తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 3:51 PM IST

Updated : Mar 17, 2024, 5:11 PM IST

ETV Bharat / bharat

లాటరీ కింగ్​ నుంచి డీఎంకేకు రూ.509కోట్లు- బీజేపీకి బాండ్ల ద్వారా రూ.6,986కోట్లు

Electoral Bonds Data ECI : ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి మరిన్ని వివరాలను తాజాగా తమ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచింది ఎన్నికల సంఘం. ఈ డేటా ప్రకారం తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీకి లాటరీ కింగ్​ శాంటియాగో మార్టిన్​ నుంచి రూ.509 కోట్లు వచ్చాయి. బీజేపీకి మొత్తంగా రూ.6,986కోట్లు వచ్చాయి.

Electoral Bonds Data ECI
Electoral Bonds Data ECI

Electoral Bonds Data ECI :ఎలక్టోరల్​ బాండ్లపై మరింత డేటాను ఎన్నికల సంఘం ఆదివారం విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రెండో విడత డేటాను తమ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచింది. ఈసీ ఇచ్చిన డేటా ప్రకారం తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ రూ.656 కోట్ల విలువైన ఎలక్టోరల్​ బాండ్లను నగదుగా మార్చుకుంది. ఇందులో రూ.509 కోట్ల ఎలక్టోరల్​ బాండ్లు లాటరీ కింగ్​ శాంటియాగో మార్టిన్​కు చెందిన ఫ్యూచర్​ గేమింగ్​ అండ్ హోటల్ సర్వీసెస్​ సంస్థ నుంచి వచ్చాయి. శాంటియాగో మొత్తంగా రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్​ బాండ్లను కొన్నారు. అందులో 37శాతం డీఎంకేకు వెళ్లాయి. ఇక డీఎంకే పార్టీకి వచ్చిన బాండ్లలో ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ సంస్థ మెగా ఇంజినీరింగ్ నుంచి రూ.105 కోట్లు, ఇండియా సిమెంట్స్ రూ.14 కోట్లు, సన్​ టీవీ రూ.100 నుంచి కోట్ల బాండ్లు ఉన్నాయి.

ఎలక్టోరల్ బాండ్లను బీజేపీ అత్యధికంగా సమకూర్చుకుంది. బీజేపీ మొత్తం రూ.6,986.5 కోట్లు విలువైన ఎలక్టోరల్​ బాండ్లను నగదుగా మార్చుకుంది. అందులో అత్యధికంగా రూ.2,555 కోట్లు 2019-20 మధ్య వచ్చాయి. తృణమూల్​ కాంగ్రెస్ ఎలక్టోరల్​ బాండ్ల ద్వారా రూ.1,397 కోట్లు పొందింది. కాంగ్రెస్​ రూ.1,334.35 కోట్లు విలువైన ఎలక్టోరల్​ బాండ్లను నగదుగా మార్చుకుంది. బీఆర్​ఎస్​ రూ.1,322 కోట్ల విలువైన ఎలక్టోరల్​ బాండ్లను నగదుగా మార్చుకుంది. దీంతో ఈ బాండ్ల ద్వారా అత్యధికంగా విరాళాలు సేకరించిన నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

ఏ పార్టీకి ఎంతంటే?

  • బీజేడీ ఎలక్టోరల్​ బాండ్ల ద్వారా రూ.944 కోట్లు సమకూర్చుకుంది.
  • డీఎంకే- రూ.656.5 కోట్లు
  • వైఎస్​ఆర్​ కాంగ్రెస్- రూ.442.8 కోట్లు
  • టీడీపీ- రూ. 181.35 కోట్లు
  • జేడీ(ఎస్)- రూ.89.75 కోట్లు (ఇందులో రూ.50 కోట్లు మెగా ఇంజినీరింగ్​ సంస్థ నుంచి)
  • శివసేన- రూ.60.4 కోట్లు
  • ఆర్​జేడీ- రూ.56 కోట్లు
  • సమాజ్​వాదీ పార్టీ - రూ.14.05 కోట్లు
  • అకాలీదళ్​- రూ.7.26 కోట్లు
  • ఏఐడీఎంకే- రూ.6.05 కోట్లు
  • నేషనల్​ కాన్ఫరెన్స్​- రూ.50 లక్షలు

తమకు ఎలక్టోరల్​ బాండ్ల ద్వారా ఎలాంటి విరాళాలు రాలేదని సీపీఎం. ఇక ఏఐఎంఐఎం​, బీఎస్​పీ కూడా తమకు బాండ్ల ద్వారా నగదు రాలేదని చెప్పాయి.

ఎన్నికల బాండ్లు చట్ట విరుద్ధం : సుప్రీం కోర్టు
ఎన్నికల బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018లో తీసుకొచ్చింది. దీనికింద ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 30 విడతల్లో దాదాపు 28వేల బాండ్లను ఎస్‌బీఐ విక్రయించింది. వీటి మొత్తం విలువ రూ.16,518 కోట్లు. అయితే, ఎన్నికల బాండ్ల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని పేర్కొంటూ కాంగ్రెస్‌ నేత జయా ఠాకుర్‌, అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌), సీపీఎం పిల్‌లు దాఖలు చేశాయి. వీటిపై విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎన్నికల బాండ్లు చట్టవిరుద్ధమైనవంటూ ఫిబ్రవరి 15న 232 పేజీల తీర్పును ఏకగ్రీవంగా వెలువరించింది.

ఎన్నికల షెడ్యూల్​లో మార్పులు- ఆ రాష్ట్రాల్లో కౌంటింగ్​ జూన్​ 4 బదులు ఈ తేదీన!

ఎన్నికల కోడ్​లో ఈ పనులు అస్సలు చేయకూడదు! ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Last Updated : Mar 17, 2024, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details