తెలంగాణ

telangana

గిరిజన యువకుడి అరుదైన ఘనత- అక్కడ నీట్​ క్వాలిఫై అయిన తొలి వ్యక్తిగా రికార్డ్​! - First Bonda Tribe To Crack NEET

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2024, 2:27 PM IST

Updated : Aug 30, 2024, 4:32 PM IST

First Bonda Tribe To Crack NEET : కలలు అందరూ కంటారు. కానీ వాటిని కొందరు మాత్రమే నిజం చేసుకోగలుగుతారు. ఆ కోవకు చెందిన ఓ గిరిజన యువకుడు- సామాజిక, ఆర్థిక అడ్డంకులన్నీ దాటుకుని నీట్​ పరీక్ష క్వాలిఫై అయ్యాడు. తన తెగ నుంచి ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకీ ఆ యువకుడెవరు? అతడి విజయ గాథ ఏంటో చూద్దాం.

First Bonda Tribe To Crack NEET
First Bonda Tribe To Crack NEET (ETV Bharat)

గిరిజన యువకుడి అరుదైన ఘనత- అక్కడ నీట్​ క్వాలిఫై అయిన తొలి వ్యక్తిగా రికార్డ్​! (ETV Bharat)

First Bonda Tribe To Crack NEET :కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఒడిశా మల్కన్​గిరి​ జిల్లాకు చెందిన ఓ గిరిజన యువకుడు. సామాజిక, ఆర్థిక అడ్డంకులన్నీ దాటుకుని వైద్య, విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. స్థానికంగా ఉన్న బోండా గిరిజన తెగలో నీట్​కు​ అర్హత​ సాధించిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.

పైన వీడియోలో కనిపిస్తున్న యువకుడి పేరు మంగళ ముడులి. ముడిలిపాద పంచాయతీలోని బాబ్​దెల్​ అనే మారుమూల గ్రామంలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా రాష్ట్ర ఎస్​సీ, ఎస్​టీ డిపార్ట్​మెంట్​ నిర్వహిస్తున్న SSD ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం SSD సీనియర్​ సెకండరీ హైస్కూల్​లో ఇంటర్​ పూర్తి చేశాడు. అనంతరం ఇటీవల జరిగిన నీట్​ పరీక్షలో ఉత్తీర్ణుడై, బ్రహ్మపురలోని MKCG మెడికల్​ కాలేజీలో ప్రవేశం పొందాడు. తన తెగలో ఇతరులు ఊహించడానికైనా సాహసించలేనిదాన్ని ముడులి సాధించి చూపించాడు.

చదువుకుంటున్న మంగళ ముడులి (ETV Bharat)

గ్రామస్థులు, ఉపాధ్యాయుల అండతో
ఈ గిరిజన యువకుడికి విజయం అంత సులువుగా రాలేదు. కనీస సౌకర్యాలు లేని కొండల ప్రాంతంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాడు. నీట్​కు ప్రిపేర్​ అవుతున్న సమయంలో మొబైల్​ నెట్​వర్క్​ లేక కొండలపైకి వెళ్లి చదువుకున్నాడు. ఈ క్రమంలో గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు ముడిలికి అండగా నిలిచారు. ముఖ్యంగా డాక్టర్​ కావాలన్న ముడులి తపనను స్థానిక ప్రభుత్వ పాఠశాల సైన్స్​ టీచర్​ ఉత్కల్​ కేసరి గుర్తించారు. అతడిని బాలేశ్వర్​లోని నీట్ కోచింగ్​ సెంటర్​లో చేర్పించారు.

మంగళ ముడులి (ETV Bharat)

'నా ప్రజలకు సేవ చేస్తా!'
తన ప్రాంతంలో సరైన వైద్య సౌకర్యాలు లేక వ్యాధుల బారిన వారిని చూశానని, దాంతో బాల్యంలోనే డాక్టర్​ కావాలనుకున్నానని ముడులి తెలిపాడు. తన కలను సాకారం చేసుకోవడానికి తోడ్పడిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇప్పటి నుంచి కష్టపడి చదివి తన కలను సాకారం చేసుకుంటానని ముడులి అన్నాడు. తమ ప్రాంతంలో ఓ వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరిన ముడులి, భవిష్యత్తులో అక్కడే ఉండి తన ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు.

మంగళ ముడులి కుటుంబ సభ్యులు (ETV Bharat)

గిరిజనుడి విజయగాథ.. తినడానికి తిండి లేని స్థాయి నుంచి అమెరికాలో టాప్ సైంటిస్ట్​గా..

సకల సౌకర్యాల 'సైకిల్​ క్యాంపర్​'.. బీటెక్​ విద్యార్థి ఘనత

Last Updated : Aug 30, 2024, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details