిట్ ఇండియానే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రియాంక వ్యాఖ్యలకు కౌంటర్
అలాగే ప్రధాని మోదీపై లోక్​సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలపై సైతం కిరణ్ రిజిజు కౌంటర్ వేశారు. ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలని కోరారు. రాహుల్ గాంధీ వీర్ సావర్కర్​ను విమర్శిస్తున్నారని ఆరోపించారు. కానీ వీర్ సావర్కర్​ను కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మెచ్చుకున్నారని అన్నారు.

'ఆ నిర్ణయం ప్రశంసనీయం'
మంచి లక్ష్యం కోసం పార్లమెంటేరియన్ల మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ప్రశంసనీయమని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తెలిపారు. ఈ మ్యాచ్ ద్వారా టీబీపై అవగాహన దేశంలోని ప్రతి మూలకు చేరుకుంటుందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే రాజకీయ నాయకుల మధ్య శత్రుత్వం తగ్గుందని అన్నారు. క్షయ రహిత భారత్ కోసం ఎంపీలు చేస్తున్న కృషి ప్రత్యేకమైనదని కొనియాడారు.

'క్షయను ఓడించి దేశాన్ని గెలిపించాలి'
క్షయ వ్యాధిపై అవగాహనకు ఈ మ్యాచ్ నిర్వహించారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు. కొంచెం అవగాహనతో రోగులు క్షయను ఓడించవచ్చని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారన్నది ముఖ్యం కాదని, క్షయను ఓడించి దేశాన్ని గెలిపించాలని కోరారు.

'గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినవారికి అభినందనలు '
పార్లమెంటేరియన్లు మధ్య జరిగిన మ్యాచ్​లో ఎంపీలు పాల్గొనడం సంతోషంగా ఉందని తెదేపా నేత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహించినవారికి అభినందనలు తెలియజేశారు. 2025 నాటికి టీబీని ఓడించాలని ప్రధాని చాలా నిబద్ధతతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు టీబీ గురించి మరింత అవగాహన కల్పించడానికి, టీబీ వ్యతిరేక పోరాటంలో వారిని ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ క్రికెట్ మ్యాచ్​ను నిర్వహించామని పేర్కొన్నారు.

'అప్పుడే ప్రధాని మోదీ కలను నెరవేర్చగలుగుతాం'
రాజ్యసభ ఛైర్మన్ ఎలెవన్, లోక్​సభ స్పీకర్ ఎలెవన్ మధ్య జరిగిన మ్యాచ్ జరిగిన గేమ్ చరిత్రాత్మక మ్యాచ్​గా నిలిచిపోతుందని బీజేపీ ఎంపీ రవికిషన్ తెలిపారు. "యువతను మేల్కొల్పాలి. వారిని మాదకద్రవ్యాలు, టీబీ నుంచి విముక్తి చేయాలి. టీబీ గురించి యువతకు అవగాహన కల్పించాలి. అప్పుడే మనం ప్రధాని మోదీ కలలను నెరవేర్చగలుగుతాం" అని అన్నారు.

'చాలా ఆనందంగా ఉంది'
ఎంపీలందరూ ఫ్రైండ్లీ మ్యాచ్​లో కలుసుకోవడం ఆనందంగా ఉందని కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా భారత్ టీబీ రహిత దేశంగా మారాలని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details