NHRC New Chairman : సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 1న అప్పటి N.H.R.C ఛైర్మన్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్ర పదవీ విరమణ చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి ఈ నియామకాన్ని చేపట్టారు. నాటి నుంచి ఇప్పటి వరకూ N.H.R.C సభ్యురాలు విజయభారతి సయానీ తాత్కాలిక ఛైర్మన్‌గా ఆ పదవిలో కొనసాగారు.
NHRC ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి రామసుబ్రమణ్యం నియామకం - NHRC NEW CHAIRMAN
ఎన్‌హెచ్‌ఆర్‌సీ నూతన ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి. రామసుబ్రమణ్యం నియామకం
Published : Dec 23, 2024, 7:20 PM IST
N.H.R.C చేపట్టనున్న జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం న్యాయవిద్యను మద్రాస్ న్యాయ కళాశాలలో పూర్తి చేశారు. మద్రాస్ హైకోర్టులో సుమారు 23 ఏళ్లు ప్రాక్టీస్ చేసిన జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం, అనంతరం మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 జనవరి 1 నుంచి తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా కొనసాగిన ఆయన అదే ఏడాది జూన్ 22న హిమాచల్ ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2023 జూన్ 29న జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం పదవి విరమణ చేశారు.