Man Cheats Women By Creating Fake Profile in Matrimony : వయసు కనిపించకుండా విగ్గు పెట్టుకొని మ్యాట్రీమోనీ సైట్లలో నిత్య పెళ్లి కొడుకు అవతారమెత్తిన అంకుల్‌పై పది రోజుల క్రితం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు అతగాడి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇతని బారిన పడిన బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు.
నిత్యపెళ్లి కొడుకు మోసాలు : మ్యాట్రిమోనీ సైట్లలో సామాజికవర్గానికి తగ్గట్టుగా ఇంటిపేరు మార్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ప్రొఫైల్ నచ్చి స్పందించిన ఆడపిల్లల తల్లిదండ్రులు పెళ్లిచూపులకు పిలవగానే తనకు పరిచయమున్న కొందరిని బంధువులుగా చెబుతూ రంగంలోకి దింపుతాడు. అమ్మాయి పెళ్లి సరే అన్నట్లు తెలియగానే ఫోన్ నంబర్ తీసుకుని చాటింగ్ ప్రారంభిస్తాడు. అలా వారిని హోటల్, కాఫీ క్లబ్‌కు తీసుకెళ్లి వారి సానుభూతి కోసం ఎత్తులు వేస్తాడు.
ఉద్యోగం పేరిట తండ్రి మోసం! - వేధింపులు భరించలేక పరిశోధక విద్యార్థిని సూసైడ్
నమ్మించి మత్తుమందు కలిపి : ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకున్నారు అనే భరోసాతో వెళ్లిన ఆడపిల్లలను భావోద్వేగానికి గురయ్యేలా కట్టుకథలు చెప్పడంలో నేర్పరి. తానొక భగ్నప్రేమికుడినని, ప్రేమించిన యువతి మోసం చేసిందని, దాన్నుంచి బయటపడేందుకు తనకు తాను శిక్ష వేసుకున్నానంటూ చేతిపై కత్తితో కోసుకున్నట్లు గాయాలు చూపిస్తాడు. ఇదంతా నిజమేననుకుని నమ్మి కరిగిపోయిన యువతులను తనతో ఏకాంతంగా గడిపేందుకు ఒత్తిడి చేస్తాడు. అలా నమ్మి వెళ్లి యువతులకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి నగ్న ఫొటోలు, వీడియోలు తీసినట్లు సమాచారం. మరో యువతిని ఇలాగే విసిగించటంతో తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి నిరాకరించింది.
బెదిరింపులకు దిగి : అమ్మాయిలను ఇలా తనవైపు తిప్పుకుంటూ మరోవైపు పెళ్లి అవసరాలకు డబ్బు కావాలంటూ రూ.20-40 లక్షల వరకు ఆడపిల్లల కుటుంబం నుంచి లాగేస్తాడు. ఇతడి గురించి తెలిసి ఎవరైనా నిలదీస్తే తన వద్ద ఉన్న ఆడపిల్లల నగ్నఫోటోలు, వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్ చేస్తాడు. తన గురించి ఎవరికైనా చెప్తే సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరిస్తాడని ఒక బాధితురాలి బంధువు వివరించాడు. గతంలో ఎంతోమందిని మోసగించిన ఇతడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు గుర్తించిన ఓ కుటుంబం అతడిని హెచ్చరించినట్లు సమాచారం. కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న సొమ్మును కొట్టేసిన నిత్య పెళ్లికొడుకుని ఏమీ చేయలేక, పోయిన డబ్బును రాబట్టుకోలేక మనోవేదన అనుభవిస్తున్నానంటూ ఓ బాధితురాలి తండ్రి కన్నీరు పెట్టుకున్నారు.
విగ్గులు మార్చుతూ అంకుల్ కుర్రోడి వేషం - ఒక్క కుమార్తె ఉన్న కుటుంబాలే టార్గెట్
పక్కింటి కుర్రాడే కదా అని నమ్మితే - రూ.18 లక్షలు కాజేశాడు - ఎలాగంటే?